PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/janasena-jd-lakshmi-narayana4482db66-99b7-4a32-bfc1-5ebd32b9d87a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/janasena-jd-lakshmi-narayana4482db66-99b7-4a32-bfc1-5ebd32b9d87a-415x250-IndiaHerald.jpgరాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌ని అంటారు. ఎప్పుడు ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా.. అవ‌కాశం ద‌క్కి నా.. రాజ‌కీయాలు మారుతుంటాయి. దీనికి ఎవ‌రూ అతీతులు కారు. ఒక‌ప్పుడు అంటే.. పార్టీల ప‌రంగా వ్య‌క్తుల ఇమేజ్ ఆధార ప‌డి ఉండేది క‌నుక‌.. నాయ‌కులు పార్టీల‌కు ప్రాధాన్యం ఇచ్చేవారు.కానీ, ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి పోయి.. వ్య‌క్తుల ఇమేజ్‌పైనే పార్టీలు ఆధార‌ప‌డుతున్న ప‌రిస్థితి ఉంది. సో.. అటు పార్టీలు.. ఇటు నేత‌లు కూడా ఈ అడ్వాంటేజ్‌ను వాడుకుం టున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ పంథానే Janasena JD lakshmi narayana{#}Vishakapatnam;CBI;Tsunami;Service;central government;రాజీనామా;YCPజ‌న‌సేన‌లోకి జేడీ.. మ‌ళ్లీ ఓల్డ్ సీన్ రిపీట్ అవుతుందా...?జ‌న‌సేన‌లోకి జేడీ.. మ‌ళ్లీ ఓల్డ్ సీన్ రిపీట్ అవుతుందా...?Janasena JD lakshmi narayana{#}Vishakapatnam;CBI;Tsunami;Service;central government;రాజీనామా;YCPSun, 31 Oct 2021 10:50:00 GMTరాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌ని అంటారు. ఎప్పుడు ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా.. అవ‌కాశం ద‌క్కి నా.. రాజ‌కీయాలు మారుతుంటాయి. దీనికి ఎవ‌రూ అతీతులు కారు. ఒక‌ప్పుడు అంటే.. పార్టీల ప‌రంగా వ్య‌క్తుల ఇమేజ్ ఆధార ప‌డి ఉండేది క‌నుక‌.. నాయ‌కులు పార్టీల‌కు ప్రాధాన్యం ఇచ్చేవారు.కానీ, ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి పోయి.. వ్య‌క్తుల ఇమేజ్‌పైనే పార్టీలు ఆధార‌ప‌డుతున్న ప‌రిస్థితి ఉంది. సో.. అటు పార్టీలు.. ఇటు నేత‌లు కూడా ఈ అడ్వాంటేజ్‌ను వాడుకుం టున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ పంథానే అనుస‌రించ‌నున్నారు.. సీబీఐ మాజీ జేడీ.. వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, పార్టీలో ప‌ట్టువిడుపులు ప్ర‌ద‌ర్శించే జ‌న‌సేన కూడా.. ఇలాంటి వారికి ఆహ్వానం ప‌లుకుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

గ‌తంలో సీబీఐ జాయింట్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి.. వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌.. త‌ర్వాత కాలంలో.. రాజ‌కీయంగా వ‌చ్చి ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని అనుకున్నారు. నిజ‌మే.. సీనియ‌ర్ ప్ర‌భుత్వ అధికారి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప‌ట్టున్న నాయ‌కుడు.. మంచి విశ్లేష‌కులు క‌నుక‌.. ఇలాంటివారికి అవ‌కాశం ఇవ్వ‌డం.. స‌హ‌జం. ఇక‌, ప్ర‌జ‌లు కూడా ఇలాంటి వారిని క‌నీసం జిల్లాకు ఒక్క‌ళ్ల‌నైనా గెలిపించుకుంటే మంచిద‌నే భావ‌న వ్య‌క్త‌మైంది. ఈ క్ర‌మంలోనే జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌కు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. విశాఖ ప‌ట్నం పార్ల‌మెంటు స్థానాన్ని కేటాయించారు. ఆయ‌న కూడా దూకుడుగా ప్ర‌చారం చేసుకున్నారు. అయితే.. జ‌గ‌న్ సునామీ కావొచ్చు.. లేదా.. రూపాయి కూడా పంచ‌క‌పోవ‌డం అనే ప్ర‌చారం కావొచ్చు.. ఏదేమైనా.. వీవీ వోడిపోయారు.

