• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పేరు ప్రకటించేశారు: సోనియాకు రాజీనామా లేఖ, సిద్ధూపై తీవ్ర వ్యాఖ్యలు

|

ఛండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన కొత్త పార్టీ పేరు ప్రకటించేశారు. తన పార్టీ పేరు 'పంజాబ్ లోక్ కాంగ్రెస్‌'గా ఆయన మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఇదే సమయంలో అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు.

కాగా, తన రాజీనామా లేఖలో పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై విరుచుకపడ్డారు. పంజాబ్‌కు చెందిన పార్టీ ఎంపీలందరూ మూకుమ్మడిగా వ్యతిరేకించినా సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా మీరు నియమించారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ భజ్వాను సిద్ధూ బహిరంగంగా ఆలింగనం చేసుకున్నారని మండిపడ్డారు,

 Amarinder Singh Announces New Party Punjab Lok Congress: Resignation To Congress party

మీ చర్యలు తనను గాయపరిచినట్లు సోనియాగాంధీకి రాసిన ఆ లేఖలో అమరీందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. రాజీవ్ గాంధీతో తనకు పాఠశాల రోజుల నుంచే 67 ఏళ్ల అనుబంధం(1954 నుంచి) ఉందని గుర్తు చేసుకున్నారు అమరీందర్ సింగ్. రాహుల్ గాంధీ, ప్రియాంగ గాంధీలను తన బిడ్డలతో సమానంగా ప్రేమిస్తున్నట్లు తెలిపారు. పంజాబ్ రాష్ట్రం, దేశ ప్రయోజనాల కోసం తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టంచేశారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు అమరీందర్ సింగ్ ఇది వరకే ప్రకటించారు. ఇప్పటికే రెండు సార్లు కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు అమరీందర్ సింగ్. పంజాబ్ రాష్ట్ర పరిస్థితులు, రాజకీయాలపై షాతో చర్చించారు. మరోవైపు, శిరోమణి అకాలీదళ్ చీలికవర్గంతో పొత్తు ఉండే అవకాశముందన్నారు. పొత్తు లేకపోయినా అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేస్తే.. అక్కడి నుంచి తాము కూడా పోటీ చేస్తామన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ రాష్ట్రానికే కాదు, దేశ భద్రతకు కూడా పెను ప్రమాదమని అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో అతడ్ని సీఎం కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

English summary
Amarinder Singh Announces New Party 'Punjab Lok Congress': Resignation To Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X