MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha41ec9492-15f6-47c9-8dbc-f3d85af34760-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha41ec9492-15f6-47c9-8dbc-f3d85af34760-415x250-IndiaHerald.jpgరాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'రౌద్రం రణం రుధిరం'. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా విడుదలను పలుమార్లు వాయిదా వేశారు మేకర్స్. ఇక చివరగా వచ్చే ఏడాది జనవరి 7న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి 'ఆర్ఆర్ఆర్ గ్లిమ్స్' అనే వీడియో విడుదలైంది. సSamantha{#}Tiger;m m keeravani;Instagram;Samantha;ajay;January;RRR Movie;Rajamouli;Heroine;Samuthirakani;NTR;Darsakudu;Director;Chitram;Cinema;India;ram pothineni;media;Indian'ఆర్ ఆర్ ఆర్' గ్లిమ్స్ పై సమంత రియాక్షన్ ఇదే..!!'ఆర్ ఆర్ ఆర్' గ్లిమ్స్ పై సమంత రియాక్షన్ ఇదే..!!Samantha{#}Tiger;m m keeravani;Instagram;Samantha;ajay;January;RRR Movie;Rajamouli;Heroine;Samuthirakani;NTR;Darsakudu;Director;Chitram;Cinema;India;ram pothineni;media;IndianMon, 01 Nov 2021 21:00:00 GMTరాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'రౌద్రం రణం రుధిరం'. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా విడుదలను పలుమార్లు వాయిదా వేశారు మేకర్స్. ఇక చివరగా వచ్చే ఏడాది జనవరి 7న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి 'ఆర్ఆర్ఆర్ గ్లిమ్స్' అనే వీడియో విడుదలైంది. సుమారు 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూపించాడు దర్శకుడు రాజమౌళి.

 ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకూ చూపించని విధంగా ఓ విజువల్ వండర్గా త్రిబుల్ ఆర్ రాబోతోంది. అలాగే యాక్షన్ సీక్వెన్స్ లో రాజమౌళి మార్క్ కనిపిస్తోంది. ఇక ఈ వీడియో గ్లిమ్స్ కి కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఇక డైలాగ్స్ లేకుండా ఎన్టీఆర్, చరణ్ తమ కళ్ళతోనే మ్యాజిక్ చేశారు. ఇక వీడియో చివర్లో లో పులి పంజా విసిరే సీన్ అయితే ఓ రేంజ్లో ఉందనే చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో లక్షల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వీడియోపై అగ్ర హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

తన ఇంస్టాగ్రామ్ స్టోరీగా ఆర్ఆర్ఆర్ గ్లిమ్స్ ను పోస్ట్ చేసిన సమంత... వామ్మో అనే విధంగా ఉండే ఒక ఏమోజీని పోస్ట్ చేసింది. అంతేకాకుండా గుడ్ లక్ అంటూ రాసుకొచ్చింది. దీంతో సమంత పెట్టిన పోస్ట్ ఎప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇక ఆర్ ఆర్ గ్లిమ్స్ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ.. ఫుల్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇక ఈ గ్లిమ్స్ తో రాజమౌళి సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారా స్థాయికి చేర్చాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ ల సరసన ఒలీవియా మోరిస్, ఆలియాభట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు...!!



టీఆర్‌ఎస్ ‘విజయగర్జన‘ సభ వాయిదా..! అందుకోస‌మేనా..?

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>