PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-c877bda2-257e-4004-b37f-03ed8b88aba0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-c877bda2-257e-4004-b37f-03ed8b88aba0-415x250-IndiaHerald.jpgతాను తీసిన గొతిలోనే తానే ప‌డ్డ చందంగా కాంగ్రెస్ ప‌రిస్థితి మారింది అని చెప్పొచ్చు. తెలంగాణ‌లో కాంగ్రెస్ కనుమ‌రుగు అయ్యే ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్న సంద‌ర్భంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావ‌డం హ‌స్తం పార్టీకి ఊపిరిలూదిన‌ట్ట‌యింది. ఏడారిలో మంచినీళ్ల బావి దొరికిన‌ట్టుగా తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రూపంలో కొత్త ఆశ‌ల‌కు రూపం దొరికిన‌ట్ట‌యింది. దీంతో పాటు ఆ పార్టీ నేత‌లు, శ్రేణులు కూడా రేవంత్ అన్న తోపు ద‌మ్ముంటే ఆపు అన్నట్టుగా రెచ్చిపోయారు. కానీ, ఇదంతా ఒక్క‌సారిగా తారుమార‌యింది. రేవంత్ రెడ్డి revanth reddy{#}revanth;Revanth Reddy;Huzurabad;Party;Congress;Telanganaకేసీఆర్ vs ఈట‌ల‌ : రేవంత్‌ ద‌యా..కాంగ్రెస్ కొంప కొల్లేరు..?కేసీఆర్ vs ఈట‌ల‌ : రేవంత్‌ ద‌యా..కాంగ్రెస్ కొంప కొల్లేరు..?revanth reddy{#}revanth;Revanth Reddy;Huzurabad;Party;Congress;TelanganaTue, 02 Nov 2021 12:36:41 GMTతాను తీసిన గొతిలోనే తానే ప‌డ్డ చందంగా కాంగ్రెస్ ప‌రిస్థితి మారింది అని చెప్పొచ్చు. తెలంగాణ‌లో కాంగ్రెస్ కనుమ‌రుగు అయ్యే ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్న సంద‌ర్భంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావ‌డం హ‌స్తం పార్టీకి ఊపిరిలూదిన‌ట్ట‌యింది. ఏడారిలో మంచినీళ్ల బావి దొరికిన‌ట్టుగా తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రూపంలో కొత్త ఆశ‌ల‌కు రూపం దొరికిన‌ట్ట‌యింది. దీంతో పాటు ఆ పార్టీ నేత‌లు, శ్రేణులు కూడా రేవంత్ అన్న తోపు ద‌మ్ముంటే ఆపు అన్నట్టుగా రెచ్చిపోయారు. కానీ, ఇదంతా ఒక్క‌సారిగా తారుమార‌యింది.


  రేవంత్ రెడ్డి టీపీసీసీ ప‌ద‌వి అలంక‌రించిన త‌రువాత వ‌చ్చిన మొద‌టి ఎన్నిక‌ హుజురాబాద్ ఉప పోరు.  ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాల్సిన ఈ బై ఎల‌క్ష‌న్‌ను రేవంత్ ఆది నుంచి లైట్‌గా తీసుకున్నాడ‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.  అభ్య‌ర్థి ఎంపిక నుంచి ప్ర‌చారం వ‌ర‌కు అన్నింటిలో రేవంత్ రెడ్డి ఘోరంగా విఫ‌ల‌మ‌వ‌తూ వ‌చ్చాడ‌నే మాట‌లు కూడా విన‌బ‌డుతున్నాయి. బ‌లహీన‌మైన అభ్య‌ర్థిని ఎంపిక చేసిన‌ప్పుడే కాంగ్రెస్ ఓడిపోయింద‌నే సంకేతాలు క‌నిపించాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.


గతంలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు త‌న క‌నీస ఓటు బ్యాంకును కూడా నిల‌బెట్టుకోలేదు.  అధికార పార్టీకి గుణ‌పాఠం చెప్పాల‌ని లోపాయికారిగా రేవంత్ రెడ్డి  ఈట‌ల రాజేంద‌ర్ గెల‌పు కోసం పని చేశాడని స్వ‌యంగా ఆ పార్టీ నేత‌లే గుస‌గుస‌లాడుకున్నారు. చెట్టు మీద ఉన్న పిట్ట‌ను కొట్ట‌డానికి తాను కూర్చున్న కొమ్మ‌నే న‌రికివేసుకున్న చందంగా రేవంత్ రెడ్డి తీరు ఉంద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.


  హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ బ‌లంగా ఉన్న మండ‌లాల్లో కూడా ఈట‌ల‌కే ఎక్కువ‌గా ఓట్లు ప‌డ్డాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇక‌ పుంజుకోలేద‌ని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి నిర్ణ‌యాలే హుజురాబాద్‌లో కాంగ్రెస్ ఘోర‌ప‌రాజ‌యం పాల‌వ్వ‌డానికి, క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్కించుకునే స్థాయిలో లేకుండా చేశాయన్న ఆరోప‌ణలు వ‌స్తున్నాయి. మొత్తానికి హుజురాబాద్ ప‌రాభవం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ప్ర‌తికూలంగా మారనుంద‌ని తెలుస్తోంది.





ఏపీలో.. ఎయిడెడ్ నాడు నేడుకు పనికిరాదా..!

అనసూయ కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటుందా...?

బ‌ద్వేలు: వైసీపీ బంప‌ర్ విక్ట‌రీ... మెజార్టీ ఇదే

కేసీఆర్ Vs ఈటెల : ఇంటి పార్టీలో దొంగ ఎవ‌డ్రా?

అస్సాం, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ హ‌వా..!

సిద్దిపేట కలెక్టర్ కు హై కోర్టు వార్నింగ్ !

కేసీఆర్ Vs ఈటెల: ఓట్లు అమ్ముకోవ‌డంలో కాంగ్రెస్ స‌క్సెస్‌

మోదీని అనుసరిస్తున్న జగన్...!

బ‌ద్వేలు: ఏడో రౌండ్‌లో వైసీపీ మెజార్టీ ఇదే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>