PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr984145b4-a65e-4a68-a63e-f13b0e13737b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr984145b4-a65e-4a68-a63e-f13b0e13737b-415x250-IndiaHerald.jpgఏపీ తో పాటు తెలంగాణలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఎమ్మెల్సీ స్థానాలు అధికార పార్టీ ఖాతాల్లోనే ప‌డ‌తాయి. ఇక తెలంగాణ కు వ‌స్తే ఆరు స్థానాలు టీఆర్ఎస్‌కే వస్తాయి. కానీ ఆశావహులు మాత్రం అరవై మందికిపైగా ఉన్నార‌నే చెప్పాలి. ఈ ఆరు కొత్త ఎమ్మెల్సీ లుగా కేసీఆర్ ఎవ‌రిని ఎంపిక చేస్తారు ? అన్న‌దే ఇప్పుడు స‌స్పెన్స్‌. అసెంబ్లీ ఎన్నిక ల టైంలో కేసీఆర్ చాలా మందికి ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు.అయితే ఇప్పుడు వీరి తో పాటు సీనియ‌ర్ నేత‌లు, KCR{#}Telugu Desam Party;Assembly;Car;Congress;Telangana;KCR;Telugu;Party;TDPతెలంగాణ‌లో మ‌రో ఎన్నిక‌.. కేసీఆర్‌కు అస‌లు సిస‌లు అగ్నిప‌రీక్ష‌..!తెలంగాణ‌లో మ‌రో ఎన్నిక‌.. కేసీఆర్‌కు అస‌లు సిస‌లు అగ్నిప‌రీక్ష‌..!KCR{#}Telugu Desam Party;Assembly;Car;Congress;Telangana;KCR;Telugu;Party;TDPMon, 01 Nov 2021 11:10:00 GMTఏపీ తో పాటు తెలంగాణలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఎమ్మెల్సీ స్థానాలు అధికార పార్టీ ఖాతాల్లోనే ప‌డ‌తాయి. ఇక తెలంగాణ కు వ‌స్తే ఆరు స్థానాలు టీఆర్ఎస్‌కే వస్తాయి. కానీ ఆశావహులు మాత్రం అరవై మందికిపైగా ఉన్నార‌నే చెప్పాలి. ఈ ఆరు కొత్త ఎమ్మెల్సీ లుగా కేసీఆర్ ఎవ‌రిని ఎంపిక చేస్తారు ? అన్న‌దే ఇప్పుడు స‌స్పెన్స్‌. అసెంబ్లీ ఎన్నిక ల టైంలో కేసీఆర్ చాలా మందికి ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు.

అయితే ఇప్పుడు వీరి తో పాటు సీనియ‌ర్ నేత‌లు, గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వారు.. గ‌త ఎన్నిక‌ల్లో టిక్కెట్లు రాని వారు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో కేసీఆర్ కు ఏకంగా 88 సీట్లు వ‌చ్చాయి. ఆయ‌న రెండో సారి బంప‌ర్ మెజార్టీ తో తెలంగాణ కు వ‌రుస‌గా రెండో సారి ముఖ్య‌మంత్రి అయ్యారు. అయినా కూడా ఆయ‌న ఫిరాయింపుల‌ను ఎంక‌రేజ్ చేశారు. కాంగ్రెస్ , టీడీపీ ల నుంచి గెలిచిన నేత‌లు అంద‌రూ కారెక్కేశారు.

ఇప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ ఎస్ నుంచి పోటీ చేసిన నేత‌ల‌కు కేసీఆర్ ప్ర‌త్యామ్నాయం చూపించాల్సిన ప‌రిస్థితి ఉంది. అధికార కారు పార్టీలో లెక్క‌కు మించి నేత‌లు ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన కీల‌క నేత‌లు మాత్ర‌మే కాకుండా.. గ‌తంలో తెలుగుదేశం లో ఉన్న వారు కూడా కారెక్కేశారు. ఇప్పుడు కారు ఓవ‌ర‌ల్ లోడుతో ఉంది. దీంతో అంద‌రికి ప‌ద‌వులు ఇవ్వ‌డం సాధ్య‌మ‌య్యేలా లేదు.

ఒక‌రికి ప‌ద‌వులు ఇస్తే.. పార్టీలో మిగిలిన నేత‌లు తీవ్ర అసంతృప్తికి గుర‌వుతారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు పార్టీ మారినా ఆశ్చ‌ర్య పోన‌క్క‌ర్లేదు. ఇదే ఇప్పుడు కేసీఆర్‌కు అగ్ని ప‌రీక్ష‌గా మారింది. మ‌రి ఈ ఆరుగురు కొత్త ఎమ్మెల్సీ లుగా కేసీఆర్ ఎవ‌రిని ఎంపిక చేస్తారో ?  చూడాలి.

 



తెలంగాణ‌లో మ‌రో ఎన్నిక‌.. కేసీఆర్‌కు అస‌లు సిస‌లు అగ్నిప‌రీక్ష‌..!

కోహ్లీ ఏంటిది.. 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడే?

అమరావతి.. గ్రామరాజధానేనా!

గాజువాకలో పవన్‌కు మళ్ళీ కష్టమేనా....?

వైరల్ : ఇలా పెట్రోలు సేవ్ చేసుకోండి.. కానీ చాలా రిస్క్?

చైల్డ్ ఆర్టిస్ట్ గా తనీష్ చేసిన మూవీస్ ఎన్నో తెలుసా..?

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన ఇషాన్

ఆత్మార్పణ లేకపోతే రాష్ట్ర అవతరణ జరిగేదా..?

అమరావతి.. అక్కడే ఎందుకు మిగిలిపోయింది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>