PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/blastsinafghan-e35a0a5d-eef3-4f99-bbe1-1f32a52bb993-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/blastsinafghan-e35a0a5d-eef3-4f99-bbe1-1f32a52bb993-415x250-IndiaHerald.jpgఆఫ్ఘన్ ను తాలిబన్ లు ఆక్రమించుకున్నప్పటి నుండి అక్కడ పరిస్థితులు భయానకంగానే మారిపోతున్నాయి. మొదటిలో అందరు తాలిబన్ లు ప్రశాంతగా పాలిస్తారేమో అనుకుంటూ కాస్త అత్యాశపడ్డారు. కానీ వాళ్లకు గుర్తింపు ఇవ్వడానికి ప్రపంచదేశాలు వెనుకాడటంతో ఇష్టానికి పేట్రేగిపోతున్నారు. వాళ్ళ అసలు రూపాన్ని చూపిస్తున్నారు. ఇప్పటికే అక్కడ రోజు బాంబుల మోత నిపిస్తూనే ఉంది. తాజాగా రాజధాని కాబూల్‌లో మరో దారుణం జరిగింది. నేడు కాబూల్‌లో రెండు చోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలలో 19 మంది మృత్యువాతపడ్డారు, మరో 50 మందికి పైగా గాయపడ్డారు. blastsinafghan;{#}American Samoa;Capital;Government;INTERNATIONALఆఫ్ఘన్ లో.. ఆగని పేలుళ్ల పర్వం..!ఆఫ్ఘన్ లో.. ఆగని పేలుళ్ల పర్వం..!blastsinafghan;{#}American Samoa;Capital;Government;INTERNATIONALTue, 02 Nov 2021 21:32:21 GMTఆఫ్ఘన్ ను తాలిబన్ లు ఆక్రమించుకున్నప్పటి నుండి అక్కడ పరిస్థితులు భయానకంగానే మారిపోతున్నాయి. మొదటిలో అందరు తాలిబన్ లు ప్రశాంతగా పాలిస్తారేమో అనుకుంటూ కాస్త అత్యాశపడ్డారు. కానీ వాళ్లకు గుర్తింపు ఇవ్వడానికి ప్రపంచదేశాలు వెనుకాడటంతో ఇష్టానికి పేట్రేగిపోతున్నారు. వాళ్ళ అసలు రూపాన్ని చూపిస్తున్నారు. ఇప్పటికే అక్కడ రోజు బాంబుల మోత నిపిస్తూనే ఉంది. తాజాగా రాజధాని కాబూల్‌లో మరో దారుణం జరిగింది. నేడు కాబూల్‌లో రెండు చోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలలో 19 మంది మృత్యువాతపడ్డారు, మరో 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ పేలుళ్లకు కారణం మాత్రం తెలియలేదు. నేడు జరిగిన రెండు పేలుళ్లలో ఒకటి మిలిటరీ ఆసుపత్రి గేట్ వద్ద చోటుచేసుకోగా, మరో పేలుడు ఆసుపత్రికి సమీపంలో జరిగింది. ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్న వ్యక్తులు ప్రత్యక్షంగా చెప్పినదాని బట్టి, నేను ఆస్పత్రి లోపల ఉన్నాను. మొదటి చెక్‌పాయింట్ వద్ద నుండి పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. అప్పుడు అధికారులు అందరిని సురక్షిత గదులకు వెళ్లమని చెప్పారు. నేను తుపాకీ కాల్పులు కూడా విన్నాను అని కాబూల్‌లోని సర్దార్ మహ్మద్ దౌద్ ఖాన్ ఆసుపత్రి వైద్యుడు చెప్పాడు. ఆ ఆసుపత్రి భవనంలో కాల్పుల శబ్దం నాకు ఇప్పటికీ వినిపిస్తోందని అన్నారు.

2017లో కూడా ఈ ఆసుపత్రిపై దాడి జరిగింది, వైద్య సిబ్బంది వేషంలో వచ్చిన ముష్కరులు 30 మందిని కాల్చి చంపారు. ఘటనా స్థలానికి తాలిబాన్ ప్రత్యేక బలగాలు చేరుకుని నిందితుల కోసం గాలిస్తున్నామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఖారీ సయీద్ ఖోస్తీ తెలిపారు. ఈ పేలుడు వల్ల ప్రాణ నష్టం జరిగింది, ఆ వివరాలు తరువాత వెల్లడిస్తామని ఆయన చెప్పాడు. ఈ పేలుళ్లకు సంబంధించి సామజిక మాధ్యమాలలో ఫోటోలు కూడా పెట్టారు. ఆ ఫోటోలలో పేలుళ్ల తర్వాత గాలిలోకి నల్లటి పొగలు కమ్ముకున్నట్లు కనిపించాయి.

ఈ నెలలోనే 15న కాందహార్‌లోని ఇమాన్ బార్గా మసీదులో మూడు బాంబు పేలుళ్లు సంభవించాయి. అప్పుడు షియా మసీదుపై జరిగిన బాంబు దాడిలో 50 మందికిపైగా మరణించారు. ఆఫ్ఘన్ నుంచి అమెరికా సేన వైదొలగిన తరువాత జరిగిన ఆ అతిపెద్ద దాడికి తామే కారణమని ఐఎస్-కే ప్రకటించుకుంది. తాలిబాన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న ఐఎస్-కే ఆఫ్ఘన్ లో అనేక దాడులకు పాల్పడుతోంది. రాజకీయ నాయకులు, భద్రతా దళాలు, మంత్రిత్వ కార్యాలయాలను, తాలిబాన్లను, అమెరికా, నాటో సేనలను, అంతర్జాతీయ సహాయ సంస్థలను, షియా మైనారిటీలు, సిక్ మైనారిటీ తదితర వర్గాలను వీరు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు.



బాలయ్య గాయానికి కారణం ఆయనేనా...?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!

వచ్చేది బి.జె.పి - జనసేన ప్రభుత్వం !

కేసీఆర్ Vs ఈటెల : 16వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>