PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp-tdpc7243ded-e48c-4959-8060-3fe74709f512-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp-tdpc7243ded-e48c-4959-8060-3fe74709f512-415x250-IndiaHerald.jpgబ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో చ‌నిపోయిన ఎమ్మెల్యేకు సానుభూతిగా టీడీపీ పోటీ నుంచి నిష్క్ర‌మించింది. జ‌న‌సేన కూడా పోటీ నుంచి త‌ప్పుకుంది కానీ, తరువాత త‌న వైఖ‌రి మార్చుకుని త‌న మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీకి మ‌ద్ధ‌తు ఇచ్చింది. అయితే, టీడీపీ మాత్రం పోటీ చేయ‌క‌పోవ‌డంతో కొంత అయోమ‌యంలో ప‌డ్డ‌ట్టు తెలిసింది. చివ‌ర‌కు త‌ట‌స్థంగా ఉంటుంద‌నుకుంటే అనుకున్నారు. కానీ, రాజ‌కీయాల్లో త‌ట‌స్థ‌త అంత‌సుల‌భ‌మైన‌ది కాదు. అయితే, బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ వాళ్లు ప‌ని చేశార‌ని వైసీపీ నాయ‌కుల విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. బీజేపీకి అండtdp-bjp{#}prema;Love;TDP;Party;Bharatiya Janata Party;YCPబ‌ద్వేల్‌లో బీజేపీకి టీడీపీ అండ‌.. 2014 రానుందా..?బ‌ద్వేల్‌లో బీజేపీకి టీడీపీ అండ‌.. 2014 రానుందా..?tdp-bjp{#}prema;Love;TDP;Party;Bharatiya Janata Party;YCPMon, 01 Nov 2021 08:33:48 GMTబ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో చ‌నిపోయిన ఎమ్మెల్యేకు సానుభూతిగా టీడీపీ పోటీ నుంచి నిష్క్ర‌మించింది. జ‌న‌సేన కూడా పోటీ నుంచి త‌ప్పుకుంది కానీ, తరువాత త‌న వైఖ‌రి మార్చుకుని త‌న మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీకి మ‌ద్ధ‌తు ఇచ్చింది. అయితే, టీడీపీ మాత్రం పోటీ చేయ‌క‌పోవ‌డంతో కొంత అయోమ‌యంలో ప‌డ్డ‌ట్టు తెలిసింది. చివ‌ర‌కు త‌ట‌స్థంగా ఉంటుంద‌నుకుంటే అనుకున్నారు. కానీ, రాజ‌కీయాల్లో త‌ట‌స్థ‌త అంత‌సుల‌భ‌మైన‌ది కాదు. అయితే, బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ వాళ్లు ప‌ని చేశార‌ని వైసీపీ నాయ‌కుల విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.


 బీజేపీకి అండ‌గా టీడీపీ వాళ్లు ఉన్నార‌నేది వాళ్ల ఆరోప‌ణ‌. కానీ, ఇది టీడీపీ స్థానిక నాయ‌కులు తీసుకున్న నిర్ణ‌య‌మా లేక వైసీపీ కి వ్య‌తిరేకంగా ఉండే ఆ పార్టీ నాయ‌కులు చేశారా, లేదా టీడీపీ రాష్ట్ర నాయ‌క‌త్వమే స‌హ‌క‌రించిందా  అనేది తెలియాల్సి ఉంది. అయితే, ఇందులో ఏది అయినా వైసీపీ నేత‌లు మాత్రం టీడీపీని టార్గెట్‌గా చేసుకున్నారు. సానుభూతితో టీడీపీ ప‌క్క‌కు త‌ప్పుకున్నా వైసీపీ మాత్రం ఆ పార్టీపై అటాక్ మొద‌లు పెట్టింది ఎన్నిక‌ల ముందు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ నేత‌ల‌ను రెచ్చ‌గొట్టారు.  టీడీపీ స్నేహ హ‌స్తాన్ని తీసుకోవ‌డానికి  బీజేపీ సుముఖ‌త వ్య‌క్తం చేయ‌లేదు.


 ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో టీడీపీని బీజేపీ ఆహ్వానించ‌క‌పోయినా స‌మ‌ర్థించింది. ఇది టీడీపీకి రాజ‌కీయంగా  ఏ ర‌కంగా ఉప‌యోగ‌ప‌డొచ్చ‌నే ప్ర‌శ్న త‌లెత్త‌చ్చు. అయితే, వైసీపీ వ్య‌తిరేకంగా పనిచేసేవారు ఆటోమేటిక్‌గా వైసీపీ కి వ్య‌తిరేకంగా ఉన్న‌వారికి స‌పోర్ట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల క్షేత్రస్థాయిలో  బ‌ద్వేల్‌లో బీజేపీ పై ప్రేమ క‌న్నా వైసీపీ పై కోపంతో బీజేపీకి స‌పోర్ట్ ఇచ్చార‌ని క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో బీజేపీకి అండ‌గా టీడీపీ వాళ్లు ఉన్నార‌నే వార్త‌లు వ‌స్తునే ఉన్నాయి. అలాగే, వైసీపీ నేత‌లు ఆరోప‌ణ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.   ఈ విష‌యంలో బీజేపీ కానీ టీడీపీ కానీ ఖండించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇది టీడీపీ వ్యూహాత్మ‌క త‌ప్పిదం అని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. దీంతో మ‌రోసారి 2014 ఎన్నిక‌ల పొత్తు  రానుందా అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

 







బ‌ద్వేల్‌లో బీజేపీకి టీడీపీ అండ‌.. 2014 రానుందా..?

బీజేపీకి జ‌న‌సేన గుడ్ బై.. కానీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>