MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babubeb6cd49-d20b-48a9-a1b5-5513f0db8179-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babubeb6cd49-d20b-48a9-a1b5-5513f0db8179-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మొదటి సినిమా 'రాజకుమారుడు' నుంచి ఇటీవల వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' వరకు కొన్ని చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో అలరించాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. విలన్ గా, తండ్రిగా, మేనమామగా.. ఇలా పలు విభిన్న పాత్రల్లో సందడి చేశాడు ప్రకాష్ రాజ్. ఇక ఇప్పుడు మరో సారి మహేష్ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు ఈ విలక్షణ నటుడు. మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుకి తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించబోతుMahesh Babu{#}maharshi;parasuram;thaman s;Maharshi;Rajani kanth;Mythri Movie Makers;Samuthirakani;Prakash Raj;keerthi suresh;Tamil;mahesh babu;News;Diwali;Blockbuster hit;Chitram;Cinemaమరోసారి మహేష్ తండ్రి గా ప్రకాష్ రాజ్.. అయితే బొమ్మ బ్లాక్ బస్టరే..!!మరోసారి మహేష్ తండ్రి గా ప్రకాష్ రాజ్.. అయితే బొమ్మ బ్లాక్ బస్టరే..!!Mahesh Babu{#}maharshi;parasuram;thaman s;Maharshi;Rajani kanth;Mythri Movie Makers;Samuthirakani;Prakash Raj;keerthi suresh;Tamil;mahesh babu;News;Diwali;Blockbuster hit;Chitram;CinemaMon, 01 Nov 2021 18:00:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మొదటి సినిమా 'రాజకుమారుడు' నుంచి ఇటీవల వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' వరకు కొన్ని చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో అలరించాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. విలన్ గా, తండ్రిగా, మేనమామగా.. ఇలా పలు విభిన్న పాత్రల్లో సందడి చేశాడు ప్రకాష్ రాజ్. ఇక ఇప్పుడు మరో సారి మహేష్ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు ఈ విలక్షణ నటుడు. మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుకి తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నట్లు తాజా సమాచారం.

ఇక మహేష్ బాబు గత చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' లో ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ గా మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం తండ్రిగా కనిపించబోతున్నాడట. ఇదే కనుక నిజమైతే సూపర్ స్టార్ మహేష్ కు తండ్రిగా నటించే నాలుగో చిత్రంగా 'సర్కారు వారి పాట నిలుస్తుంది'.ఇక గతంలో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహర్షి వంటి చిత్రాల్లో మహేష్ బాబు కి తండ్రిగా ఆకట్టుకున్నారు ప్రకాష్ రాజ్. ఆ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. కాబట్టి మరోసారి ఇదే హిస్టరీ రిపీట్ అయితే 'సర్కారు వారి పాట' సినిమా కూడా బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోతుందని అంటున్నారు.

చూడాలి మరి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా? లేదా అనేది.. ఇక జి ఎం బి క్రియేషన్స్, 14 రీల్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినిమాలో మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నడుస్తుండగా ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి పాట దీపావళి కానుకగా విడుదల కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి అందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది...!!



మోడీ కి కోపం... ఆ మంత్రికి శాపం...?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్

యూపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం..!

పోకిరి స్పూఫ్.. పగలబడి నవ్వుకుంటారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>