PoliticsN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/---------4a213e0a-c54c-4c5b-9026-528fe14f2937-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/---------4a213e0a-c54c-4c5b-9026-528fe14f2937-415x250-IndiaHerald.jpgదేశంలోనే ఎప్పుడూ..ఏ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌ని రీతిలో హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళితబంధు ప‌థ‌కాన్ని సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టారు. ద‌ళిత‌బంధు పైల‌ట్ ప్రాజెక్ట్ చేప‌ట్టే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నూటికి నూరు శాతం సాచ్యురేష‌న్‌తో అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇక్క‌డ దాదాపు ద‌ళిత జ‌నాభా 70వేల వ‌ర‌కు ఉంటారు. కానీ ద‌ళితబంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టినా కానీ ఓట‌ర్లు మాత్రం ఈట‌ల‌కు మొగ్గు చూపారు. ముఖ్యంగా శాలపల్లిలో కేసీఆర్ దళిత బంధు ప్రకటించాడు. అక్కడ సభ కూడా పెట్టాడు. #ఆధిక్యంలో బీజేపీ {#}KCR;CM;Bharatiya Janata Party;Congressకేసీఆర్ వర్సెస్ ఈటెల: దళిత బంధు దెబ్బ కొట్టింది ఎవరిని..? ఆ పల్లె మరీ ఇంత దారుణమా..?కేసీఆర్ వర్సెస్ ఈటెల: దళిత బంధు దెబ్బ కొట్టింది ఎవరిని..? ఆ పల్లె మరీ ఇంత దారుణమా..?#ఆధిక్యంలో బీజేపీ {#}KCR;CM;Bharatiya Janata Party;CongressTue, 02 Nov 2021 10:49:53 GMTదేశంలోనే ఎప్పుడూ..ఏ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌ని రీతిలో హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళితబంధు ప‌థ‌కాన్ని సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టారు. ద‌ళిత‌బంధు పైల‌ట్ ప్రాజెక్ట్ చేప‌ట్టే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నూటికి నూరు శాతం సాచ్యురేష‌న్‌తో అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇక్క‌డ దాదాపు ద‌ళిత జ‌నాభా 70వేల వ‌ర‌కు ఉంటారు. కానీ ద‌ళితబంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టినా కానీ ఓట‌ర్లు మాత్రం ఈట‌ల‌కు మొగ్గు చూపారు.  ముఖ్యంగా శాలపల్లిలో కేసీఆర్ దళిత బంధు ప్రకటించాడు. అక్కడ సభ కూడా పెట్టాడు.

 కానీ అక్కడ బీజేపీ లీడ్ సాధించింది. శాల‌ప‌ల్లి, చుట్టుప్ర‌క్క‌ల గ్రామాల ఓట‌ర్లు ఈటెల‌కే మ‌ద్ద‌తు ప‌లికారు. ఆ ప‌ల్లెలో ఫైలెట్ ప్రాజెక్ట్ ప్ర‌వేశ‌పెట్టినా ఇంత దారుణం చేస్తారా అంటూ ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక కౌంటింగ్  కొన‌సాగుతూనే ఉన్న‌ది.  పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో టీఆర్‌ఎస్ 344 ఓట్ల   ఆధిక్యం క‌న‌బ‌రిచింది. కానీ తొలి రెండు రౌండ్ ఫ‌లితాల‌లో మాత్రం బీజేపీ మెజార్టీ సాధించింది. మొద‌టి రౌండ్‌లో బీజేపీకి 4610, టీఆర్ఎస్‌కు 4444 ఓట్లు, కాంగ్రెస్ 119 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ రౌండ్‌లో 166 ఓట్ల ఆధిక్యాన్ని ద‌క్కించుకున్న‌ది బీజేపీ.

రెండు రౌండ్ల తరువాత బీజేపీ 358 ఓట్ల ఆధిక్యంలో కొన‌సాగింది. రెండవ రౌండ్ లో 193 ఓట్ల ఆధిక్యంలో, మూడో రౌండ్లో 911 ఓట్ల మెజార్టీతో  క‌మ‌లం దూసుకెళ్లింది.  గ‌త రెండు రౌండ్ల కంటే మూడో రౌండ్‌లో కాస్త ఎక్కువ మెజార్టి పొందారు. మూడు రౌండ్ల‌లో క‌లిపి 1269 ఓట్ల ఆధిక్యంలో ఈట‌ల కొన‌సాగుతున్నారు. మరోవైపు ఈసారి కూడ టీఆర్ఎస్‌కు స్వ‌తంత్ర అభ్య‌ర్థుల వ‌ల్ల ఇబ్బంది ఎదురైన‌ట్టు స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోంది. రోటిమేక‌ర్ గుర్తుకు  కొన్ని ఓట్లు బాగానే వ‌స్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌కు  ఈసీఈ గుర్తు  కేటాయించింది. కాంగ్రెస్ కంటే ఈ గుర్తుకే ఎక్కువ ఓట్లు పోలవ్వడం ఏమిట‌ని అంద‌రూ షాక్‌కు గుర‌వుతున్నారు. కాంగ్రెస్ నేత‌లు మాత్రం కాస్త నిరాశ చెందుతున్నారు.






దిల్ రాజ్ తో చేతులు కలుపుతున్న రాజమౌళి !

కెసిఆర్ vs ఈటెల: బాబోరి రేవంతుకి స్వతంత్ర అభ్యర్థి షాక్ !

పవన్ తో చిరంజీవి భేటీ...? అందుకేనా...?

తెలంగాణాలో షర్మిల తడబడుతుందా..? నిలబడుతుందా..?

జనసేన.. బీజేపీతోనేనా..!

కేసీఆర్ Vs ఈటెల: కారుకు పంక్చ‌ర్ వేస్తోన్న ఇండిపెండెంట్లు

కేసీఆర్ Vs ఈటెల: తొలిరౌండ్ వ‌చ్చేసింది..

జనసేనాని దూకుడుతో బీజేపీలోటెన్షన్..?

కేసీఆర్ Vs ఈటెల : అదే సీన్ రిపీట్ అవుతుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>