MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/festiv3109bccc-2903-41af-8b13-f26eabfd30ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/festiv3109bccc-2903-41af-8b13-f26eabfd30ff-415x250-IndiaHerald.jpgమొత్తానికి రెండు నెలల వ్యవధిలో తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేస్తోంది. ఈ ఏడాది క్రాక్ తో సంక్రాంతికి మంచి బోణీ తగిలింది. 2020లోనూ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు. అల వైకుంఠపురంలో మూవీ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఏ సంక్రాంతి కూడా టాలీవుడ్ ని నిరాశపరచలేదు. అందువల్ల సంక్రాంతి మీద ఈసారి కూడా కోటి ఆశలను తెలుగు చిత్ర పరిశ్రమ పెట్టుకుంది. festiv{#}festivalటోటల్ గా సంక్రాంతి రేసులో ఉండేది... ?టోటల్ గా సంక్రాంతి రేసులో ఉండేది... ?festiv{#}festivalMon, 01 Nov 2021 19:11:03 GMTమొత్తానికి రెండు నెలల వ్యవధిలో తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేస్తోంది. ఈ ఏడాది క్రాక్ తో సంక్రాంతికి మంచి బోణీ తగిలింది. 2020లోనూ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు. అల వైకుంఠపురంలో మూవీ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఏ సంక్రాంతి కూడా టాలీవుడ్ ని నిరాశపరచలేదు. అందువల్ల సంక్రాంతి మీద ఈసారి కూడా కోటి ఆశలను తెలుగు చిత్ర పరిశ్రమ పెట్టుకుంది.

అయితే ఈసారి సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్నది అయితే చర్చగానే ఉంది. 2022 సంక్రాంతికి అందరి కంటే ముందు కర్చీఫ్ వేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన సర్కార్ వారి పాట రిలీజ్ అని ముందే ప్రచారం జరిగింది. ఇక ఈ మధ్యన భీమ్లా నాయక్ కూడా సంక్రాంతికి రెడీ అని అన్నారు. ఇదే వరసలో ఎఫ్ త్రీ అన్నారు. కానీ ఆ మూవీ ఇపుడు పోస్ట్ ఫోన్ అయింది. దీంతో నాలుగు సినిమాలు సంక్రాంతి పండుగను టార్గెట్ చేశాయి. అందులో రెండు పాన్ ఇండియా మూవీస్.

జనవరి 7న ట్రిపుల్ ఆర్ మూవీ వస్తోంది. ఈ మూవీ కచ్చితంగా రావడం జరుగుతుంది అనే అంటున్నారు. దాంతో పాటు 14న ప్రభాస్ రాధేశ్యామ్ కూడా రిలీజ్ అవుతోంది. ఈ రెండు మూవీస్ పక్కా. ఏ మాత్రం చేంజి అన్నది ఉండదు. ఎందుకంటే ఆ డేట్లు మారాలి అంటే ఆల్ ఇండియా లెవెల్ లో భారీ ఎక్సర్ సైజ్ చేయాలి. సో అవి మారవు. మరి మిగిలిన సినిమాల సంగతేంటి అన్నదే చర్చ.

ఆ సినిమాలు సర్కార్ వారి పాట. మహేష్ బాబు ఏ డెసిషన్ తీసుకుంటారో అని కూడా ఆలోచిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ కన్ ఫర్మ్. అలాగే రాధేశ్యాం కూడా రెడీ కాబట్టి సర్కార్ వారి పాట జనవరి 24కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. అలాగే పవన్ భీమ్లా నాయక్ మూవీ డేట్ కూడా జనవరి 12 నుంచి చేంజి అవుతుందా అంటే జరగవచ్చు అన్న ప్రచారం ఉంది. మరి ఈ రెండు సినిమాలు తప్పుకుంటే గట్టి పోటీ మాత్రం ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ ల మధ్యనే ఉండే చాన్స్ ఉంది. ఈ రెండూ కూడా గ్రాండియర్ గా ఆలిండియా లెవెల్ లో రిలీజ్ అవుతాయి. టోటల్ గా చూస్తే రేసులో మిగిలేది ఈ రెండే అన్నది ఇప్పటికైతే ప్రచారం లో ఉన్న మాట. అయితే రేసులో మేమూ ఉంటామని ఎవరైనా అంటే ఈ లెక్క మారక తప్పదు.










రవితేజ ఆ అలవాటు మానుకోడా!!

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>