PoliticsDeekshitha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyanfaa8702a-f702-4136-9075-499e8c5cf203-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyanfaa8702a-f702-4136-9075-499e8c5cf203-415x250-IndiaHerald.jpgపవన్ కల్యాణ్ విశాఖ సభలో కేంద్రంపై శివాలెత్తుతారని ఆశించినవారంతా నిరాశలో ఉన్నారు. ఆయన కేంద్రాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపైనే నిందలు మోపారు. అయితే ఇది ఒకరకంగా వైసీపీకి మేలు చేస్తుందనే చెప్పాలి. ఇప్పటికే వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ బీజేపీకి పూర్తి స్థాయిలో సాగిలపడ్డారని, ఆయన ప్రశ్నించే స్వభావాన్ని మరచిపోయారని విమర్శిస్తున్నారు. దీనికి మరో రుజువు దొరికినట్టయింది. pawan kalyan{#}war;Uttarandhra;Pawan Kalyan;Government;Vishakapatnam;YCPవైసీపీకి పరోక్షంగా మేలు చేసిన పవన్..వైసీపీకి పరోక్షంగా మేలు చేసిన పవన్..pawan kalyan{#}war;Uttarandhra;Pawan Kalyan;Government;Vishakapatnam;YCPMon, 01 Nov 2021 14:39:22 GMTపవన్ కల్యాణ్ విశాఖ సభలో కేంద్రంపై శివాలెత్తుతారని ఆశించినవారంతా నిరాశలో ఉన్నారు. ఆయన కేంద్రాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపైనే నిందలు మోపారు. అయితే ఇది ఒకరకంగా వైసీపీకి మేలు చేస్తుందనే చెప్పాలి. ఇప్పటికే వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ బీజేపీకి పూర్తి స్థాయిలో సాగిలపడ్డారని, ఆయన ప్రశ్నించే స్వభావాన్ని మరచిపోయారని విమర్శిస్తున్నారు. దీనికి మరో రుజువు దొరికినట్టయింది.

మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో దూరం కావాలని ఎవరూ చెప్పరు కానీ, పూర్తిగా కేంద్రం చేతుల్లో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అనే అంశాన్ని పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పిదంగా చూడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. అదే సమయంలో ఆయన ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఉద్యమం మొదలు పెడితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని ఆలోచించారు. కానీ పవన్ ఉద్యమాన్ని మొదలు పెట్టినా అది కేంద్రానికి నొప్పి తగలకుండానే అనే విషయం రూఢీ అయిపోయింది. దీంతో పవన్ ని జనాలు లైట్ తీసుకుంటారని, పవన్ తో తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదనేది వైసీపీ ఆలోచన.

ఒకవేళ పవన్ కల్యాణ్ విశాఖ ఉక్కు పోరాటాన్ని లీడ్ తీసుకుని కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తే, పరోక్షంగా అది వైసీపీకి కూడా మైనస్ అయ్యేది. పవన్ కల్యాణ్ ని ఉత్తరాంధ్ర ప్రజానీకం ఉక్కు పోరాట యోధుడిగా గుర్తించేవారు. కానీ పవన్ చివరకు తన పోరాటం రాష్ట్ర ప్రభుత్వంపై కానీ, కేంద్రంపై కాదని తేల్చేశారు. అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం తీర్మానం చేసినా, అది కుదరదు అఖిలపక్షాన్ని పిలవండి అంటున్నారు. ఇలాంటి వాదనతో ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుందో ఊహించుకోవచ్చు. పవన్ సభకు ప్రజలు భారీగా వచ్చినా, పవన్ వాదనలో పసలేదని వైసీపీ విమర్శిస్తోంది. పవన్ ఉక్కు పరిరక్షణ ఉద్యమంతో ప్రభుత్వం ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని అనుమానించిన నేతలు.. ఆయన ప్రసంగం తర్వాత కాస్త రిలాక్స్ అయ్యారు.



విడుదలయిన గంటకే మోత మోగించిన ఆర్.ఆర్.ఆర్ గ్లింప్స్..!

జ‌గ‌న్ Vs చంద్ర‌బాబు... మ‌రో అదిరిపోయే యుద్ధం.. విజేత ఎవ‌రో..!

వైసీపీకి పరోక్షంగా మేలు చేసిన పవన్..

మద్యం తాగొచ్చిన టీచర్.. చివరికి ఏం చేశాడో తెలుసా?

కొడాలి నాని తో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా...?

మంచిమాట : మనం ఏ గింజ వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది..!!

స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో పేకాట...!

చంద్ర‌బాబుకు వైసీపీ త్రిమూర్తుల ఫీవ‌ర్‌...!

కేసీఆర్ గారు టీచర్ పోస్టులు వేయండి సారు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Deekshitha Reddy]]>