PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/punith-raj-kumare1b8ae88-5cd2-41a9-beb5-b2cfa981e949-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/punith-raj-kumare1b8ae88-5cd2-41a9-beb5-b2cfa981e949-415x250-IndiaHerald.jpgదివంగత కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 46 ఏళ్ల వయసులోనే గుండె పోటుతో మృతి చెందిన పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలను కర్ణాటక ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది. ఆయన అభిమానులు అయితే చివరి చూపు కోసం లక్షలాదిగా తరలివచ్చారు. ఇప్పటికి కన్నడిగులు పునీత్ రాజ్‌కుమార్ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కూడా. మా అప్పు తిరిగి వస్తాడంటూ గుండెలు పగిలేలా అరుస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్ చేసిన సేవలు... ఆయన మరణం తర్వాతే బాహ్య ప్రపంచానికి తPuneet{#}Sandal wood;Heart;Santosham;Pawan Kalyan;Government;Telangana Chief Minister;CMపునీత్‌కు అరుదైన గౌరవం...!పునీత్‌కు అరుదైన గౌరవం...!Puneet{#}Sandal wood;Heart;Santosham;Pawan Kalyan;Government;Telangana Chief Minister;CMMon, 01 Nov 2021 14:37:16 GMTదివంగత కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 46 ఏళ్ల వయసులోనే గుండె పోటుతో మృతి చెందిన పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలను కర్ణాటక ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది. ఆయన అభిమానులు అయితే చివరి చూపు కోసం లక్షలాదిగా తరలివచ్చారు. ఇప్పటికి కన్నడిగులు పునీత్ రాజ్‌కుమార్ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కూడా. మా అప్పు తిరిగి వస్తాడంటూ గుండెలు పగిలేలా అరుస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్ చేసిన సేవలు... ఆయన మరణం తర్వాతే బాహ్య ప్రపంచానికి తెలిశాయి. సాక్షాత్తు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరా జ్ బొమ్మే స్వయంగా పునీత్ పార్థివ దేహాన్ని ముద్దాడి కన్నీరు పెట్టుకున్నారు. ఇక శాండిల్ వుడ్‌తో పాటు టాలీవుడ్, కోలివుడ్ ప్రముఖులు ఎంతో మంది పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహం వద్ద కన్నీరు పెట్టుకున్నారంటే... పునీత్ ఎటువంటి వ్యక్తో అర్థం అవుతోంది.

కన్నడ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న పునీత్ రాజ్‌కుమార్‌ను ఘనంగా సత్కరించాలని కర్ణాటక సర్కార్ భావిస్తోంది. సమాజమే దేవాలయం అన్నట్లుగా సాగింది పునీత్ రాజ్‌కుమార్ జీవితం. సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేదలు, అనాథల కోసం ఖర్చు చేశారు పునీత్ రాజ్‌కుమార్. అప్పు మరణానంతరం శాండిల్ వుడ్ పూర్తిగా మూగబోయింది. పునీత్ రాజ్‌కుమార్ అభిమానుల కోరిక మేరకు ఆయనకు కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే కర్ణాటక రత్న పురస్కారం ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ స్వయంగా ప్రకటించారు. కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో... సీఎం పాల్గొన్నారు. పునీత్ రాజ్‌కుమార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్న బొమ్మయ్... ఆయనకు కర్ణాటక రత్న పురస్కారం ఇచ్చే ఆలోచనలో తమ సర్కార్ ఉన్నట్లు బొమ్మయ్ స్వయంగా ప్రకటించారు. దీంతో పునీత్ రాజ్‌కుమార్ అభిమానులతో పాటు.... కన్నడిగులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.





విడుదలయిన గంటకే మోత మోగించిన ఆర్.ఆర్.ఆర్ గ్లింప్స్..!

జ‌గ‌న్ Vs చంద్ర‌బాబు... మ‌రో అదిరిపోయే యుద్ధం.. విజేత ఎవ‌రో..!

వైసీపీకి పరోక్షంగా మేలు చేసిన పవన్..

మద్యం తాగొచ్చిన టీచర్.. చివరికి ఏం చేశాడో తెలుసా?

కొడాలి నాని తో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా...?

మంచిమాట : మనం ఏ గింజ వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది..!!

స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో పేకాట...!

చంద్ర‌బాబుకు వైసీపీ త్రిమూర్తుల ఫీవ‌ర్‌...!

కేసీఆర్ గారు టీచర్ పోస్టులు వేయండి సారు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>