అయిన‌ప్ప‌టికీ..తాను.. విశాఖ‌లోనే ఉంటాన‌ని.. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తాన‌ని.. గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని.. ఆయ‌న ఉద్ఘాటించారు. అన్న‌మాట ప్ర‌కారం.. ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌పై ఓడిపోయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న దృష్టి పెట్టారు. నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉన్నారు. అయితే.. ఇంత‌లోనే.. క‌రోనా రావ‌డంతో ఆయ‌న మ‌కాం మార్చుకున్నారు. ఇక‌, ఈ క్ర‌మంలో ప‌వ‌న్  కూడా తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోవ‌డంతో.. ఆయ‌న అలా చేయ‌డం మంచిది కాదు! అని పేర్కొంటూ.. జ‌న‌సేన‌కు వీవీ రాజీనామా చేశారు. దీంతో ఆయ‌న ఇటు వైసీపీ లేదా.. అటు బీజేపీలో చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆయ‌న ఏ పార్టీలోనూ చేర‌లేదు. స్వ‌తంత్రంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటం ప్రారంభించారు. అంటే.. ఇమేజ్ పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించారు.

ఈ క్ర‌మంలోనే  విశాఖ ప‌ట్నం ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ.. హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు. దీంతో కేంద్రం త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితిలో వివ‌ర‌ణ ఇచ్చింది. ఇది విశాఖ‌లో వీవీకి ఇమేజ్ పెంచింది. దీంతో ఆయ‌న‌కు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు స‌హా.. మేధావులు కూడా అండ‌గా నిలుస్తున్నారు. ఈ ప‌రిణామాలు ఇలా.. ఉంటే.. ప‌వ‌న్ నేతృత్వంలో విశాఖ ఉద్యోగుల‌కు మ‌ద్ద‌తుగా.. ఈ నెల 31న  గాజువాకలో పెద్ద ఎత్తున బ‌హిరంగ స‌భ  నిర్వ‌హించ‌నున్నారు. దీనికి జేడీ మ‌ద్ద‌తివ్వ‌డం.. ప‌వ‌న్‌ను ఆకాశానికి ఎత్తేయ‌డం వంటివి ఆస‌క్తిగా మారాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్ పెంచుకున్న నేప‌థ్యంలో జ‌న‌సేన‌లోకి వెళ్తార‌నే ప్రచారం జ‌రుగుతోంది. ఇక‌, ఎవ‌రు వ‌చ్చినా.. చేర్చుకునేందుకు రెడీగా ఉన్న ప‌వ‌న్‌.. జేడీ వంటి నాయ‌కుడిని వ‌దులు కోరు క‌దా!! సో.. మొత్తానికి.. జేడీ చేర‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.

 



పెట్రోల్ పై.. కేంద్ర లెక్కలు..!

ఓటింగ్ అయ్యింది.. ఎగ్జిట్ ఏమంటుందో..!

కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ షాను డిసైడ్ చేసేది ఆ ఒక్క‌టే..!

ఆమె మరణం ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీ నే

ఆ కోరిక తీరకుండానే స్వర్గసీమ కు చేరిన పునీత్!!

రామ్ చరణ్ తో గొడవలపై స్పందించిన ప్రముఖ నిర్మాత..!!

కేసీఆర్ Vs ఈటెల : గెల్లు శీను సింపుల్ గా ఉన్నాడే!

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..!

బ‌ద్వేలు : ఆడికి సెప్పు దొంగ ఓట్లు ఎయ్యొద్ద‌ని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>