PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/breaking-dfbcc5bd-8220-42c0-82c7-838b2dde5cb1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/breaking-dfbcc5bd-8220-42c0-82c7-838b2dde5cb1-415x250-IndiaHerald.jpgతెలంగాణ వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠగా మారిన ఎన్నిక ఏదీ అంటే... ఠక్కున చెప్పే సమాధానం హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికను అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దాదాపు 4 నెలలుగా హుజురాబాద్ నియోజకవర్గంపైనే అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. అసలు ఇది ఉప ఎన్నికలా కాకుండా... ప్రధాన ఎన్నికనే తలపించింది కూడా. చివరికి ఈ ఉప ఎన్నిక ఈHuzurabad{#}రాజీనామా;Winner;Indian Postal Service;Telangana Rashtra Samithi TRS;KCR;Telangana;Bharatiya Janata Party;Huzurabad;October;central government;Minister;Electionsహుజురా బాద్ షా... ఎవరో మరికొన్ని గంటల్లో ఫలితం..!హుజురా బాద్ షా... ఎవరో మరికొన్ని గంటల్లో ఫలితం..!Huzurabad{#}రాజీనామా;Winner;Indian Postal Service;Telangana Rashtra Samithi TRS;KCR;Telangana;Bharatiya Janata Party;Huzurabad;October;central government;Minister;ElectionsMon, 01 Nov 2021 18:48:58 GMTతెలంగాణ వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠగా మారిన ఎన్నిక ఏదీ అంటే... ఠక్కున చెప్పే సమాధానం హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికను అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దాదాపు 4 నెలలుగా హుజురాబాద్ నియోజకవర్గంపైనే అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. అసలు ఇది ఉప ఎన్నికలా కాకుండా... ప్రధాన ఎన్నికనే తలపించింది కూడా. చివరికి ఈ ఉప ఎన్నిక ఈటెల రాజేందర్ వర్సస్ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లుగా సాగింది. అక్టోబర్ 30వ తేదీన ఉప ఎన్నికను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. చెదురుమొదురు ఘటనలు మినహా... ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గంలో మొత్తంగా 86.64 శాతం ఓట్లు పోలయ్యాయి. కొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా 90 శాతం పైగానే ఓట్లు పోలయ్యాయి కూడా. రాష్ట్రంలో గతంలో జరిగిన ఏ ఉప ఎన్నికలో కూడా ఈ స్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదు.

ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో... ఇప్పుడు అందరి దృష్టి ఫలితంపైనే ఉంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్నీ కూడా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వైపే ఉన్నాయి. హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగురుతుందని అంతా ఫిక్స్ అయ్యారు కూడా. కొంత మంది అయితే ఇప్పటికే మెజారిటీ మీద బెట్టింగ్ కూడా కాసేస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో మహిళలదే పై చెయ్యి. అయినా సరే... ఈ ఉప ఎన్నికలో మాత్రం పురుషులే ఎక్కువగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రేపు ఉదయం జరిగే కౌంటింగ్ కోసం ఇప్పటికే అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ సీల్ ఓపెన్ చేస్తారు. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత నుంచి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ దాదాపు 12 గంటలకు పూర్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తొలి పది రౌండ్లకే విజేత దాదాపు ఖరారు అయ్యే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా హుజురా బాద్ షా ఎవరో మరి కొన్ని గంటల్లో తేలనుంది.





మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్

యూపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం..!

పోకిరి స్పూఫ్.. పగలబడి నవ్వుకుంటారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>