PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/stalin79b80451-e93d-44da-85e5-eb4e87cadec2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/stalin79b80451-e93d-44da-85e5-eb4e87cadec2-415x250-IndiaHerald.jpgధర్మకర్తలు అంటే గతంలో తమ ఆస్తులను దేవాలయాలకు ఇచ్చినవారు, కానీ ఇప్పుడు ఆ స్థానంలోకి రాజకీయనేతలు. ఊరికే వచ్చే ఆస్తులు తినడానికి బాగా పనికి వచ్చింది ఇది. ఆలయాల మాన్యాలను రాజకీయ నేతలు దోచుకుతింటుంటే దానికి సంబందించిన మత పెద్దలు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. దేవదాయశాఖలో ఆలయాలకు సంబందించిన వారు లేదా పీఠాలకు సంబందించిన పెద్దలు ఉండి వాటిని జాగర్తగా చూసుకుంటే సరిపోతుంది, కానీ ఎక్కడ ఆదాయం వచ్చే దేవాలయం కనపడితే అక్కడ ఈ రాజకీయ నేతలు వాలిపోతూ, ఆయా ఆస్తులను బొక్కేస్తున్నారు. ప్రభుత్వాలు ఆస్తులను సృష్టించడం పకtemplelandsstalin;{#}udhayanidhi stalin;Stalin;courtఆలయాలు : స్టాలిన్ కు.. కోర్టు స్టే..!ఆలయాలు : స్టాలిన్ కు.. కోర్టు స్టే..!templelandsstalin;{#}udhayanidhi stalin;Stalin;courtTue, 02 Nov 2021 09:35:14 GMTధర్మకర్తలు అంటే గతంలో తమ ఆస్తులను దేవాలయాలకు ఇచ్చినవారు, కానీ ఇప్పుడు ఆ స్థానంలోకి రాజకీయనేతలు. ఊరికే వచ్చే ఆస్తులు తినడానికి బాగా పనికి వచ్చింది ఇది. ఆలయాల మాన్యాలను రాజకీయ నేతలు దోచుకుతింటుంటే దానికి సంబందించిన మత పెద్దలు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. దేవదాయశాఖలో ఆలయాలకు సంబందించిన వారు లేదా పీఠాలకు సంబందించిన పెద్దలు ఉండి వాటిని జాగర్తగా చూసుకుంటే సరిపోతుంది, కానీ ఎక్కడ ఆదాయం వచ్చే దేవాలయం కనపడితే అక్కడ ఈ రాజకీయ నేతలు వాలిపోతూ, ఆయా ఆస్తులను బొక్కేస్తున్నారు. ప్రభుత్వాలు ఆస్తులను సృష్టించడం పక్కన పెడితే, ఇలా దేవాలయాల ఆస్తులను దోచుకుంటున్నారు.

దేవాలయ మాన్యాలు ఎన్నో ఇప్పుడు కోర్టు కేసులలో నలిగిపోవడానికి ఈ స్వార్ధ రాజకీయ నేతలు కారణం. గతంలో పెద్దలు ఆలోచించి, ఆలయానికి ఎంతో దూరం నుండి వచ్చిన వారి కి సౌకర్యాలు అందించడం కోసం భూములను దేవాలయాలకు ఇచ్చేవారు. వాటి నుండి వచ్చే ఆదాయం, ఉత్పత్తులు, అప్పుడప్పుడు కాస్త భూమి లో చిన్న పాటి సత్రాలు వంటివి నిర్మించి దూరం నుండి వచ్చిన భక్తులకు ఆహారం, విడిది కలిపించేందుకు ఇవన్నీ ఉపయోగించేవారు. అప్పట్లో ఎక్కడకు వెళ్లాలన్న నడిచే వెళ్లాల్సి వచ్చేది, అందుకే ఈ ఏర్పాట్లు చేశారు. కానీ నేడు ఎక్కడకు వెళ్లాలన్నా రవాణా సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఆ మాన్యాలు విరివిగా అన్నదానాలు చేసేందుకు ఉపయోగించడం జరుగుతుంది. అందులో నుండే అర్చకుల జీతాలు లాంటివి ఇస్తున్నారు.

దేవాదాయ శాఖ అంటూ వచ్చిన తరువాత ఆలయ మాన్యాల జోలికి రాజకీయ నేతలు వెళ్లడం బాగా ఎక్కువ అయ్యింది. దీనితో మాన్యాలు కనుమరుగయ్యాయి. కొన్ని కోర్టులలో మగ్గిపోతున్నాయి. దానికోసం కూడా ఆయా ఆలయాల అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇంకా ఘోరం ఏమంటే, ఆలయాలలో ఉన్న సామాన్లు, ఇతరత్రా ఆస్తులను కూడా అమ్ముకు తినే ప్రభుత్వాలు తయారయ్యాయి. అందుకే అలాంటి పనికి ఉపక్రమిస్తున్న స్టాలిన్ ప్రభుత్వంపై కోర్టు స్టే విధించింది. ఆయన ఇటీవల అన్ని మంచిపనులు చేస్తూ ప్రభుత్వం, నేతల పై ప్రజలలో సదాభిప్రాయాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారు. అది మంచిదే కానీ ఈ విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.



కేసీఆర్ Vs ఈటెల : ఆ ఆరేలు ఎంత ప‌నిచేసిందంటే?

కేసీఆర్ Vs ఈటెల: తొలిరౌండ్ వ‌చ్చేసింది..

జనసేనాని దూకుడుతో బీజేపీలోటెన్షన్..?

కేసీఆర్ Vs ఈటెల : అదే సీన్ రిపీట్ అవుతుందా?

హుజురాబాద్‌: కేసీఆర్‌ను నేలకు దింపిన ఈటల..!?

పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజ

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. వారికి ప్రాణభయం..

వై.ఎస్‌.షర్మిల.. ఆ ధైర్యానికి సలాం..?

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>