CrimeN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/------------------76f5747c-8822-42f8-b370-090260158fbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/------------------76f5747c-8822-42f8-b370-090260158fbe-415x250-IndiaHerald.jpgక‌న్న కూతురు అని కూడ చూడ‌కుండా ప‌రువుకోసం త‌ల్లిదండ్రులు విచ‌క్ష‌ణ కోల్పుతున్నారు. త‌మ‌ను కాద‌ని త‌మ కూతురు ఇత‌ర కులాల‌కు చెందిన వ్య‌క్తుల‌ను పెళ్లి చేసుకుని ప‌రువు తీస్తున్నార‌ని కూతురును, ఆమె వివాహం చేసుకున్న వ్య‌క్తులను హ‌త‌మారుస్తున్నారు. తాజాగా ఓతండ్రి కూతురు త‌న కూతురు త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌కుండా ఓ ద‌ళిత యువ‌కుడిని వివాహం ఆడింది. అయితే త‌న‌ను కాద‌ని వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంద‌నే ఆగ్ర‌హంతో కూతురికి గుండు కొట్టించి.. పుణ్య‌స్నాయం చేయించాడు తండ్రి. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని#కూతురుకి గుండు కొట్టించిన తండ్రి..!{#}Amit Shah;police;marriage;Traffic police;Fatherకులాంతర వివాహం చేసుకుందని కూతురుకి గుండు కొట్టించిన తండ్రి..!కులాంతర వివాహం చేసుకుందని కూతురుకి గుండు కొట్టించిన తండ్రి..!#కూతురుకి గుండు కొట్టించిన తండ్రి..!{#}Amit Shah;police;marriage;Traffic police;FatherMon, 01 Nov 2021 07:04:06 GMTక‌న్న కూతురు అని కూడ చూడ‌కుండా ప‌రువుకోసం  త‌ల్లిదండ్రులు విచ‌క్ష‌ణ కోల్పుతున్నారు. త‌మ‌ను కాద‌ని త‌మ కూతురు ఇత‌ర కులాల‌కు చెందిన వ్య‌క్తుల‌ను పెళ్లి చేసుకుని ప‌రువు తీస్తున్నార‌ని కూతురును, ఆమె వివాహం చేసుకున్న వ్య‌క్తులను హ‌త‌మారుస్తున్నారు. తాజాగా  ఓతండ్రి కూతురు త‌న కూతురు త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌కుండా ఓ ద‌ళిత యువ‌కుడిని వివాహం ఆడింది. అయితే త‌న‌ను కాద‌ని వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంద‌నే ఆగ్ర‌హంతో కూతురికి గుండు కొట్టించి.. పుణ్య‌స్నాయం చేయించాడు తండ్రి. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. చోప్నాకు చెందిన సాక్షియాద‌వ్‌(24) హాస్ట‌ల్‌లో ఉంటూ న‌ర్సింగ్ చదువుతున్న‌ది. అదే క‌ళాశాల‌లో  ఓ ద‌ళిత‌యువ‌కుడు త‌న‌తో పాటు చ‌దువుతున్నాడు. అమిత్ అహిర్వాల్ అనే యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

ఈ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. ఇది వావాహం వ‌ర‌కు వెళ్లింది. వీరిద్దిరవి వేర్వేరు కులాలు అయినా వీరు వివాహం చేసుకోవాల‌ని నిశ్చ‌యించుకొని అనుకున్నట్టుగానే  ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నారు.  కొద్ది రోజుల త‌రువాత ఉన్న‌ట్టుండి సాక్షియాద‌వ్ తాను వివాహం చేసుకున్న‌ట్టు ఇంట్లో చెప్పింది. త‌న తండ్రి కోపంతో ర‌గిలిపోయాడు. అంతేకాకుండా కూతురును ప‌లుమార్లు వేధింపుల‌కు గురిచేశాడు. ఈ నేప‌థ్యంలో ఇరువ‌ర్గాల‌తో మాట్లాడి పోలీసులు న‌చ్చ‌జెప్ప‌డంతో ఆ తండ్రి పెళ్లికి ఒప్పుకున్న‌ట్టు న‌టించాడు. ఇంత‌లోనే కూతురు సాక్షియాద‌వ్‌ను హాస్ట‌ల్ నుండి ఇంటికి తీసుకొచ్చాడు. అదేవిధంగా కూతురని చూడ‌కుండా కోపంతో ర‌గిలిపోయి గుండు కొట్టించేసాడు. పుణ్య‌స్నానం కూడ చేయించాడు. దీంతో ఆ తండ్రి వేధింపులు తాళ‌లేక సాక్షియాద‌వ్ ఇంటి నుంచి పారిపోయి త‌న భ‌ర్త వ‌ద్ద‌కు చేరుకున్న‌ది.

మ‌హిళా పోలీస్ సూప‌రింటెండెంట్ సిమ‌ల ప్రసాద్‌కు సైతం ఫిర్యాదు చేసింది ఆ యువ‌తి. 2020లో తాను ద‌లిత యువ‌కుడిని పెళ్లి చేసుకున్నాన‌ని, జ‌న‌వ‌రి 04, 2021న తండ్రికి తెలియ‌జేసిన‌ట్టు వివ‌రించింది. తండ్రి జ‌న‌వ‌రి 2021లో అదృశ్య‌మైన‌ట్టు ఫిర్యాదు చేశాడ‌ని తెలిపింది. త‌న‌కు త‌న తండ్రి నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని ఆ యువ‌తి తాజాగా పోలీసుల‌కు వెల్ల‌డించింది. త‌న భ‌ర్త‌కు విడాకులు ఇచ్చి, త‌మ కులానికి చెందిన వ్య‌క్తిని మ‌రో వివాహం చేసుకోవాల‌ని ఒత్తిడి తెస్తున్నార‌ని, త‌మ‌కు ర‌క్ష‌ణ కావాల‌ని పోలీసుల‌ను కోరిన‌ది. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు మ‌హిళా పోలీస్ సూప‌రింటెండెంట్‌ వెల్ల‌డించారు.





ఆ విషయంలో అసూయ పడొద్దంటున్న అల్లుఅర్జున్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>