SportsSuryaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/aluminium-bat-619245f7-3ba2-4f46-9c9b-e11e34bb8a22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/aluminium-bat-619245f7-3ba2-4f46-9c9b-e11e34bb8a22-415x250-IndiaHerald.jpgక్రికెట్ మొదలైన రోజుల్లో క్రికెట్ బ్యాట్ గురించి ఎటువంటి నిబంధనలు ఉండేవికాదు. ఎప్పుడైతే క్రికెట్ లో అల్యూమినియం బ్యాట్ వినియోగించారో అప్పటినుండి ఆ బ్యాట్ పై వివాదాలు చెలరేగాయి ఆ వెంటనే బ్యాట్ వినియోగంపై రూల్ బుక్ సృష్టించబడింది. ఇంతకీ అల్యూమినియం బ్యాట్ ఏంటి , రూల్ బుక్ ఏంటి అనుకుంటున్నారా. పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ గ్రౌండ్‌లో 1979 డిసెంబర్ 15న ఆస్ట్రేలియా - ఇంగ్లండ్‌ల మధ్య యాషెస్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా స్కోర్ 219/8 ఉన్నప్పుడు ఆస్ట్రేలియా బ్యాట్స్ మ్యాన్ డెన్నిస్ లిల్లీ ఇయానAluminium Bat {#}Australia;England;West Indies;Brisbane;Cricket;Decemberక్రికెట్ చరిత్రలో అల్యూమినియం బ్యాట్ తెచ్చిన కొత్త ఉరవడి !!క్రికెట్ చరిత్రలో అల్యూమినియం బ్యాట్ తెచ్చిన కొత్త ఉరవడి !!Aluminium Bat {#}Australia;England;West Indies;Brisbane;Cricket;DecemberMon, 01 Nov 2021 17:39:50 GMT


క్రికెట్ మొదలైన రోజుల్లో క్రికెట్ బ్యాట్ గురించి ఎటువంటి నిబంధనలు ఉండేవికాదు. ఎప్పుడైతే క్రికెట్ లో అల్యూమినియం బ్యాట్ వినియోగించారో అప్పటినుండి ఆ బ్యాట్ పై వివాదాలు చెలరేగాయి ఆ వెంటనే బ్యాట్ వినియోగంపై రూల్ బుక్ సృష్టించబడింది. ఇంతకీ అల్యూమినియం బ్యాట్ ఏంటి , రూల్ బుక్ ఏంటి అనుకుంటున్నారా. పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ గ్రౌండ్‌లో  1979 డిసెంబర్ 15న  ఆస్ట్రేలియా - ఇంగ్లండ్‌ల మధ్య యాషెస్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ లో  ఆస్ట్రేలియా స్కోర్ 219/8 ఉన్నప్పుడు ఆస్ట్రేలియా బ్యాట్స్ మ్యాన్ డెన్నిస్ లిల్లీ ఇయాన్ బోథమ్ బౌలింగ్ లో భారీ షాట్ కొట్టినప్పుడు పెద్ద శబ్దం తో బాల్ బౌండరీ వెళ్ళింది అయితే అద్భుతమైన ఫీల్డింగ్ వల్ల మూడుపరుగులు వచ్చాయి. అయితే అందరి ద్రుష్టి బ్యాట్ జులిపించినప్పుడు వచ్చిన శ్యాబ్దం పై కి వెళ్ళింది. ఈ విషయమై ఇంగ్లాండ్ ఆటగాళ్లు  ఆ బ్యాట్  అభ్యన్తరం వ్యక్తం చేశారు . 





అప్పుడే ప్రపంచానికి అల్యూమినియం బ్యాట్ గురించి తెలిసింది. కానీ డెన్నిస్ లిల్లీ యాషెస్ సిరీస్ కి 12 రోజుల ముందు వెస్టిండీస్ తో  బ్రిస్బేన్‌ జరిగిన మ్యాచ్ లో కూడా అల్యూమినియం బ్యాట్ వాడాడు. అప్పుడు వెస్టిండీస్ ఆటగాళ్లు ఎటువంటి అభ్యన్తరం వ్యక్తం చేయలేదు. యాషెస్ తరువాత ఆ బ్యాట్ డెన్నిస్ లిల్లీ పలు మ్యాచుల్లో వాడటం జరిగింది . ఆ బ్యాట్ ప్రత్యేకతను తెలుసుకుని అందరు అవాక్ అయ్యారు. ఆ బ్యాట్ ను ప్రత్యేకంగా అల్యూమినియం తో తయారు చేయబడిందని తెలుసుకోబడింది. అప్పటినుండి అల్యూమినియం బ్యాట్ ని పలు తయారీ సంస్థలు ఉత్పత్తి ని మొదలుపెట్టాయి. అయితే పెర్త్‌లో యాషెస్ సిరీస్ లో బ్యాట్ పై ఇంగ్లాండ్ ఆటగాళ్లు అంపైర్ కి   అభ్యన్తరం వ్యక్తం చేశారు.అల్యూమినియం బ్యాట్ వాడటం వల్ల బాల్ తొందరగా తన స్థితిని కోల్పోతుందని అప్పీల్ చేశారు. వెంటనే అంపైర్ లు ఆ బ్యాట్ ని వినియోగించవద్దని లిల్లీకి చెప్పారు.





కానీ బ్యాట్ వినియోగం పై రూల్ బుక్ లో ఎటువంటి నిబంధనలు లేవని వారితో వాదించ సాగాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్  గ్రెగ్ చాపెల్ లిల్లీని సముదాయింప జేశాడు. అయితే ఆ మ్యాచ్ లో లిల్లీ బ్యాట్ తో రాణించక పోయినప్పటికీ తన అద్భుతమైన  బౌలింగ్ తో 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా 3.0 ఆధిక్యంతో ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే ఆ మ్యాచ్ తరువాత రూల్ బుక్ లో బ్యాట్ వినియోగం పై కొత్త రూల్స్ వచ్చాయి. అప్పటినుండి బ్యాట్ అనేది కేవలం చెక్క తో మాత్రమే తయారుచేసుకోవలసింది గా నిబంధన తయారయ్యింది. క్రికెట్ అభిమానులు అప్పటివరకు అల్యూమినియం బ్యాట్ పై అభిమానం పెంచుకోగా వారి ఆశలు అడియాసలయ్యాయి.




 అప్పటినుండి అల్యుమినియం బ్యాట్ కనుమరుగయ్యింది. కానీ అల్యూమినియం బ్యాట్ అనేది మొదట బేస్ బాల్ ఆటకు తయారు చేయబడింది. డెన్నిస్ లిల్లీ అల్యూమినియం బేస్ బాల్ బ్యాట్ లను తయారుచేసే కంపెనీకి సహా వాటాదారుడుగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అతని పాట్నర్ క్రికెట్ కోసం అల్యూమినియం బ్యాట్ వినియోగించమని సలహా ఇచ్చాడట అంతే కాకుండా ఆ బ్యాట్ ను స్వయంగా తాను  తయారు చేసి ఇచ్చాడట . ఈవిధంగా ఈ బ్యాట్ క్రికెట్ చరిత్రలో గుర్తుండి పోతుంది.





మోడీ కి కోపం... ఆ మంత్రికి శాపం...?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్

యూపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం..!

పోకిరి స్పూఫ్.. పగలబడి నవ్వుకుంటారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Surya]]>