MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli2ad5122f-50ed-45f6-9fbf-dcb89a82e059-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli2ad5122f-50ed-45f6-9fbf-dcb89a82e059-415x250-IndiaHerald.jpgరాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల జనవరి 7న ఖరార్ కావడంతో స్వయంగా జక్కన్న రంగంలోకి దిగి ఈ మూవీ ప్రమోషన్ ప్రారంభించడమే కాకుండా ఈ మూవీ పై అంచనాలు పెంచుతున్నాడు. లేటెస్ట్ గా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంక్రాంతి సినిమాల పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.‘ఆర్ ఆర్ ఆర్’ తో పాటు ఎన్ని భారీ సినిమాలు విడుదలైన ఎటువంటి నష్టం ఉండదని సంక్రాంతికి తెలుగు ప్రజలు కనీసం నాలుగు సినిమాలు చూసే అలవాటు ఎప్పటి నుంచో ఉంది అంటూ కామెంట్స్ చేసాడు. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ ఇస్తూ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ధియేటర్rajamouli{#}Rajamouli;January;media;Coronavirus;Makar Sakranti;Telugu;Industry;Cinemaసంక్రాంతి సినిమాల పోటీ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్ !సంక్రాంతి సినిమాల పోటీ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్ !rajamouli{#}Rajamouli;January;media;Coronavirus;Makar Sakranti;Telugu;Industry;CinemaMon, 01 Nov 2021 08:09:47 GMTరాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల జనవరి 7న ఖరార్ కావడంతో స్వయంగా జక్కన్న రంగంలోకి దిగి ఈ మూవీ ప్రమోషన్ ప్రారంభించడమే కాకుండా ఈ మూవీ పై అంచనాలు పెంచుతున్నాడు. లేటెస్ట్ గా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంక్రాంతి సినిమాల పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.


‘ఆర్ ఆర్ ఆర్’ తో పాటు ఎన్ని భారీ సినిమాలు విడుదలైన ఎటువంటి నష్టం ఉండదని సంక్రాంతికి తెలుగు ప్రజలు కనీసం నాలుగు సినిమాలు చూసే అలవాటు ఎప్పటి నుంచో ఉంది అంటూ కామెంట్స్ చేసాడు. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ ఇస్తూ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ధియేటర్ల సంఖ్య చాల తక్కువగా ఉన్న పరిస్థితులలో అన్ని సినిమాలకు ధియేటర్లు దొరకవు అన్న సమస్య తప్ప సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా జనం చూస్తారు అంటూ అభిప్రాయ పడ్డాడు.


దీనినిబట్టి రాజమౌళి కామెంట్స్ ను నిశితంగా పరిశీలిస్తే ఒక విషయం అర్థం అవుతుంది అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అవుతున్నప్పటికీ ‘భీమ్లా నాయక్’ ‘రాథే శ్యామ్’ పోటీగా విడుదల అవుతున్న పరిస్థితులలో అందరు ఆస్చర్యపోతున్న విషయం తెలిసిందే.


ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాజమౌళి ఇలా వ్యూహాత్మకంగా కామెంట్ చేసి ఉంటాడు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ‘ఆర్ ఆర్ ఆర్’ బిజినెస్ బాగా జరుగుతున్నప్పటికీ ఈ మూవీ నిర్మాతలు ఆశించిన రేట్లకన్నా కొంత తక్కువకు జరుగుతోంది అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి. అయితే ఇప్పటికీ దేశానికి పొంచి ఉన్న కరోనా థర్డ్ వేవ్ భయాలు పూర్తిగా తొలగక పోవడంతో పాటు కొత్తగా కొత్త కరోనా వేరియంట్స్ గుర్తిస్తున్న పరిస్థితులలో ఏదైనా ఉపద్రవం మళ్ళీ ముంచుకు వస్తుందా అన్న భయాల మధ్య ధైర్యంగా ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు సిద్ధం అవుతోంది..





చైల్డ్ యాక్టర్ భరత్ మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>