HealthVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/usiri-faf41bb6-cd50-4cca-9680-86d6231f3117-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/usiri-faf41bb6-cd50-4cca-9680-86d6231f3117-415x250-IndiaHerald.jpgచలికాలం దాదాపు వచ్చేసింది. ఈ సీజన్‌లో ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అవి పోషకాలకు, శక్తికి కేంద్రం వంటివి. విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటిలో ఉసిరి ఒకటి. ఇది రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతం. ఆమ్లాలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది అత్యంత శక్తివంతమైన పండ్లలో ఒకటిగా చెబుతారు ఆరోగ్య విశ్లేషకులు. దాని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. ఉసిరి ఆరోగ్య ప్రయోజనాలు : ఉసిరి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరికాయను దాని ఔషధ గుణUsiri;{#}Insulin;Shakti;Vitamin C;Indian gooseberry;Heartఉసిరి ఇమ్యూనిటీ బూస్టర్ అని తెలుసా ?ఉసిరి ఇమ్యూనిటీ బూస్టర్ అని తెలుసా ?Usiri;{#}Insulin;Shakti;Vitamin C;Indian gooseberry;HeartMon, 01 Nov 2021 17:00:00 GMTచలికాలం దాదాపు వచ్చేసింది. ఈ సీజన్‌లో ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అవి పోషకాలకు, శక్తికి కేంద్రం వంటివి. విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటిలో ఉసిరి ఒకటి. ఇది రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతం. ఆమ్లాలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది అత్యంత శక్తివంతమైన పండ్లలో ఒకటిగా చెబుతారు ఆరోగ్య విశ్లేషకులు. దాని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఉసిరి ఆరోగ్య ప్రయోజనాలు :
ఉసిరి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరికాయను దాని ఔషధ గుణాల కారణంగా ఆహారంలో, ఆరోగ్యం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది ఇన్ఫెక్షన్, జలుబు, దగ్గు రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలను దూరం చేస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఉసిరిని ఆయుర్వేదంలో ఆమ్లా అంటారు. ఇది శరీరంలోని టాక్సిన్‌లను తొలగించి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉసిరి షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేయడంలో సహాయ పడుతుంది. క్రోమియం అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని నివారిస్తుంది. తాజా ఉసిరిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ మెరుగుపడుతుంది. ఈ విధంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

చలికాలంలో మలబద్ధకం సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఉసిరికాయ జీర్ణ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో సహాయ పడుతుంది. ఇది థైరాయిడ్, కంటి చూపు, అసిడిటీ, బరువు తగ్గడం వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

1 టీస్పూన్ ఉసిరి పొడిని 1 టీస్పూన్ తేనె లేదా వెచ్చని నీటితో ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. ఉసిరి రసాన్ని గోరువెచ్చని నీళ్లలో కలిపి ఉదయం పూట తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. గోరువెచ్చని నీటితో ఉదయం ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత రెండు గంటల తర్వాత తీసుకోవచ్చు.





"నాగ్ - శ్రియ" మళ్ళీ కలవనున్నారా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్

యూపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం..!

పోకిరి స్పూఫ్.. పగలబడి నవ్వుకుంటారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>