PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/huzurabade29fd257-f7f6-43db-92a0-d9cb17f37358-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/huzurabade29fd257-f7f6-43db-92a0-d9cb17f37358-415x250-IndiaHerald.jpgకొన్ని నెల‌లుగా తెలంగాణ‌లో తీవ్ర ఆస‌క్తిగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికలో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుంద‌నేది కొన్ని గంట‌ల్లో తేలిపోనుంది. ఇప్ప‌టికే క‌రీంన‌గ‌ర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ క‌ళాశాల‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభమ‌వుతుంది. మొద‌టి అర‌గంట‌లో పోస్ట‌ల్ ఓట్లు లెక్కించ‌నున్నారు. ఆ త‌రువాత ఈవీఎంల కౌంటింగ్ మొద‌ల‌వుతుంది. మొత్తం 22 రౌండ్‌ల‌లో ఓట్ల లెక్కింపు జ‌ర‌గనుంది. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠగా మారింది. సీఎం కేసీఆhujurabad bypole{#}AdiNarayanaReddy;CM;Degree;Party;Telangana Rashtra Samithi TRS;Huzurabad;Bharatiya Janata Partyకేసీఆర్ vs ఈట‌ల‌ : హుజురా`బాద్‌షా` ఎవ‌రు.. కౌంటింగ్‌పై ఉత్కంఠ‌..!కేసీఆర్ vs ఈట‌ల‌ : హుజురా`బాద్‌షా` ఎవ‌రు.. కౌంటింగ్‌పై ఉత్కంఠ‌..!hujurabad bypole{#}AdiNarayanaReddy;CM;Degree;Party;Telangana Rashtra Samithi TRS;Huzurabad;Bharatiya Janata PartyTue, 02 Nov 2021 07:40:00 GMTహుజురాబాద్ ఉప ఎన్నికలో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుంద‌నేది కొన్ని గంట‌ల్లో తేలిపోనుంది. ఇప్ప‌టికే క‌రీంన‌గ‌ర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ క‌ళాశాల‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభమ‌వుతుంది. మొద‌టి అర‌గంట‌లో పోస్ట‌ల్ ఓట్లు లెక్కించ‌నున్నారు. ఆ త‌రువాత ఈవీఎంల కౌంటింగ్ మొద‌ల‌వుతుంది. మొత్తం 22 రౌండ్‌ల‌లో ఓట్ల లెక్కింపు జ‌ర‌గనుంది.

 
 అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠగా మారింది. సీఎం కేసీఆర్ వ‌ర్సెస్ ఈట‌ల గా సాగిన ఈ ఉప పోరులో ఈట‌ల‌దే పై చేయి అవుతుంద‌ని స‌ర్వేలు ఇప్ప‌టికే తేల్చేసాయి. అలాగే, ఈట‌ల రాజేంద‌ర్ గెలుపై దీమా వ్య‌క్తం చేస్తున్నా ఆ పార్టీ నేత‌లు. హుజురాబాద్ నియోజ‌క ప్ర‌జ‌లు ఈట‌ల‌కే ఓటు వేశార‌ని చెబుతున్నారు. వాళ్లకు ఎగ్జిట్ పోల్స్ మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది. ఒక‌టి రెండు సంస్థ‌లు మిన‌హా మిగ‌తా సంస్థ‌లు అన్ని ఈట‌ల‌కే ప‌ట్టం క‌ట్టాయి.


రెండు ల‌క్ష‌ల‌కు పైగా ఉన్న హుజురాబాద్ ఓట‌ర్లు  ఎటు మొగ్గు చూపారో తెలుసుకోవాలంటే మ‌రి కొన్ని గంట‌లు వేచి చూడాల్సిందే.  విజ‌యం త‌మ‌దే అంటూ ఈట‌ల రాజేంద‌ర్ ఎన్నిక‌లో రోజే ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ చెప్పుకొచ్చాడు త‌న‌కు ఓట్లు వేసిన ప్ర‌జ‌లంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు కూడా. ఇదే క్ర‌మంలో అధికార టీఆర్ఎస్ పార్టీ కానీ, పార్టీ నేత‌లు కానీ హుజురాబాద్ ఉప ఎన్నికపై మౌనంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడే ఎందుకు ఫ‌లితాలు వెలువ‌డ్డాకా మాట్లాడుదామ‌నుకున్నారా లేదా తెలియ‌దు.


 ఆది నుంచి గెలుపుపై ధీమా వ్య‌క్తం చేసిన టీఆర్ఎస్ నేత‌లు ఎన్నిక త‌రువాత నోరు విప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. టీఆర్ఎస్ నుంచి బ‌రిలో ఉన్న‌  గెల్లు శ్రీ‌నివాస్‌, బీజేపీ నుంచి పోటీలో ఉన్న ఈట‌ల రాజేంద‌ర్.. వీళ్లిద్ద‌రిలో ఎవ‌రు గెలుస్తార‌నే అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కౌంటింగ్ సగం పూర్త‌య్యే స‌రికి విజ‌యం ఎవ‌రిదో తెలిసి పోతుందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. మ‌రి హుజురాబాద్‌పై ఎవ‌రి జెండా ఎగురుతుందో.


జనసేనాని దూకుడుతో బీజేపీలోటెన్షన్..?

కేసీఆర్ Vs ఈటెల : అదే సీన్ రిపీట్ అవుతుందా?

హుజురాబాద్‌: కేసీఆర్‌ను నేలకు దింపిన ఈటల..!?

పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజ

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. వారికి ప్రాణభయం..

వై.ఎస్‌.షర్మిల.. ఆ ధైర్యానికి సలాం..?

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>