PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan9fff5607-c737-4128-8d81-209c9b9a3ff7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan9fff5607-c737-4128-8d81-209c9b9a3ff7-415x250-IndiaHerald.jpgపవన్ కల్యాణ్ జనసేనానిగా దూకుడు చూపిస్తున్నారు. ఆయన ఒక వైపు వరసబెట్టి సినిమాలు చేస్తూనే రాజకీయం కూడా జోరుగా చేస్తున్నారు. గతంలో లేని విధంగా ఆయన తరచూ పర్యటనలు చేస్తున్నారు. ఇక మూడు రోజుల ఉత్తరాంధ్రా పర్యటలో పవన్ బిజీగా ఉండడం బట్టి చూస్తూంటే ఏపీ రాజకీయాల్లో ఆ పార్టీ ఎలాంటి కీ రోల్ ప్లే చేయాలని అనుకుంటుందో pawan{#}Partyటీడీపీ బీజేపీ మధ్యలో పవన్... ?టీడీపీ బీజేపీ మధ్యలో పవన్... ?pawan{#}PartyMon, 01 Nov 2021 19:38:45 GMTపవన్ కల్యాణ్ జనసేనానిగా దూకుడు చూపిస్తున్నారు. ఆయన ఒక వైపు వరసబెట్టి  సినిమాలు చేస్తూనే రాజకీయం కూడా జోరుగా చేస్తున్నారు. గతంలో లేని విధంగా ఆయన తరచూ పర్యటనలు చేస్తున్నారు. ఇక మూడు రోజుల  ఉత్తరాంధ్రా పర్యటలో పవన్ బిజీగా ఉండడం బట్టి చూస్తూంటే ఏపీ రాజకీయాల్లో ఆ పార్టీ ఎలాంటి కీ రోల్ ప్లే చేయాలని అనుకుంటుందో
అర్ధమవుతుంది.

ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో 2024లో ఎన్నికలు జరిగితే 2014 నాటి పొత్తుని కంటిన్యూ చేయాలని టీడీపీ భావిస్తోంది. బీజేపీతో మైత్రి చేయడానికి టీడీపీ ఇప్పటికే చేయాల్సిన ప్రయత్నాలు చేసుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతు అవసరం అని టీడీపీ పెద్దలు భావించడమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే జనసేన సైతం బీజేపీ విషయంలో వేరే అభిప్రాయంతో అయితే లేదు అన్న మాట వినిపిస్తోంది. దానికి కారణం ఆ పార్టీ కూడా కేంద్రం మద్దతు కోరుకోవడమే.

అందుకే పవన్ విశాఖ టూర్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేదని అంటున్నారు. తప్పు అంతా వైసీపీదే అని సులువుగా నెట్టేశారు. కేంద్రానికి పాపం ఏపీ గురించి ఏం తెలుస్తుంది అన్నట్లుగా మాట్లాడారు. అంతే తప్ప ఒక గట్టి పాలసీని పెట్టుకుని ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతున్న కేంద్రాన్ని ఆయన ఏమీ అనకపోవడం మీద చర్చ సాగుతోంది.

ఇక పవన్ పార్టీలో నంబర్ టూ అయిన నాదెండ్ల మనోహర్ అయితే తాజాగా ఒక చానల్ ఇంటర్వ్యూలో తాము అందరితోనూ కలసి ముందుకు సాగుతామని చెప్పారు. ఆయన బయటకు పేర్లు చెప్పకపోయినా కూడా బీజేపీ, టీడీపీలతో కలసి వెళ్లాలన్నది ఆలోచనగా ఉందనే దీన్ని అర్ధం చేసుకుంటున్నారు. పవన్ కి బీజేపీకి పొత్తు ఉంది. ఇక టీడీపీతో బీజేపీ పొత్తు ఉండాలనే ఆ పార్టీ కోరుకుంటోంది అన్నదే ఇక్కడ కనిపిస్తున్న విషయం అంటున్నారు. మరి బీజేపీ కనుక సానుకూలంగా ఉంటే ఈ ముగ్గురు మిత్రులు కలసి ఏపీలో జగన్ని ఢీ కొట్టడానికి సరైన యాక్షన్ ప్లాన్ తో ముందుకు వస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.






యూపీ సర్కార్ :12 లక్షల మట్టి దీపాలు వెలిగించి రికార్డు సృష్టించనుందా..?

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>