
మీ సమస్యలు మటుమాయం
అనేక సమస్యలతో భాదపడుతున్న వారిని టార్టెట్ చేసుకున్న దిలీప్ వారిని నిలువునా దోచుకుంటున్నాడు. తాను దేవదూత అని, తనకు అనేక శక్తులు ఉన్నాయని, నేను చెప్పినట్లు చేస్తే మీ సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయని అమాయకులకు మంత్రగాడు దిలీప్ మామమాటలు చెబుతున్నాడు. మంత్రగాడు దిలీప్ వేషాలు, అతని మాట తీరు చూసి చాలా మంది అమాయకులు నిజంగానే అతనికి అనేక శక్తులు ఉన్నాయని నమ్ముతున్నారు.

మీ సమస్యలు మటుమాయం
అనేక సమస్యలతో భాదపడుతున్న వారిని టార్టెట్ చేసుకున్న దిలీప్ వారిని నిలువునా దోచుకుంటున్నాడు. తాను దేవదూత అని, తనకు అనేక శక్తులు ఉన్నాయని, నేను చెప్పినట్లు చేస్తే మీ సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయని అమాయకులకు మంత్రగాడు దిలీప్ మామమాటలు చెబుతున్నాడు. మంత్రగాడు దిలీప్ వేషాలు, అతని మాట తీరు చూసి చాలా మంది అమాయకులు నిజంగానే అతనికి అనేక శక్తులు ఉన్నాయని నమ్ముతున్నారు.

పెళ్లి కాలేదని ఆవేదన
కేరళలో నివాసం ఉంటున్న 37 సంవత్సరాల మహిళకు ఇంత వరకు పెళ్లికాలేదు. మహిళకు పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పెళ్లి ఫిక్స్ అయ్యే సమయానికి ఏదో ఒక కారణంతో ఆమె పెళ్లి రద్దు కావడం, తరువాత ఆమెకు మళ్లీ పెళ్లి చూపలు మొదలు కావడం జరుగుతోంది. చాలా కాలం నుంచి పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్న ఆమె కూడా పెళ్లి విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనింది.

కుజ పూజలు చెయ్యాలని చెప్పిన మంత్రగాడు
వయసు మీదపడుతున్నా ఇంత వరకు వివాహం లేదని ఆ మహిళ మంత్రగాడు దిలీప్ దగ్గరకు వెళ్లింది, నీకు కుజధోషం ఉందని, కుజ నివారాణ పూజలు చేస్తే నీకు ధోషాల నుంచి విముక్తి అయ్యి నీకు వెంటనే వివాహం జరుగుతుందని, కుజ పూజలు చెయ్యకుంటే నీకు ఈ జన్మలో పెళ్లి కాదని మంత్రగాడు దిలీప్ ఆమెను భయాందోళనకు గురి చేశాడు.

పూజలు ఒంటరిగా చెయ్యాలని డేట్ ఫిక్స్ చేశాడు
మంత్రగాడు దిలీప్ చెప్పిన కుజపూజలు చెయ్యడానికి ఆమె ఓకే చెప్పింది. అయితే కుటుంబ సభ్యులతో కలిసి కుజ నివారాణ పూజలు చేస్తే ఫలితం ఉండదని, నువ్వు ఒంటరిగానే పూజలు చెయ్యాలని ఆమెకు దిలీప్ చెప్పాడు. ఒంటరిగానే వచ్చి మీరు చెప్పిన పూజలు చేస్తానని అమాయకురాలు మంత్రగాడు దిలీప్ కు చెప్పింది. కుజ పూజలు చెయ్యడానికి మంత్రగాడు డేట్ ఫిక్స్ చేశాడు.

ప్రసాదంలో మత్తు మందు ఇచ్చి అత్యాచారం….. నిలువు దోపిడి
ఎంఎస్ కే నగర్ లోని దిలీప్ ఉంటున్న ఇంట్లో పూజలు చెయ్యడానికి వెళ్లిన మహిళకు ఆ మంత్రగాడు ప్రసాదం ఇచ్చాడు. ప్రసాదం తిన్న మహిళ స్పృహ కోల్పోయింది. మహిళ మీద అత్యాచారం చేసి ఆమె నగ్న వీడియోలు తీసిన కామాంధుడైన మంత్రగాడు దిలీప్ ఆమె శరీరం మీద ఉన్న బంగారు నగలు మొత్తం దోచుకున్నాడు. స్పృహలోకి వచ్చిన మహిళ శరీరం మీద నూలుపోగుకూడా లేకపోవడంతో మంత్రగాడు దిలీప్ ను ప్రశ్నించింది. కుజపూలు అంటే ఇలాగే ఉంటాయని ఆమెకు చెప్పాడు. తన దగ్గర ఉన్న బంగారు నగలు కూడా మాయం కావడంతో ఆమె హడలిపోయింది.

మెడపట్టి బయటకు గెంటేసిన మంత్రగాడు
నా బంగారు నగలు నాకు ఇచ్చేయాలని ఆమె దిలీప్ కు చెప్పింది. నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తే జీవితంలో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారని, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని మంత్రగాడు చెప్పాడు. మహిళ ఎదురు తిరగడంతో నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ మంత్రగాడు దిలీప్ ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు.

కేరళ మంత్రగాళ్ల పేరుతో నిలువు దోపిడి
కుజ పూజలు చెయ్యాలని ప్రసాదంలో మత్తు మందు ఇచ్చి మజా చేసిన మంత్రగాడికి పోలీసులు బడిత పూజలు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దిలీప్ కు బెండ్ తీసి అరెస్టు చేసి జైలుకు పంపించారు. కేరళలో చాలా మంది మంత్రగాళ్లు ఆ రాష్ట్ర ప్రజలతో పాటు తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోని అమాయకులను నిలువునా దోచుకుంటున్నా ఇలాంటి సంఘనలు బయటకు రావడం లేదని తెలిసింది.