PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpgఎందుకంటే సినీ రంగంలో ఫుల్ క్రేజ్ ఉండే పవన్ కల్యాణ్...తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. భీమవరంతో పాటు గాజువాక సీటులో సైతం పోటీ చేశారు. అయితే రెండు చోట్ల పవన్ గెలిచేస్తారని అంతా అనుకున్నారు. ఒకవలే భీమవరంలో టఫ్ ఉన్నా సరే గాజువాకలో గెలిచేస్తారని భావించారు. కానీ ఊహించని విధంగా పవన్ రెండు చోట్ల ఓడిపోయారు.అయితే ఓడిపోయాక పెద్దగా రెండు నియోజకవర్గాలపై పవన్ ఫోకస్ చేయలేదు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో పవన్, విశాఖకు వచ్చి..స్టీల్ ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉద్యోగులJanasena{#}Gajuwaka;Vishakapatnam;Andhra Pradesh;Bharatiya Janata Party;TDPగాజువాకలో పవన్‌కు మళ్ళీ కష్టమేనా....?గాజువాకలో పవన్‌కు మళ్ళీ కష్టమేనా....?Janasena{#}Gajuwaka;Vishakapatnam;Andhra Pradesh;Bharatiya Janata Party;TDPMon, 01 Nov 2021 10:30:10 GMTగాజువాక...గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు బాగా ఫోకస్ పెట్టిన నియోజకవర్గం...ఎందుకంటే సినీ రంగంలో ఫుల్ క్రేజ్ ఉండే పవన్ కల్యాణ్...తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. భీమవరంతో పాటు గాజువాక సీటులో సైతం పోటీ చేశారు. అయితే రెండు చోట్ల పవన్ గెలిచేస్తారని అంతా అనుకున్నారు. ఒకవలే భీమవరంలో టఫ్ ఉన్నా సరే గాజువాకలో గెలిచేస్తారని భావించారు. కానీ ఊహించని విధంగా పవన్ రెండు చోట్ల ఓడిపోయారు.

అయితే ఓడిపోయాక పెద్దగా రెండు నియోజకవర్గాలపై పవన్ ఫోకస్ చేయలేదు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో పవన్, విశాఖకు వచ్చి..స్టీల్ ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉద్యోగులకు మద్ధతు ఇచ్చారు. ఇదే క్రమంలో ఆయన తన ఓటమిపై కూడా మాట్లాడారు. గత ఎన్నికల్లో గాజువాకలో ఓడిపోయిన విషయాన్ని ప్రస్తావించారు...గెలిచిన వాళ్ళు ప్రజలకు అండగా లేకపోయినా తాను మాత్రం అండగా ఉంటానని చెప్పారు.

అంటే ప్రజలు తనని ఓడించినా సరే, వారికి కోసం నిలబడుతున్నానని చెబుతున్నారు. దీని బట్టి చూస్తే మళ్ళీ పవన్, గాజువాకలోనే పోటీ చేస్తే, ప్రజలకు తనకు సపోర్ట్‌గా ఉండాలని పరోక్షంగా కోరుకుంటున్నారా? అనే డౌట్ రాక మానదు. అయితే ఇప్పటివరకు మళ్ళీ ఎక్కడ పోటీ చేస్తారనేది క్లారిటీ రాలేదు. ఒకవేళ గాజువాకలోనే పోటీ చేస్తే ఈ సారి పవన్ విజయావకాశాలు ఎలా ఉంటాయంటే...కాస్త మెరుగ్గానే ఉంటాయని చెప్పొచ్చు.

అదే సమయంలో ఇక్కడ టీడీపీ కూడా బలపడింది. కాకపోతే ఇక్కడొక ట్విస్ట్ ఉంది...పవన్, బీజేపీతో కలిసి పొత్తులో ఉన్నారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. దీంతో గాజువాకలోని ప్రజలు బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు..అలాంటప్పుడు పవన్ ఈ విషయం ఏమి తేల్చకుండా బీజేపీతో కలిసి బరిలో దిగితే మళ్ళీ గెలుపుకు ఇబ్బందయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అదే సమయంలో టీడీపీతో పొత్తు ఉంటే మాత్రం రాజకీయం వేరుగా ఉంటుంది. టీడీపీ సపోర్ట్ ఉంటే పవన్ గెలుపు సులువే. 



గాజువాకలో పవన్‌కు మళ్ళీ కష్టమేనా....?

వైరల్ : ఇలా పెట్రోలు సేవ్ చేసుకోండి.. కానీ చాలా రిస్క్?

చైల్డ్ ఆర్టిస్ట్ గా తనీష్ చేసిన మూవీస్ ఎన్నో తెలుసా..?

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన ఇషాన్

ఆత్మార్పణ లేకపోతే రాష్ట్ర అవతరణ జరిగేదా..?

అమరావతి.. అక్కడే ఎందుకు మిగిలిపోయింది..!

కన్నడ రాజ్యోత్సవ వేడుకల వెనుక ఇంత చరిత్ర ఉందా..?

బీజేపీకి జ‌న‌సేన గుడ్ బై.. కానీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>