అమరావతి మహా పాదయాత్రకు రేణుకా చౌదరి మద్దతు- జగన్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు
అమరావతిలో రైతులు చేపట్టిన మహా పాదయాత్ర తుళ్లూరు నుంచి ఈ ఉదయం బయలుదేరింది. న్యాయస్ధానం టూ దేవస్ధానం పేరుతో మొదలైన ఈ యాత్ర తుళ్లూరు నుంచి తిరుమల వరకూ కొనసాగబోతోంది. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన డిసెంబర్ 19న ఈ యాత్ర తిరుమలలో ముగియబోతోంది. దీనికి విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా సంఘీభావం తెలిపారు.
అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం ప్రకటించేందుకు ఖమ్మం జిల్లా నుంచి బయలుదేరిన రేణుకా చౌదరికి
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, కొండపల్లి బొమ్మను జ్ఞాపికగా ఇచ్చారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల పాదయాత్ర, జగన్ సర్కార్ పై రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు అమరావతి వెళ్తున్నానని రేణుక తెలిపారు. రైతులు దేశానికి వెన్నెముక అని, అలాంటి రైతులను ప్రభుత్వం కంటతడి పెట్టిస్తోందంటూ మండిపడ్డారు.

అమరావతి మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళుతుంటే పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని రేణుకా చౌదరి ఆరోపించారు. నేను సైనికుడి కూతురిని...దేశంలో ఎక్కడైనా పర్యటిస్తా...నాకు భయం అంటే ఏంటో తెలియదని రేణుక వ్యాఖ్యానించారు. అమరావతి రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎపుడు మద్దతుగా ఉంటుందన్నారు.
అమరావతి మహా పాదయాత్రకు రేణుకా చౌదరి మద్దతు- జగన్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు #andhrapradesh, #AmaravatiFarmersMarch , #farmers, #mahapadayatra, #renukachowdary pic.twitter.com/aD8HyU2AWn
— oneindiatelugu (@oneindiatelugu) November 1, 2021
అమరావతి మహా పాదయాత్రకు రేణుకా చౌదరి మద్దతు- జగన్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు #andhrapradesh, #AmaravatiFarmersMarch , #farmers, #mahapadayatra, #renukachowdary pic.twitter.com/1qsmKJN7BE
— oneindiatelugu (@oneindiatelugu) November 1, 2021
అమరావతి ఉద్యమంలో మహిళల పాత్ర అమోఘమన్నారు. మహిళల చేతులకు ఉన్నవి గాజులుకావు,విష్ణు చక్రాలంటూ రేణుక వ్యాఖ్యానించారు. ఓటుతో ఏపీ ప్రభుత్వానికి మహిళలు బుద్ధి చెబుతారని రేణుక తెలిపారు. వైసీపీ సర్కార్ రైతులు రోడ్డెక్కే పరిస్ధితులు తీసుకొచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.