BusinessPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/gas-cylinder-offercca131fa-bbfc-480e-93b8-fd0ba9a62e42-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/gas-cylinder-offercca131fa-bbfc-480e-93b8-fd0ba9a62e42-415x250-IndiaHerald.jpgదేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ధ‌ర‌ల‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. ఇదే క్ర‌మంలో గ్యాస్ సిలిండ్ ధ‌ర‌ల‌ను కూడా పెంచుతూ దేశీయ చ‌మురు కంపెనీలు వినియోగ‌దారుల‌కు మంట‌లంటిస్తున్నాయి. క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను భారీగా ఏకంగా రూ.266 పెంచేశాయి. ఈ ధ‌ర‌లు నేటి నుంచి అమ‌లు కానున్నాయి. తాజాగా పెంచిన ధ‌ర‌ల‌తో ఢిల్లీలో క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర రెండు వేల రూపాయ‌లను దాటేసింది. పెంపుకంటే ముందు క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ బండ రేటు రూ.1,735 ఉండ‌గా ప్ర‌స్తుతం రూ. 2,175కు చేరుకుంది. ముంబైలో 19 కిలోల క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్gas cylinder{#}oil;Octoberభారీగా పెరిగిన సిలిండ‌ర్ ధ‌ర.. ఎంతంటే..?భారీగా పెరిగిన సిలిండ‌ర్ ధ‌ర.. ఎంతంటే..?gas cylinder{#}oil;OctoberMon, 01 Nov 2021 12:17:01 GMT దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ధ‌ర‌ల‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. ఇదే క్ర‌మంలో గ్యాస్ సిలిండ్ ధ‌ర‌ల‌ను కూడా పెంచుతూ దేశీయ చ‌మురు కంపెనీలు వినియోగ‌దారుల‌కు మంట‌లంటిస్తున్నాయి. క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను భారీగా ఏకంగా రూ.266 పెంచేశాయి. ఈ ధ‌ర‌లు నేటి నుంచి అమ‌లు కానున్నాయి. తాజాగా పెంచిన ధ‌ర‌ల‌తో ఢిల్లీలో క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర రెండు వేల రూపాయ‌లను దాటేసింది. పెంపుకంటే ముందు క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ బండ రేటు రూ.1,735 ఉండ‌గా ప్ర‌స్తుతం రూ. 2,175కు చేరుకుంది. ముంబైలో 19 కిలోల క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.1950 ఉంది. కొల్‌క‌త్తాలో రూ.2073 ఉండ‌గా, చెన్నైలో రూ.2,133 కు క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ఉంది.



  ఇదే క్ర‌మంలో ఎన్న‌డూ లేనంత‌గా రికార్డు స్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్‌ ధరలు కూడా భాగీగా పెర‌గుతుండ‌డంతో వినియోగ‌ధారులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే, క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండర్లను అధికంగా హోటల్స్‌, రెస్టారెంట్ల‌లో వినియోగిస్తారు. అక్టోబర్ 1వ తేదిన‌ 19 కిలోల కమర్షియల్ వాణిజ్య సిలిండ‌ర్ల ధ‌ర‌లు పెరిగితే, 6 వ‌ తేదిన ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరలు పెరిగిన విష‌యం తెలిసిందే.  ప్రస్తుతం కోల్‌కతాలో14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ రేటు రూ.926 గా ఉంది. అలాగే, చెన్నైలో  ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ.915.50 గా ఉంది.  ముడిచమురు ధరలు పెరగడంతో ఎల్‌పీజీ సిలిండర్ ధరలు కూడా భారీగా పెరిగిపోతాయనే ఆందోళనలు వినియోగ‌దారుల్లో వ్య‌క్తం అవుతున్నాయి.



   సాధారణంగా ప్రతి నెలా 1వ‌ తేదీ, 15వ తేదీల్లో గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు మార‌స్తుంటాయి. మరోవైపు వంట గ్యాస్ సిలిండ‌ర్ ధరలను కూడా పెంచాలని ఆయిల్ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. గత నెలలో 1వ తేదీన వాణిజ్య‌ సిలిండర్ ధరలు పెంచాయి అనంత‌రం 6వ తేదీన డొమెస్టిక్ సిలిండర్ ధరను కూడా పెంచేశాయి కంపెనీలు. ఈ క్ర‌మంలో క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ ధ‌ర పెరుగుద‌ల‌తో డొమెస్టిక్ సిలిండ‌ర్ ధ‌ర‌లు కూడా పెంచుతార‌ని సామాన్యులు ఆందోన వ్య‌క్తం చేస్తున్నారు. ఏది ఏమైన ఈ ధ‌రాఘాతం సామాన్యుల పాలిట శ‌రాఘ‌తాంగా మారింద‌నే చెప్పాలి.



ఏపీలో ఆకలి కేకలు.. ఏం జరిగింది..?

నాగ‌శౌర్య ఫామ్ హౌస్ లో పేకాట కేసులో బిగ్ ట్విస్ట్..!

పాదయాత్రకు నో బ్రేక్ అంటున్న షర్మిల...?

బ్రేకింగ్: ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ సక్సెస్...?

నాగశౌర్య ఇంట్లో జూదం.. 20 మంది ప్రముఖులను పట్టుకున్న పోలీసులు!!

రామ్ చరణ్, ఎన్టీఆర్ ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేవు గా!!

అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని టీడీపీ వ‌దిలేసిందా..?

కేసీఆర్ Vs ఈటెల: టీఆర్ఎస్ గెలిస్తే ఈ అనుమానాల‌కు ఆన్సర్లేవి..!

కోహ్లీ ఏంటిది.. 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>