SportsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/team-india-0a38578f-df74-4f9f-ad32-ad73e1f28c3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/team-india-0a38578f-df74-4f9f-ad32-ad73e1f28c3d-415x250-IndiaHerald.jpgఅబుదాబి వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో చెత్త ప్రదర్శన చేస్తున్న జట్టు ఏది అంటే ఠక్కున చెప్పే సమాధానం టీమిండియా మాత్రమే. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ సేన పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత జరిగిన న్యూజీలాండ్ మ్యాచ్‌లో కూడా భారత జట్టు సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. వరుసగా రెండు ఓటములతో ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఖాతా కూడా తెరవలేక పోయింది. పైగా సెమీస్ ఆశలు కూడా క్లిష్టం చేసుకుంది. ఇప్పటికే టీమిండియా వైఫల్యంపై అటు జట్టు కెప్టెన్ విరాట్ కోహTeam India{#}ravi shastri;VIRAT KOHLI;Pakistanటీమిండియాలో గ్రూప్ రాజకీయాలు...!టీమిండియాలో గ్రూప్ రాజకీయాలు...!Team India{#}ravi shastri;VIRAT KOHLI;PakistanTue, 02 Nov 2021 22:08:04 GMTఅబుదాబి వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో చెత్త ప్రదర్శన చేస్తున్న జట్టు ఏది అంటే ఠక్కున చెప్పే సమాధానం టీమిండియా మాత్రమే. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ సేన పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత జరిగిన న్యూజీలాండ్ మ్యాచ్‌లో కూడా భారత జట్టు సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. వరుసగా రెండు ఓటములతో ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఖాతా కూడా  తెరవలేక పోయింది. పైగా సెమీస్ ఆశలు కూడా క్లిష్టం చేసుకుంది. ఇప్పటికే టీమిండియా వైఫల్యంపై అటు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపైన, జట్టు కోచ్ రవిశాస్త్రి పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఇది భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమ్ ఇదేనా అని కొంత మంది అంటుంటే... టైటిల్ ఫెవరేట్ అంటూ టోర్నీలో అడుగుపెట్టిన జట్టు ఇదేనా అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో పొరుగు దేశాల క్రికెటర్లు కూడా కోహ్లీ సేనపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ప్రస్తుత టీమిండియాలో రెండు గ్రూప్‌లు ఉన్నాయన్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీకి అనుకూల, ప్రతికూల వర్గాలు ప్రస్తుత టీమిండియాలో ఉన్నాయన్నారు పాక్ మాజీ పేసర్. కెప్టెన్ విరాట్ కోహ్లీకి అనుకూలంగా ఒక వర్గం వ్యవహరిస్తుంటే.... మరో వర్గం మాత్రం కోహ్లీకి వ్యతిరేకంగా నడుస్తోందన్నారు షోయబ్ అక్తర్. న్యూజీలాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని కూడా ఆరోపించారు పాక్ మాజీ పేసర్. మ్యాచ్ మొత్తంలో కూడా కొంత మంది ఆటగాళ్లు వ్యవహరించిన తీరు అత్యంత అనూమానాస్పదంగా ఉందన్నారు. కివీస్‌తో మ్యాచ్‌లో ఏ మాత్రం ప్రణాళికాబద్ధంగా టీమిండియా ఆటగాళ్లు వ్యవహరించలేదన్నారు. టాస్ ఓడిన వెంటనే మ్యాచ్ మొత్తం ఓడినట్లుగా టీమిండియా ఆటగాళ్ల మైండ్ సెట్ ఉందన్నారు రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్. కివీస్ జట్టుపై గెలవాలనే కసి కూడా భారత ఆటగాళ్లలో లేదన్నారు షోయబ్ అక్తర్.



సీఎం కంటే.. ఎక్కువ మెజారిటీ.. !

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!

వచ్చేది బి.జె.పి - జనసేన ప్రభుత్వం !

కేసీఆర్ Vs ఈటెల : 16వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>