PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/pawan-kalyan-new-clicks-in-party-office415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/pawan-kalyan-new-clicks-in-party-office415x250-IndiaHerald.jpgరీల్ హీరో అయిన పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లోనూ రియ‌ల్ నాయ‌కుడు కావాల‌నుకుంటున్నాడు. ఆ దిశగా ఎన్న‌డో అడుగులు వేసిన త‌న నిర్ణ‌యాల ద్వారా రాజ‌కీయాల్లో పెద్దగా ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు జ‌న‌సేనాని ప‌వ‌న్‌. జన‌సేన పార్టీ పెట్టిన అనంత‌రం రాజ‌కీయాల‌ను పూర్తి స్థాయిలో ఒంట‌బ‌ట్టించుకోలేదు. ఇప్పుడు క్ర‌మంగా సినిమాలను వ‌దిలేసి రాజ‌కీయాల‌పైనే ఎక్కువ ఫోక‌స్ చేస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌నసేన పార్టీని ప్రారంభించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్కువ‌గా ఆంధ్ర‌లోనే తన రాజ‌కీయాల‌ను నిర్వ‌హించాడు. 20pawan kalyan {#}Hero;Telangana Rashtra Samithi TRS;TDP;YCP;Telugu;Telangana;Party;Congressతెలంగాణ‌లో ప‌వ‌న్ పాలిటిక్స్ ప్ర‌భావ‌మెంత‌..?తెలంగాణ‌లో ప‌వ‌న్ పాలిటిక్స్ ప్ర‌భావ‌మెంత‌..?pawan kalyan {#}Hero;Telangana Rashtra Samithi TRS;TDP;YCP;Telugu;Telangana;Party;CongressTue, 02 Nov 2021 10:57:54 GMTరీల్ హీరో అయిన పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లోనూ రియ‌ల్ నాయ‌కుడు కావాల‌నుకుంటున్నాడు. ఆ దిశగా ఎన్న‌డో అడుగులు వేసిన త‌న నిర్ణ‌యాల ద్వారా రాజ‌కీయాల్లో పెద్దగా ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు జ‌న‌సేనాని ప‌వ‌న్‌. జన‌సేన పార్టీ పెట్టిన అనంత‌రం రాజ‌కీయాల‌ను పూర్తి స్థాయిలో ఒంట‌బ‌ట్టించుకోలేదు. ఇప్పుడు క్ర‌మంగా సినిమాలను వ‌దిలేసి రాజ‌కీయాల‌పైనే ఎక్కువ ఫోక‌స్ చేస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌నసేన పార్టీని ప్రారంభించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్కువ‌గా ఆంధ్ర‌లోనే తన రాజ‌కీయాల‌ను నిర్వ‌హించాడు.


  2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లోనే జ‌న‌సేనాని చురుకుగా ఉంటున్నాడు. కానీ, తెలంగాణ‌లోనూ త‌న పార్టీ ఉంద‌నే విష‌యాన్ని మ‌ర్చిపోయిన‌ట్టు ఉంద‌ని గ‌తంలో అనేక విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. ఇటీవ‌ల తెలంగాణ‌లో జ‌న‌సేన ముఖ్యకార్త‌ల స‌మావేశాన్ని నిర్వ‌హించారు. అందులోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురించే ఎక్కువ‌గా మాట్లాడారు. అంతే కానీ, త‌రువాత మ‌ళ్లీ ఆంధ్ర‌పైనే త‌న ఫోక‌స్ ఉంచాడు.  ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో జ‌న‌సేన పార్టీ కీల‌కం కానుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.


 ఎందుకంటే అధికార పార్టీపై వ్య‌తిరేక‌త పెర‌గ‌డం, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.  ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల్లో కీలకంగా ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ‌గా ప్ర‌భావం చూపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో  తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ ప్ర‌భావం అంత‌గా ఉండ‌క‌పోవ‌చ్చ‌నే అభిప్రాయ‌ప‌డుతున్నారు.


ఎందుకంటే అధికార గులాబీ పార్టీకి గ‌ట్టి పోటీ ఇచ్చే విధంగా ప్ర‌తిప‌క్షాలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు త‌మ క‌ర్త‌వ్యాలను నిర్వ‌హిస్తున్నాయి. పైగా కొత్త‌గా ప‌వ‌న్ వ‌చ్చి మాట్లాడేది ఏమీ ఉండ‌ద‌నే మాట‌లు కూడా వినిపిస్తున్నాయి. గ‌తంలో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి రెండు రాష్ట్రాల్లోనూ వైసీపీ పెట్టి త‌రువాత తెలంగాణ‌పై పూర్తిగా ప‌ట్టు వ‌దిలేశారు. ఇదే క్ర‌మంలో జ‌న‌సేన కూడా ఆంధ్ర రాజ‌కీయాల్లో బిజీగా ఉండి తెలంగాణ రాజ‌కీయాల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌క‌పోవ‌చ్చని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.






దిల్ రాజ్ తో చేతులు కలుపుతున్న రాజమౌళి !

కెసిఆర్ vs ఈటెల: బాబోరి రేవంతుకి స్వతంత్ర అభ్యర్థి షాక్ !

పవన్ తో చిరంజీవి భేటీ...? అందుకేనా...?

తెలంగాణాలో షర్మిల తడబడుతుందా..? నిలబడుతుందా..?

జనసేన.. బీజేపీతోనేనా..!

కేసీఆర్ Vs ఈటెల: కారుకు పంక్చ‌ర్ వేస్తోన్న ఇండిపెండెంట్లు

కేసీఆర్ Vs ఈటెల: తొలిరౌండ్ వ‌చ్చేసింది..

జనసేనాని దూకుడుతో బీజేపీలోటెన్షన్..?

కేసీఆర్ Vs ఈటెల : అదే సీన్ రిపీట్ అవుతుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>