PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr984145b4-a65e-4a68-a63e-f13b0e13737b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr984145b4-a65e-4a68-a63e-f13b0e13737b-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ పై ఇటీవల బాగా ఆసక్తి పెరిగిపోతుంది. అందుకే మొన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కూడా ఆంధ్రాలో తెరాస అనే అంశం లేవనెత్తారు. దీనితో ఆయనకు ఆంధ్రపై ఆసక్తి పెరిగిందని అంటున్నారు. ఎక్కడవారు అక్కడ పనులను చక్కపెట్టుకుంటే అంతా బాగానే ఉంటుంది. కానీ అలాంటిది చేయకుండా వేరే ప్రాంతాలలో వేళ్ళు పెట్టడం మొదలు పెడితే మాత్రం రాష్ట్రాల మధ్య అంతరాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తాను అని చెప్పుకున్న ఆయన తీరా telanganakcr;{#}Raccha;gold;Telangana Rashtra Samithi TRS;Sharmila;KCR;Telangana;Party;Hyderabad;Telangana Chief Minister;CM;Andhra Pradeshకేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!telanganakcr;{#}Raccha;gold;Telangana Rashtra Samithi TRS;Sharmila;KCR;Telangana;Party;Hyderabad;Telangana Chief Minister;CM;Andhra PradeshMon, 01 Nov 2021 16:04:03 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ పై ఇటీవల బాగా ఆసక్తి పెరిగిపోతుంది. అందుకే మొన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కూడా ఆంధ్రాలో తెరాస అనే అంశం లేవనెత్తారు. దీనితో ఆయనకు ఆంధ్రపై ఆసక్తి పెరిగిందని అంటున్నారు. ఎక్కడవారు అక్కడ పనులను చక్కపెట్టుకుంటే అంతా బాగానే ఉంటుంది. కానీ అలాంటిది చేయకుండా వేరే ప్రాంతాలలో వేళ్ళు పెట్టడం మొదలు పెడితే మాత్రం రాష్ట్రాల మధ్య అంతరాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తాను అని చెప్పుకున్న ఆయన తీరా మిగులు బడ్జెట్ నుండి అప్పుల ఊబిలో మిగిలించాడు. ఉన్నచోట అన్న వన్నీ చేయడం పూర్తికాలేదు కానీ, వేరే ప్రాంతాల మీద ఆసక్తి చూపడం వివేకం అనిపించుకోదు. ఏదో రాజకీయంగా ఒక మాట అని ఉంటాడులే అనుకుందాం అనుకున్నా కూడా ఇంకోటి ఇంకోటి అయితే సాధ్యం అవుతుంది కానీ ఇలాంటివి మాత్రం కుదరవు.

ఎన్నోసార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు ఎదురు అయ్యారు, దానికి తగ్గట్టుగా ఎన్నో అంశాలు కూడా చర్చించారు. కానీ రాష్ట్ర పరిధిలోనే ఉన్న చిన్న చిన్న అంశాలకు కూడా ఇంతవరకు సరిగ్గా పరిష్కరించుకోలేకపోయారు. ఇక నీళ్ల రచ్చ ఎలాగూ ఉండనే ఉంది, విపక్షాలు కూడా అన్నిటికి ఈయన మీదకు వస్తున్నది కూడా సరైనదే అనిపిస్తుంది, తాజాగా వైఎస్ షర్మిల కూడా కేసీఆర్ గారిని అదే ఉద్దేశ్యంతో ప్రశ్నించింది. కేసీఆర్ గారు అన్నిసార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు కదా, నీళ్ల విషయం పట్ల  ఒక్కసారి మనసు పెట్టలేకపోయారా అంటూ ఆమె ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలు వేస్తె సరిగ్గా సమాధానం చెప్పడం రాదు కానీ, పక్క రాష్ట్రాలకు వెళ్లి అక్కడ బాగోగులు చూడబోతారు వీళ్లంతా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  

ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు చక్కగా తీర్చిదిద్దుకుంటూ, ఇతర అభివృద్ధి కోసం పొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో సమన్వయంగా ముందుకు పోవడం మానేసి, ఎవరికి వారే ఇష్టానికి మాట్లాడేస్తూ ఒకరి విషయాల్లో ఒకరు జోక్యం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ కు ఒక భరోసా ఉంది, వైఎస్ కుటుంబం ఆస్తులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ లో ఉన్నాయి, వాటికోసమైనా వాళ్ళు ఇతగాడి దగ్గర వంగివంగి ఉంటారు కాబట్టి ఇష్టానికి మాటలు వాడేస్తున్నాడు. ఉమ్మడిగా ఉన్నప్పుడు రాజధానిని నమ్ముకొని ఆస్తులు కూడబెట్టుకున్న అందరు కూడా ఇదే తరహాలో కేసీఆర్ కు దాసోహం బాబయ్య అనాల్సిందే అనేది ఆయన మొండి వైఖరి. వాళ్ళందరి జుట్టు ఆయన చేతిలో ఉన్నట్టే. చంద్రబాబుది కూడా. అందుకే పొమ్మన్నా ఆస్తులు గుర్తుకు వచ్చినప్పుడల్లా హైదరాబాద్ వెళ్తున్నాడు ఆయన కూడా. పదవి ఉందని అహంకారం వస్తే, అది ఊడిపోయాక ఫలితాలు దారుణంగా అనుభవించాల్సి వస్తుంది అనేది కేసీఆర్ గారు గ్రహిస్తే బాగుంటుంది. ఒక్కసారి తెలంగాణాలో కేసీఆర్ తరుపున ఒక దళితుడు తెలంగాణ కు సీఎం అయితే అప్పుడు ఆయన బంగారు తెలంగాణ తెచ్చినట్టే, ముందు దాని సంగతి చూసి అనంతరం పక్క చూపులు చూస్తే అదో అందం.



'ఇంటి వద్దకే విద్య'కు 1.3 లక్షల మంది దరఖాస్తు

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్

యూపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం..!

పోకిరి స్పూఫ్.. పగలబడి నవ్వుకుంటారు?

జ‌గ‌న్ Vs చంద్ర‌బాబు... మ‌రో అదిరిపోయే యుద్ధం.. విజేత ఎవ‌రో..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>