PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/china-taliban-08f63749-b12e-4d24-be26-03b732c2717d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/china-taliban-08f63749-b12e-4d24-be26-03b732c2717d-415x250-IndiaHerald.jpgఅఫ్ఘానిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి... అధికారం చేపట్టిన తాలిబన్లు... ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు కోసం నానా పాట్లు పడుతున్నారు. ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఆఫ్ఘాన్లు.... ఇప్పుడు ఆహార కొరతతో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సాయం కోసం అన్ని పెద్ద దేశాలతో సంప్రదింపులు జరిపేందుకు కూడా తాలిబన్ పెద్దలు రెడీ అయ్యారు. అయితే ఎవరూ ముందుకు రాలేదు. కానీ భారత దేశం మాత్రం మానవతా ధృక్పదంతో ముందుకు వచ్చింది. ఏకంగా 56 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను ఆఫ్ఘాన్లకు అందించేందుకు రెడీTalibans{#}INTERNATIONAL;Narendra Modi;Parliment;Indiaభారత్‌తో దోస్తీకి తాలిబన్లు సై...!భారత్‌తో దోస్తీకి తాలిబన్లు సై...!Talibans{#}INTERNATIONAL;Narendra Modi;Parliment;IndiaTue, 02 Nov 2021 18:45:33 GMTఅఫ్ఘానిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి... అధికారం చేపట్టిన తాలిబన్లు... ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు కోసం నానా పాట్లు పడుతున్నారు. ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఆఫ్ఘాన్లు.... ఇప్పుడు ఆహార కొరతతో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సాయం కోసం అన్ని పెద్ద దేశాలతో సంప్రదింపులు జరిపేందుకు కూడా తాలిబన్ పెద్దలు రెడీ అయ్యారు. అయితే ఎవరూ ముందుకు రాలేదు. కానీ భారత దేశం మాత్రం మానవతా ధృక్పదంతో ముందుకు వచ్చింది. ఏకంగా 56 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను ఆఫ్ఘాన్లకు అందించేందుకు రెడీ అయ్యింది. గతంలో ఆఫ్ఘానిస్థాన్‌ర దేశంలో భారత్ భారీగా పెట్టుబడులు పెట్టింది. వాటిని కాపాడుకునేందుకు... అలాగే తాలిబన్ల నుంచి భారత్‌కు ఎలాంటి ముప్పు రాకుండా ఉండేందుకు మోదీ సర్కార్ మెగా ప్లాన్ వేసింది. భారత్ - ఆఫ్ఘాన్ మధ్య దౌత్య సంబంధాలు మెరుగు పరిచేందుకు.... దౌత్య వేత్తలను కూడా నియమించాలని భారత్ సూచించింది. భారత్ చేసిన సూచనను తాలిబన్లు కూడా అంగీకారం తెలిపారు.

ప్రస్తుతం ఆఫ్ఘానిస్థాన్‌లో పార్లమెంట్ భవనాన్ని భారత్ కట్టించి ఇచ్చింది. అలాగే అక్కడ మౌలిక వసతుల కల్పనలో భాగంగా... రహదారులు నిర్మించింది. భారీగా పెట్టుబడులు కూడా పెట్టింది. కానీ తాలిబన్ల చేతికి ఆఫ్ఘాన్ చిక్కడంతో... తమకు కూడా ముప్పు తప్పదని భారత్ భావించింది. అందుకే ఈ వ్యవహారంలో ఏ మాత్రం తొందరపడకుండా ఆచితూచి వ్యవహరించింది మోదీ సర్కార్. ఇదే సమయంలో తాలిబన్ సర్కార్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ఇందుకోసం భారీ సాయం చేసేందుకు ఓకే చెప్పింది. దీని ద్వారా ఆఫ్ఘాన్‌పై పట్టు సాధించే అవకాశం కూడా భారత్‌కు ఉంది. అటు తాలిబన్లు కూడా అంతర్జాతీయ గుర్తింపు కోసం ఎంతో తాపత్రయ పడుతున్నారు. ఇప్పటికే ఇస్లామికే దేశాలు కూడా తాలిబన్లను బహిష్కరించడంతో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ సమయంలో... భారత్ అందించే సాయంతో పాటు వారి కండిషన్లను కూడా తాలిబన్లు అంగీకరించారు. అంతర్జాతీయ గుర్తింపు కోసం తాలిబన్లు భారత సాయం తీసుకుంటున్నారు కూడా.



కేసీఆర్ Vs ఈటెల: ఆ ఒక్క కారణంతో ఓడిపోయాం: హరీష్

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!

వచ్చేది బి.జె.పి - జనసేన ప్రభుత్వం !

కేసీఆర్ Vs ఈటెల : 16వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>