SportsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/t204c2df1ac-15f1-4196-9913-0dbf248d79c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/t204c2df1ac-15f1-4196-9913-0dbf248d79c5-415x250-IndiaHerald.jpg ఏ ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలో అయినా భార‌త్ ఉంటే ఆ క‌ళే వేరు.. ఆ క్రేజే వేరు. అయితే ఇప్పుడు నాలుగేళ్ల త‌ర్వాత జ‌రుగుతోన్న ఈ పొట్టి క‌ప్ లో భార‌త్ వ‌రుస‌గా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవ‌డంతో అస‌లు టోర్నీ క‌ళే పోయింది. భార‌త్ ఓ వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో పేల‌వం గా ఆడితే ఆ క‌ప్ క్రేజ్ తుస్సు మంటుంది అన‌డానికి 2007 వ‌ర‌ల్డ్ క‌ప్ బెస్ట్ ఎగ్జాంపుల్‌. ఆ టోర్నీ లో భార‌త్ గ్రూప్ ద‌శ‌లోనే ఓడిపోయింది. క‌నీసం సూప‌ర్ 8 కు కూడా వెళ్ల‌లేదు. దీంతో టోర్నీ క‌ళే పోయింది.ఇప్పుడు భార‌త్ ఈ పొట్టి క్రికెట్లో వ‌రుస‌గా రెండు మ్యాచ్ T20{#}ICC T20;Dubai;New Zealand;CricketT20 WORLD CUP: ఆ సెంటిమెంట్ దెబ్బ‌తో క‌ప్ క్రేజ్ తుస్‌..!T20 WORLD CUP: ఆ సెంటిమెంట్ దెబ్బ‌తో క‌ప్ క్రేజ్ తుస్‌..!T20{#}ICC T20;Dubai;New Zealand;CricketMon, 01 Nov 2021 14:29:31 GMTధ‌నాధ‌న్ క్రికెట్ అనుకున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప‌ర‌మ పేల‌వంగా మారింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఏ ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలో అయినా భార‌త్ ఉంటే ఆ క‌ళే వేరు.. ఆ క్రేజే వేరు. అయితే ఇప్పుడు నాలుగేళ్ల త‌ర్వాత జ‌రుగుతోన్న ఈ పొట్టి క‌ప్ లో భార‌త్ వ‌రుస‌గా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవ‌డంతో అస‌లు టోర్నీ క‌ళే పోయింది. భార‌త్ ఓ వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో పేల‌వం గా ఆడితే ఆ క‌ప్ క్రేజ్ తుస్సు మంటుంది అన‌డానికి 2007 వ‌ర‌ల్డ్ క‌ప్ బెస్ట్ ఎగ్జాంపుల్‌. ఆ టోర్నీ లో భార‌త్ గ్రూప్ ద‌శ‌లోనే ఓడిపోయింది. క‌నీసం సూప‌ర్ 8 కు కూడా వెళ్ల‌లేదు. దీంతో టోర్నీ క‌ళే పోయింది.

ఇప్పుడు భార‌త్ ఈ పొట్టి క్రికెట్లో వ‌రుస‌గా రెండు మ్యాచ్ ల‌లో ఓడిపోయింది. సెమీస్ అవ‌కాశాలు క్లిష్టం అయిపోయాయి. ఇక లీగ్ ద‌శ‌లోనే ఈ టోర్నీ పై ఆస‌క్తి లేక‌పోవ‌డానికి మ‌రో కార‌ణం పిచ్ లు కూడా అన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దుబాయ్ వేదిక‌గా ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన మ్యాచ్ ల ఫ‌లితా ల‌పై ఓ సారి రివ్యూ చూస్తే నిన్న జ‌రిగిన భార‌త్ , న్యూజిలాండ్ మ్యాచ్ తో స‌హా ప్ర‌తి మ్యాచ్ లోనూ రెండోసారి బ్యాటింగ్ చేసిన జ‌ట్టే  గెలిచింది.

ఇక ప్ర‌తి జ‌ట్టు కూడా టాస్ గెలిస్తే ముందు బౌలింగ్ తీసుకుంటోంది. తొలుత బ్యాటింగ్ చేసే జ‌ట్టు ఆరేడు ఓవ‌ర్లు ఆడే స‌రికే ముక్కుతూ మూలుగుతూ ఆడ‌డ‌డంతో పాటు వికెట్లు కూడా వేగంగా కోల్పోతోంది. దీంతో మ్యాచ్ చూడాలా ? అన్న నిరాస‌క్త‌త ప్రేక్ష‌కుల‌కు వ‌చ్చేస్తోంది. అస‌లు మొద‌ట బ్యాటింగ్ చేసే జ‌ట్టులో బ్యాట‌ర్స్ బాల్ కు బ్యాట్ ను ట‌చ్ చేసేందుకే ఆప‌సోపా లు ప‌డుతున్నారు. ఏదేమైనా తొలుత బ్యాటింగ్ చేసిన జ‌ట్టు ఓడిపోవ‌డం అనేది ఈ పొట్టి క‌ప్ కు పెద్ద బ్యాడ్ సెంటిమెంట్ గా మారిపోయింది.



మద్యం తాగొచ్చిన టీచర్.. చివరికి ఏం చేశాడో తెలుసా?

కొడాలి నాని తో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా...?

మంచిమాట : మనం ఏ గింజ వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది..!!

స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో పేకాట...!

చంద్ర‌బాబుకు వైసీపీ త్రిమూర్తుల ఫీవ‌ర్‌...!

కేసీఆర్ గారు టీచర్ పోస్టులు వేయండి సారు..?

ఏపీలో ఆకలి కేకలు.. ఏం జరిగింది..?

నాగ‌శౌర్య ఫామ్ హౌస్ లో పేకాట కేసులో బిగ్ ట్విస్ట్..!

పాదయాత్రకు నో బ్రేక్ అంటున్న షర్మిల...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>