PoliticsDeekshitha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan4b35bf26-b327-4662-bd76-18b6ee5734f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan4b35bf26-b327-4662-bd76-18b6ee5734f2-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలను బాగానే ఒంట బట్టించుకున్నారు. పార్టీ పెట్టిన కొత్తల్లో పవన్, ఇతర పార్టీల రాజకీయ నేతల నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఒక నిర్దిష్టమైన రాజకీయ ఆలోచన లేదని.. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదని..ఇలా అనేకానేక విమర్శలను మూటగట్టుకున్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారని.. అందుకే పవన్ రాజకీయాల్లో వెనుక పడ్డారని కూడా అంటుంటారు. బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ.. వాటిని ఓట్లుగా మలుచుకోవడంలో పవన్ విఫలమయ్యారని చెప్పుకుంటారు. రాజకీయ వ్యూహాలను రచించడంలోనూ పవన్ వెనుకpawan kalyan{#}GEUM;Janasena;MP;kalyan;Pawan Kalyan;Vishakapatnam;Party;YCP;Bharatiya Janata Partyపొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ మైండ్ గేమ్..!పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ మైండ్ గేమ్..!pawan kalyan{#}GEUM;Janasena;MP;kalyan;Pawan Kalyan;Vishakapatnam;Party;YCP;Bharatiya Janata PartyTue, 02 Nov 2021 09:02:45 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలను బాగానే ఒంట బట్టించుకున్నారు. పార్టీ పెట్టిన కొత్తల్లో పవన్, ఇతర పార్టీల రాజకీయ నేతల నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఒక నిర్దిష్టమైన రాజకీయ ఆలోచన లేదని.. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదని..ఇలా అనేకానేక విమర్శలను మూటగట్టుకున్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారని.. అందుకే పవన్ రాజకీయాల్లో వెనుక పడ్డారని కూడా అంటుంటారు. బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ.. వాటిని ఓట్లుగా మలుచుకోవడంలో పవన్ విఫలమయ్యారని చెప్పుకుంటారు. రాజకీయ వ్యూహాలను రచించడంలోనూ పవన్ వెనుకబడ్డారని అనుకుంటారు.

అయితే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూటు మార్చారు. గతంలో చెప్పినట్టుగానే అసలుసిసలు రాజకీయం మొదలు పెట్టారు. ఎవరికీ అంతుచిక్కని రాజకీయ పరిణితి ప్రదర్శిస్తున్నారు. గతంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నామో చెప్పి.. మద్దతు ఇచ్చేవారు. అయితే ఇపుడు మాత్రం ఏ పార్టీతో కలిసి కొనసాగుతామో చెప్పకుండా అధికార పార్టీని ఆడుకుంటున్నారు. తాజాగా విశాఖ ఉక్కు ఆందోళన సభలోనూ బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. కేవలం వైసీపీనే టార్గెట్ చేశారు. కేంద్రాన్ని ప్రశ్నించకుండా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. రాజీనామాలు చేసి.. విశాఖ ఉక్కు పోరాటాన్ని నడిపించాలని కోరారు.

పవన్ కళ్యాణ్ లో వచ్చిన ఈ  మార్పు చూస్తుంటే ఆయన పక్కా ప్రణళిక ప్రకారమే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. పవన్ కల్యాణ్ ఈసారి వైసీపీతో పాటూ టీడీపీతో కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఉంటారా లేక రాష్ట్రంలో టీడీపీతో ఉంటారా అనే విషయం చెప్పకుండా సస్పెన్స్ లో ఉంచారు. దీంతో వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు పవన్ స్ట్రాటజీ ఏమిటో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ను గతంలో టీడీపీ, బీజేపీ నేతలు తమ అవసరాలకు ఉపయోగించుకున్నారు. అధికారంలోకి వచ్చాక పవన్ ను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇవన్నీ గుర్తించిన పవన్, ఈ కొత్త ప్లాన్ ను అమలుచేస్తున్నారు. చివరగా ఎన్నికల సమయానికి తనకు ఎలా లాభసాటిగా ఉంటుందో అలా వెళ్లాలని అనుకుంటున్నారు. మొత్తమ్మీద పవన్ ఈసారి మంచి స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు.



కోహ్లీ కూతురికి రేప్ వార్నింగ్ !

హుజురాబాద్‌: కేసీఆర్‌ను నేలకు దింపిన ఈటల..!?

పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజ

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. వారికి ప్రాణభయం..

వై.ఎస్‌.షర్మిల.. ఆ ధైర్యానికి సలాం..?

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Deekshitha Reddy]]>