PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/apfdc0e540-c84f-4d61-bdeb-c8e04e287e25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/apfdc0e540-c84f-4d61-bdeb-c8e04e287e25-415x250-IndiaHerald.jpgతెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడంతో ఆ రాష్ట్ర రాజధానినే ఉమ్మడి రాజధానిగా 15-20ఏళ్ళ పాటు కొనసాగించాలని చెప్పడం జరిగింది. ఇదంతా విభజన చట్టంలో పొందుపరిచారు. అయినా బాబోరు చేసిన పనికి, కేసీఆర్ దొబ్బెయ్ అంటే, బాబోరు కూడా మూటాముల్లె సర్దుకొని హడావుడిగా వచ్చేశారు. ఆ అసహనంతో కొత్త రాజధాని నిర్మించేస్తా అంటూ భూమిని సేకరించడం ప్రారంభించారు. దాదాపు నయానోభయానో 83వేల ఎకరాలపైనే సేకరించారు. అందులో బ్రహ్మాండమైన రాజధాని ప్రపంచస్థాయిలో కట్టాలని ఎన్నో దేశాలు కూడా తిరిగారు. అయినా ఏ ఒక్కటి నచ్చి నట్టే లేదు. ప్రతamaravati;{#}Kurnool;Gharshana;Capital;Government;KCR;Elections;TDP;Hyderabad;Telugu;Amaravatiఅమరావతి.. అక్కడే ఎందుకు మిగిలిపోయింది..!అమరావతి.. అక్కడే ఎందుకు మిగిలిపోయింది..!amaravati;{#}Kurnool;Gharshana;Capital;Government;KCR;Elections;TDP;Hyderabad;Telugu;AmaravatiMon, 01 Nov 2021 09:22:39 GMTతెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడంతో ఆ రాష్ట్ర రాజధానినే ఉమ్మడి రాజధానిగా 15-20ఏళ్ళ పాటు కొనసాగించాలని చెప్పడం జరిగింది. ఇదంతా విభజన చట్టంలో పొందుపరిచారు. అయినా బాబోరు చేసిన పనికి, కేసీఆర్ దొబ్బెయ్ అంటే, బాబోరు కూడా మూటాముల్లె సర్దుకొని హడావుడిగా వచ్చేశారు. ఆ అసహనంతో కొత్త రాజధాని నిర్మించేస్తా అంటూ భూమిని సేకరించడం ప్రారంభించారు. దాదాపు నయానోభయానో 83వేల ఎకరాలపైనే సేకరించారు. అందులో బ్రహ్మాండమైన రాజధాని ప్రపంచస్థాయిలో కట్టాలని ఎన్నో దేశాలు కూడా తిరిగారు. అయినా ఏ ఒక్కటి నచ్చి నట్టే లేదు. ప్రతిసారి ఇదా అదా అంటూ ఘర్షణ పడ్డారు తప్ప ఒక్కదానిపై స్పష్టత రాలేదు. అప్పటికే ఏళ్ళు గడిచిపోయింది, ఉన్న అధికారం ఐదేళ్లు, అంతలో మొత్తానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని దానిని ప్రారంభించారు. ఎన్నికలు వచ్చాయి. ఇక వాటికోసం ప్రచారం గట్రా వీటితోనే సరిపోయింది.

ఇక కొత్త ప్రభుత్వం రాక తప్పలేదు. ముందు కొత్త రాష్ట్రం కదా, అనుభవం ఉన్న వారికి ఇవ్వడం ద్వారా కాస్త మేలు జరుగుతుందని అందరు బాబోరిని ఎంచుకున్నారు. కానీ ఆయన రాజధాని అనే పేరుతో భూములకు వసూలు చేసుకున్నాడు, అదే పేరుతో సినిమాలు చూపించాడు తప్ప పెద్దగా చేసింది ఏమి లేదని ప్రజలకు అర్ధం అవడంతో ప్రభుత్వం మారక తప్పలేదు. వచ్చిన ప్రభుత్వం కూడా అక్కడ పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టె స్థితిలో రాజధాని లేదని విశ్లేషించుకుని, అప్పటికే గతప్రభుత్వం చేసిన అప్పులు తీవ్రంగా ఉండటంతో వాటికీ వడ్డీ కట్టుకుంటూ, రాజధాని విస్తరణ చేయడం ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి చేకూరుతుంది అని ఆలోచించింది. ఇదంతా హైదరాబాద్ చుట్టూ తిరిగిన అంశం. అక్కడ ఒక్కచోట తీవ్రంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మిగిలిన ఏ ప్రాంతం చెప్పుకోదగ్గ విధంగా అభివృద్ధి చెందలేకపోయింది.  అందుకని రాజధాని విస్తరణ అవసరం కనిపించింది. కానీ దానిని విపక్షాలు తప్పుదోవ పట్టించి, లేనిపోని ఉద్యమాలను లేవనెత్తారు.

అదే అమరావతి ఉద్యమం. అసలు అక్కడ రాజధాని ఉండబోదని ఎవరూ చెప్పలేదు. రాజధాని విస్తరణ లో భాగంగా అమరావతి, విశాఖ, కర్నూలు లలో ఆయా ప్రభుత్వ కార్యకలాపాలను విస్తరించాలని కొత్త ప్రభుత్వం నిశ్చితమైన అభిప్రయానికి వచ్చింది. ఇది శ్రేష్ఠమైన ఆలోచనే. కానీ విపక్షాలు కావాలని దానిని యాగీ చేసి, ఉద్యమం పేరుతో కేవలం 29 గ్రామాలలోని వారిని రెచ్చగొట్టి లేదా పెట్టుబడి పెట్టి మాత్రమే ఈ ఉద్యమం జరుపుతున్నారు. ఒకవేళ ప్రజలే ఇది చేస్తున్నా కూడా, అదంతా రాజధానిపై ప్రజలలో టీడీపీ పార్టీ పెంచిన అపోహలే కారణం. అందుకే వాళ్ళు రోడ్డెక్కాల్సి వచ్చింది. అందుకే ఇది కేవలం 29 గ్రామాలకే పరిమితం అయ్యింది. అక్కడ నిరసన చేసేవారిలో కూడా చాలా మందికి ఈ విషయం అర్ధం అయినప్పటికీ, టీడీపీ ఒత్తిడి వలన ఇంకా ఉద్యమం కొనసాగుతుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం.



తన నటనతో రవితేజకే మంచి హిట్ ఇచ్చిన చైల్డ్ యాక్టర్..!!

అమరావతి.. అక్కడే ఎందుకు మిగిలిపోయింది..!

కన్నడ రాజ్యోత్సవ వేడుకల వెనుక ఇంత చరిత్ర ఉందా..?

బీజేపీకి జ‌న‌సేన గుడ్ బై.. కానీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>