CrimePodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/naga-farm-houseffb60759-96b0-4af0-bd8c-4972f426c4cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/naga-farm-houseffb60759-96b0-4af0-bd8c-4972f426c4cc-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం అక్రమ దందాలకు నిలయంగా మారుతున్నాయి. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం గంజాయి దందా జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో పేకాట క్లబ్‌లు ఎక్కువయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ప్రస్తుతం పేకాట రాయుళ్లుగా మారిపోయారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలపై ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి కూడా. ఇప్పుడు తాజాగా ఓ స్టార్ హీరో పేరు కూడా పేకాట క్లబ్ నిర్వాహకుల జాబితాలో చేర్చింది. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు చెందిన ఓ ఫామ్ హౌస్ ప్రస్తుతం naga farm house{#}marijuana;Red;Hyderabad;NagaShaurya;suman;police;House;Smart phone;media;Andhra Pradesh;Tollywood;Telugu;Heroస్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో పేకాట...!స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో పేకాట...!naga farm house{#}marijuana;Red;Hyderabad;NagaShaurya;suman;police;House;Smart phone;media;Andhra Pradesh;Tollywood;Telugu;HeroMon, 01 Nov 2021 13:47:30 GMTతెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం అక్రమ దందాలకు నిలయంగా మారుతున్నాయి. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం గంజాయి దందా జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో పేకాట క్లబ్‌లు ఎక్కువయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ప్రస్తుతం పేకాట రాయుళ్లుగా మారిపోయారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలపై ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి కూడా. ఇప్పుడు తాజాగా ఓ స్టార్ హీరో పేరు కూడా పేకాట క్లబ్ నిర్వాహకుల జాబితాలో చేర్చింది. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు చెందిన ఓ ఫామ్ హౌస్ ప్రస్తుతం పేకాట క్లబ్‌గా మారింది. హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన దాడిలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్టార్ హీరో ఫామ్ హౌస్, బడా వ్యాపారులే నిర్వాహకులు.... చూస్తే... అదేదో పెద్ద క్యాసినోగా మారిపోయింది. పోలీసుల దాడుల్లో 20 మంది పేకాట రాయుళ్లు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. విజయవాడకు చెందిన ఓ రియల్టర్ ఈ క్లబ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ మంచిరేవుల వద్ద ఉన్న ఫామ్ హౌస్ కేంద్రంగా ఈ పేకాట క్లబ్ నడుస్తోంది. టాలీవుడ్ హీరో నాగశౌర్యకు చెందిన ఈ ఫామ్ హౌస్‌ను విజయవాడకు చెందిన రియల్టర్ గుత్తా సుమన్ అనే వ్యాపారి లీజ్‌కు తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, మీడియా వ్యాపారాలు చేసి పరారైనట్లుగా గుత్తా సుమన్ పై ఆరోపణలున్నాయి. నాగశౌర్య విల్లాను క్యాసినోగా మార్చేసిన గుత్తా సుమన్... జోరుగా పేకాట శిబిరం నడిపిస్తున్నారు. ఈ పేకాట ద్వారా పెద్ద మొత్తంలో కమీషన్ వసూలు చేస్తున్నట్లు గుత్తా సుమన్‌పై ఆరోపణలు. పోలీసుల దాడుల్లో మొత్తం 20 మంది వ్యక్తులు అరెస్టయ్యారు. వీరి నుంచి మొత్తం 6 లక్షల 70 వేల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం 24 కార్లు, 33 సెల్ ఫోన్లను పోలీసులు గుర్తించారు. గుత్తా సుమన్ సెల్ ఫోన్ లో పలువురు ప్రముఖుల ఫోన్ నంబర్లను పోలీసులు గుర్తించారు. అలాగే ప్రముఖులతో ఫోటోలు కూడా గుత్తా సుమన్ తీయించుకున్నారు.



ఎన్టీఆర్ తో సినిమాపై స్పందించిన బాలీవుడ్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..?

స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో పేకాట...!

చంద్ర‌బాబుకు వైసీపీ త్రిమూర్తుల ఫీవ‌ర్‌...!

కేసీఆర్ గారు టీచర్ పోస్టులు వేయండి సారు..?

ఏపీలో ఆకలి కేకలు.. ఏం జరిగింది..?

నాగ‌శౌర్య ఫామ్ హౌస్ లో పేకాట కేసులో బిగ్ ట్విస్ట్..!

పాదయాత్రకు నో బ్రేక్ అంటున్న షర్మిల...?

బ్రేకింగ్: ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ సక్సెస్...?

నాగశౌర్య ఇంట్లో జూదం.. 20 మంది ప్రముఖులను పట్టుకున్న పోలీసులు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>