PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpa8a546e9-561c-4748-ac1e-ce6e6e343f91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpa8a546e9-561c-4748-ac1e-ce6e6e343f91-415x250-IndiaHerald.jpgఏపీలో మరో సమరానికి తెర లేచింది. నిజానికి ఈ ఏడాదిని ఎన్నికల సంవత్సరంగా పిలవాలేమో. ఈ ఏడాది మొదలవుతూనే లోకల్ బాడీ ఎన్నికలు వరసబెట్టి జరిగాయి. ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరిగింది. తాజాగా బద్వేల్ ఉప పోరు కూడా ముగిసింది. ycp{#}Ministerమినీ లోకల్ పోరులో వైసీపీకి షాక్... ?మినీ లోకల్ పోరులో వైసీపీకి షాక్... ?ycp{#}MinisterMon, 01 Nov 2021 21:00:00 GMTఏపీలో మరో సమరానికి తెర లేచింది. నిజానికి ఈ ఏడాదిని ఎన్నికల సంవత్సరంగా పిలవాలేమో. ఈ ఏడాది మొదలవుతూనే లోకల్ బాడీ ఎన్నికలు వరసబెట్టి జరిగాయి. ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరిగింది. తాజాగా బద్వేల్ ఉప పోరు కూడా ముగిసింది.

ఇపుడు మినీ లోకల్ పోరు స్టార్ట్ అయింది. గతంలో ఎన్నికలు నిర్వహించని ప్రాంతాల్లో ఎన్నికలు అన్నమాట. నిజానికి ఏపీలో మూడు కార్పోరేషన్లకు ఎన్నికలు జరగాలి. అయితే రాజమండ్రి, శ్రీకాకుళం సాంకేతిక కారణాల వల్ల నిలుపు చేశారు. తాజా నోటిఫికేషన్ లో నెల్లూరు కార్పోరేషన్ తో పాటు 12 మునిసిపాలిటీస్ అయిదు వందల యాభైకి  పైగా పంచాయతీ వార్డులు, 11 జెడ్పీటీసీలు, 85 ఎంపీటీసీలకు ఎన్నికలు ఉన్నాయి. ఇందులో ఒక్క పంచాయతీ ఎన్నికలే గుర్తు మీద జరగవు. అయితే అవి పార్టీల మద్దతుదారుల మధ్య పోరుగా ఉంటాయి. సరే దాన్ని పక్కన పెట్టినా మునిసిపాలిటీస్ అందరినీ ఆకట్టుకుంటాయి.

ఇక నెల్లూరు కార్పోరేషన్ అన్నది వైసీపీకి అగ్ని పరీక్ష అంటున్నారు. అక్కడ టీడీపీ బలంగా ఉంది. దాంతో పాటు ఆ జిల్లా వైసీపీలో గ్రూపులు ఉన్నాయి. ప్రత్యేకించి చూస్తే మాజీ మంత్రి ఆనం రామ‌ నారాయణరెడ్డికి బాగా బలం ఉంది. ఆయన కనుక సహాయ నిరాకరణ చేస్తే కష్టమే అంటున్నారు. మరో వైపు చూసుకుంటే మునిసిపాలిటీలలో కూడా ఈసారి సీన్ మారుతుంది అంటున్నారు.

తెలుగుదేశం అయితే ఈసారి ప్రతిష్టగానే తీసుకుంది.ఈ మధ్యనే కుప్పం మునిసిపాలిటీలో పర్యటించి వచ్చిన చంద్రబాబుకు అక్కడ మంచి మద్దతు లభించింది. దాంతో ఆయన మినీ పోరులో కొన్ని చోట్ల తిరిగే అవకాశం ఉంది. ఇక జనసేన, టీడీపీ మళ్లీ సహకరించుకుంటాయని అంటున్నారు. బద్వేల్ ఉప ఎన్నికలలో బీజేపీకి కూడా టీడీపీ సాయం అందిందని అంటున్నారు. ఈ మూడు పార్టీలు కలిస్తే అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవని కూడా అంటున్నారు. చూడాలి మరి






టీఆర్‌ఎస్ ‘విజయగర్జన‘ సభ వాయిదా..! అందుకోస‌మేనా..?

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>