PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/huzurabade29fd257-f7f6-43db-92a0-d9cb17f37358-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/huzurabade29fd257-f7f6-43db-92a0-d9cb17f37358-415x250-IndiaHerald.jpgక‌రీనంగ‌ర్ లో ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంది. ఎవ‌రు గెలుస్తారు ? అన్న‌ది రేపు తేలిపోనుంది. హుజూరాబాద్ అభ్య‌ర్థుల భ‌విత‌వ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్ష్తిప్తం అయ్యి ఉంది. ఈ ఉప ఎన్నిక‌ల్లో పోటీ అధికార టీఆర్ ఎస్ వ‌ర్సెస్ బీజేపీ మ‌ధ్య ఉంద‌న్న‌ది తేలిపోయింది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసేశాయి. మెజార్టీ పోల్స్ అన్ని కూడా ఇక్క‌డ ఈట‌ల రాజేంద‌ర్ గెలుస్తాడ‌ని చెప్పాయి. ఒక‌టి ఆరా స‌ర్వేలు మాత్ర‌మే ఇక్క‌డ టీ ఆర్ ఎస్ గెలిచే అవ‌కాశం ఉంద‌ని చెప్పాయి. స‌రే టీఆర్ ఎస్‌, బీజేపీలో ఎవ‌రు గెHuzurabad{#}maina;venkat;revanth;Minister;Bharatiya Janata Party;Congress;Partyకేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ దెబ్బ‌తో వాళ్ల‌కు దిమ్మ తిర‌గ‌నుందా ?కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ దెబ్బ‌తో వాళ్ల‌కు దిమ్మ తిర‌గ‌నుందా ?Huzurabad{#}maina;venkat;revanth;Minister;Bharatiya Janata Party;Congress;PartyMon, 01 Nov 2021 12:50:00 GMTతెలంగాణ‌లో హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు రేపు ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. క‌రీనంగ‌ర్ లో ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంది. ఎవ‌రు గెలుస్తారు ? అన్న‌ది రేపు తేలిపోనుంది. హుజూరాబాద్ అభ్య‌ర్థుల భ‌విత‌వ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్ష్తిప్తం అయ్యి ఉంది. ఈ ఉప ఎన్నిక‌ల్లో పోటీ అధికార టీఆర్ ఎస్ వ‌ర్సెస్ బీజేపీ మ‌ధ్య ఉంద‌న్న‌ది తేలిపోయింది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసేశాయి. మెజార్టీ పోల్స్ అన్ని కూడా ఇక్క‌డ ఈట‌ల రాజేంద‌ర్ గెలుస్తాడ‌ని చెప్పాయి. ఒక‌టి ఆరా స‌ర్వేలు మాత్ర‌మే ఇక్క‌డ టీ ఆర్ ఎస్ గెలిచే అవ‌కాశం ఉంద‌ని చెప్పాయి. స‌రే టీఆర్ ఎస్‌, బీజేపీలో ఎవ‌రు గెలిచినా వాళ్ల‌కు రాజ‌కీయంగా ల‌బ్ధి ఉంటుంది. అయితే ఇక్క‌డ కాంగ్రెస్ ది మూడో ప్లేస్ అని ఇప్ప‌టికే తేలిపోయింది.

అయితే కాంగ్రెస్ మూడో ప్లేస్ లో ఉన్నా కూడా డిపాజిట్ తెచ్చుకుని గౌర‌వ ప్ర‌ద‌మైన ఓట్లు సాధిస్తుందా ?  లేదా ?  మ‌రీ ఘోర‌మైన ఓట్ల‌తో ప‌రువు పోగొట్టుకుంటుందా ? అన్న‌దే చూడాలి. అస‌లు ముందుగా ఇక్క‌డ కాంగ్రెస్ మాజీ మంత్రి , ఫైర్ బ్రాండ్ లీడ‌ర్ కొండాసురేఖను పోటీ చేయించా లనుకుంది. చివరి నిమిషంలో ఆమె హ్యాండ్ ఇవ్వడంతో అప్పటికప్పుడు ఎన్ఎస్‍యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బ‌ల్మూరి వెంకట్ కు సీటు ఇచ్చింది. అస‌లు ఇక్క‌డ ఉప ఎన్నిక హ‌డావిడి ప్రారంభ మైనా కూడా చివ‌రి వ‌ర‌కు అభ్య‌ర్థి ఎవ‌రు ?  అనేది తేల్చ‌కుండా నాన్చుతూ వ‌చ్చింది.

ఇక కొత్త పీసీసీ అధ్య‌క్షుడు అయిన రేవంత్ కూడా ఇక్క‌డ క్యాండెట్ విష‌యంలో నాన్చుతూ వ‌చ్చి ప‌రోక్షంగా ఇక్క‌డ ఈట‌ల గెలిచేందుకు సాయ ప‌డ్డార‌న్న విమ‌ర్శ కూడా ఆ పార్టీ ఎదుర్కొంది. ఇది కూడా అక్క‌డ కాస్తో కూస్తో ఉన్న కాంగ్రెస్ కేడ‌ర్ జారి పోయేందుకు కార‌ణ‌మైంది. టీఆర్ ఎస్ ను తాము ఎలాగూ క‌ట్ట‌డి చేయ‌లేం.. క‌నీసం ఈట‌ల‌ను గెలిపిస్తేనే ఆ పార్టీకి కాస్త ఎదురు దెబ్బ అవుతుంద‌ని.. చివ‌ర‌కు ఆయ‌న గెలుపు కోసం ప‌రోక్షంగా సాయం చేసింది. ఏదేమైనా ఇక్క‌డ కాంగ్రెస్ కు వ‌చ్చే ఓట్లు చూస్తే వాళ్ల‌కు దిమ్మ తిరిగి పోవ‌డం ఖాయ‌మే అంటున్నారు.

 



అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా నాగర్ కర్నూల్ వాసి ఎంపిక

ఏపీలో ఆకలి కేకలు.. ఏం జరిగింది..?

నాగ‌శౌర్య ఫామ్ హౌస్ లో పేకాట కేసులో బిగ్ ట్విస్ట్..!

పాదయాత్రకు నో బ్రేక్ అంటున్న షర్మిల...?

బ్రేకింగ్: ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ సక్సెస్...?

నాగశౌర్య ఇంట్లో జూదం.. 20 మంది ప్రముఖులను పట్టుకున్న పోలీసులు!!

రామ్ చరణ్, ఎన్టీఆర్ ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేవు గా!!

అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని టీడీపీ వ‌దిలేసిందా..?

కేసీఆర్ Vs ఈటెల: టీఆర్ఎస్ గెలిస్తే ఈ అనుమానాల‌కు ఆన్సర్లేవి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>