PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpfabe9e88-37bd-4b67-a5a7-41d09d82e629-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpfabe9e88-37bd-4b67-a5a7-41d09d82e629-415x250-IndiaHerald.jpgఅమరావతి రాజధాని ఉద్యమం అంటూ చాన్నాళ్లుగా కొనసాగుతుంది. దాని వరకు వెళ్లి ఎంతో మంది పెద్దలు, పార్టీలు కూడా సంఘీభావం తెలిపాయి. అదే టెంటు పక్కనే మరో ఉద్యమం కూడా కొనసాగుతూనే ఉంది, అదేమో రాజధాని విస్తరణ కావాలి, తద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి అన్నారు. ఇలా పోటాపోటీగా ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పేసింది. రాజధాని విస్తరణ జరిగితీరుతుంది, అమరావతి, కర్నూలు, విశాఖలు ఆంధ్రాకు రాజధానులుగా ఉంటాయని చెప్పేసింది. తద్వారా ఆయా ప్రాంతాలలో ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతాయి కాబamaravati;{#}politics;Capital;Party;Government;TDPఅమరావతి.. గ్రామరాజధానేనా!అమరావతి.. గ్రామరాజధానేనా!amaravati;{#}politics;Capital;Party;Government;TDPMon, 01 Nov 2021 10:50:22 GMTఅమరావతి రాజధాని ఉద్యమం అంటూ చాన్నాళ్లుగా కొనసాగుతుంది. దాని వరకు వెళ్లి ఎంతో మంది పెద్దలు, పార్టీలు కూడా సంఘీభావం తెలిపాయి. అదే టెంటు పక్కనే మరో ఉద్యమం కూడా కొనసాగుతూనే ఉంది, అదేమో రాజధాని విస్తరణ కావాలి, తద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి అన్నారు. ఇలా పోటాపోటీగా ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పేసింది. రాజధాని విస్తరణ జరిగితీరుతుంది, అమరావతి, కర్నూలు, విశాఖలు ఆంధ్రాకు రాజధానులుగా ఉంటాయని చెప్పేసింది. తద్వారా ఆయా ప్రాంతాలలో ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతాయి కాబట్టి అభివృద్ధి కూడా విస్తరించపడుతుంది. ఈ విధానం మంచిదని ప్రారంభంలో అందరు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని భేష్ అన్నారు. ఆతరువాత వాళ్లంతా స్వార్థప్రయోజనాలు గుర్తుకు వచ్చినట్టే ఉన్నాయి, అందుకే యూ టర్న్ తీసుకున్నాయి.

చివరికి రాజధానిపై కూడా టీడీపీ సహా పలు పార్టీలు రాజకీయాలు చేసి, అనేక కేసులు వేయడంతో అక్కడ కూడా ప్రభుత్వం చేపట్టాలి అనుకున్న పనులేవీ జరగలేదు. ఇవన్నీ టీడీపీ కావాలని చేస్తున్నప్పటికీ అవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు అంటూ వేలెత్తి చూపెట్టడం ద్వారా ఆ పార్టీ లబ్ది పొందాలని చూస్తుంది. ప్రభుత్వం కూడా తాము ప్రజలకు చేయాలనుకున్న వన్నీ చేస్తూ పోతున్నప్పటికీ కొన్నిటికి సైన్ధవులు అడ్డుతగులుతున్నట్టు సరాసరి ప్రజలకే చెప్పుకుంటూ వచ్చింది ప్రభుత్వం, ఇది కొంత మేలు చేసినట్టే. కానీ దీర్ఘకాలంలో ఇది కూడా నష్టంగా మారె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే రాజధాని విషయంలో కూడా జరిగింది. మొదట ప్రభుత్వం రాజధాని రైతుల ను పిలిపించి మాట్లాడింది, అయినా టీడీపీ వర్గాలు చేస్తున్న కృత్రిమ ఉద్యమం కాబట్టి ఆ చర్చలు సఫలం కాలేదు.

దీనితో ఇప్పటికి ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. కృత్రిమ ఉద్యమం కాబట్టి ఖర్చు అవుతుంది, దానికి ఎంత ఖర్చు చేస్తుందో ఆ పార్టీ. ఇలాంటి వాటికీ ఖర్చు చేస్తుందంటేనే ఆ పార్టీ అటు ప్రజల లేదా ఇటు రాష్ట్ర ప్రయోజనాలను ఆశించడం లేదని అర్ధం అవుతూనే ఉంది. అలాంటి ఉద్యమాన్ని మళ్ళీ  ఆ పేరుతో పిలుస్తూ ఆ పదానికి ఉన్న ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారు. కృత్రిమ ఉద్యమం కాబట్టే అది ఇలా కేవలం కొన్ని గ్రామాలకే పరిమితం అయ్యింది. ఉద్యమం చేసేవాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్ట్స్ అని తెలిసిపోతుంది. అయినా అదేదో స్వాతంత్ర ఉద్యమం అంటూ అందరు ప్రచారం చేసుకోవడం మాత్రం విచిత్రం, ఇవన్నిటికి కారణం టీడీపీ అండ్ టీం.



కోహ్లీ ఏంటిది.. 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడే?

అమరావతి.. గ్రామరాజధానేనా!

గాజువాకలో పవన్‌కు మళ్ళీ కష్టమేనా....?

వైరల్ : ఇలా పెట్రోలు సేవ్ చేసుకోండి.. కానీ చాలా రిస్క్?

చైల్డ్ ఆర్టిస్ట్ గా తనీష్ చేసిన మూవీస్ ఎన్నో తెలుసా..?

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన ఇషాన్

ఆత్మార్పణ లేకపోతే రాష్ట్ర అవతరణ జరిగేదా..?

అమరావతి.. అక్కడే ఎందుకు మిగిలిపోయింది..!

కన్నడ రాజ్యోత్సవ వేడుకల వెనుక ఇంత చరిత్ర ఉందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>