PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/amaravathi-tdpdb724c70-1653-4b6b-8f4a-30d1b6aeaefa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/amaravathi-tdpdb724c70-1653-4b6b-8f4a-30d1b6aeaefa-415x250-IndiaHerald.jpgఎన్నో స‌మున్న‌త ల‌క్ష్యాల‌తో పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ ధామంగా మారుతుంద‌నే ఆశ‌యంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు అమ‌రావ‌తి రాజ‌ధానికి శంకుస్థాప‌న చేశారు. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం స‌రిగా స్పందించ‌ని నేప‌థ్యంలో ఇక్క‌డ నిర్మాణాలు అనుకున్న విధంగా ముందుకు సాగ‌లేదు. దీంతో తాత్కాలిక నిర్మాణాలు మాత్రం సాగాయి. వీటిలోనూ ఎమ్మెల్యే, ఐఏఎస్‌, ఐపీఎస్‌ల క్వార్ట‌ర్లు మాత్రం రూపు దిద్దుకున్నాయి. దీనిని పూర్తి చేసేందుకు చంద్ర‌బాబు శ్ర‌మించారు. ఇంత‌లోనే ఎన్నిక‌లు వ‌చ్చాయి. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఇక‌, అప్ప‌టి నుంచి amaravathi tdp{#}Amaravathi;gold;Chittoor;Guntur;central government;YCP;MP;TDP;Minister;Partyటీడీపీ పేరు లేకుండానే.. అమ‌రావ‌తి పాద‌యాత్ర.. వ్యూహ‌మేనా...?టీడీపీ పేరు లేకుండానే.. అమ‌రావ‌తి పాద‌యాత్ర.. వ్యూహ‌మేనా...?amaravathi tdp{#}Amaravathi;gold;Chittoor;Guntur;central government;YCP;MP;TDP;Minister;PartySun, 31 Oct 2021 16:50:00 GMTఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌నే ప్ర‌ధాన డిమాండ్‌తో ఇక్క‌డి రైతులు చేస్తున్న ఉద్య‌మం రెండేళ్ల‌కు చేరువ అవుతోంది. ఎన్నో స‌మున్న‌త ల‌క్ష్యాల‌తో పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ ధామంగా మారుతుంద‌నే ఆశ‌యంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు అమ‌రావ‌తి రాజ‌ధానికి శంకుస్థాప‌న చేశారు. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం స‌రిగా స్పందించ‌ని నేప‌థ్యంలో ఇక్క‌డ నిర్మాణాలు అనుకున్న విధంగా ముందుకు సాగ‌లేదు. దీంతో తాత్కాలిక నిర్మాణాలు మాత్రం సాగాయి. వీటిలోనూ ఎమ్మెల్యే, ఐఏఎస్‌, ఐపీఎస్‌ల క్వార్ట‌ర్లు మాత్రం రూపు దిద్దుకున్నాయి. దీనిని పూర్తి చేసేందుకు చంద్ర‌బాబు శ్ర‌మించారు. ఇంత‌లోనే ఎన్నిక‌లు వ‌చ్చాయి. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఇక‌, అప్ప‌టి నుంచి ఒక్క ప‌నికూడా ఇక్క‌డ జ‌ర‌గ‌లేదు.

పైగా.. మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తీసుకురావ‌డంతో ఇక్క‌డ భూములు ఇచ్చిన రైతులు ఉద్య‌మానికి దిగారు. ఇప్ప‌టికి రెండేల్లుగా వారు ఉద్య‌మం చేస్తున్నారు. అయితే.. దీని వెనుక పూర్తిగా.. టీడీపీ నేత‌లే ముందుండి న‌డిపించార‌నే వాద‌న ఉంది. గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ స‌హా.. టీడీపీ నాయ‌కులు కూడా త‌ర‌చుగా ఇక్క‌డ ప‌ర్య‌టించి.. రైతుల‌కు అండ‌గా ఉన్నారు. ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్‌లు కూడా ఇక్క‌డ ప‌ర్య‌టించి.. ప్ర‌భుత్వంపై దుమ్మెత్తి పోశారు. అదేస‌మ‌యంలో న్యాయ పోరాటానికి కూడా దిగారు. రైతుల్లో ధైర్యం చెప్పారు. ఏకంగా చంద్ర‌బాబు స‌తీమ‌ణి.. భువ‌నేశ్వ‌రి.. రైతులు చేస్తున్న ఉద్య‌మానికి ఆర్థిక సాయంగా.. త‌న చేతుల‌కు ఉన్న బంగారు గాజుల‌ను తీసి ఇచ్చారు.

ఇలా సాగిన ఉద్య‌మం.. ఇప్పుడు మ‌హాపాద‌యాత్ర‌కు రెడీ అయింది. సోమ‌వారం నుంచి(న‌వంబ‌రు 1) 45 రోజుల పాటు ఈ పాద‌యాత్ర నిర్వ‌హించేందుకు రైతులు, జేసేసీ నాయ‌కులు.. ద‌ళిత సామాజిక వ‌ర్గాలు కూడా రెడీ అయ్యాయి. భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ప్ర‌బుత్వం నుంచి అనుమ‌తులు రాక‌పోయినా.. హైకోర్టుకు వెళ్లి.. అనుమ‌తులు తెచ్చుకున్నారు. మొత్తంగా గుంటూరు, ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సాగే ఈ పాద‌యాత్ర ద్వారా రాష్ట్రాన్ని క‌దిలించాల‌నే సంక‌ల్పంతో ముందుకు సాగుతున్నారు. అయితే.. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ఎక్క‌డా టీడీపీ ప్ర‌స్తావ‌న‌ను తీసుకురాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇటు చంద్ర‌బాబ కానీ.. అటు నాయ‌కులు కానీ.. మ‌హాపాద‌యాత్ర‌పై ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు.

దీంతో పాద‌యాత్ర‌ను టీడీపీ విస్మ‌రించిందా?  లేక రైతులే ఈ యాత్ర‌ను ప‌క్క‌న పెట్టారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. మాజీ మంత్రి దేవినేని ఉమా మాత్రం తాము పాల్గొంటామ‌ని.. పాద‌యాత్ర‌ను విజ‌యం చేస్తామ‌ని.. ప్ర‌క‌టించారు. అయితే.. ఈ నిర్ణ‌యం చంద్ర‌బాబు తీసుకున్న‌దిగా కానీ, పార్టీ నిర్ణ‌యం అని కానీ,, ఆయ‌న వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఇత‌ర నాయ‌కులు.. మాజీ మంత్రులు న‌క్కా ఆనంద‌బాబు కానీ, ఆల‌పాటి రాజాకానీ, ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌కానీ.. ఈ పాద‌యాత్ర‌పై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. సో.. దీనిని బ‌ట్టి దీనిని రైతుల‌కే వ‌దిలేశారా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మరిటీడీపీ నేత‌ల వ్యూహం ఏంటి?  తెర‌వెనుక ఉండి.. ఆర్థికంగా సాయం చేసేందుకు మాత్ర‌మే ప‌రిమితం అవుతారా?  అనేది చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఏం జ‌రుగుతుందో చూడాలి.

 



COVID-19 : 12,830 కొత్త కేసులను నమోదు చేసిన ఇండియా..

ఓటింగ్ అయ్యింది.. ఎగ్జిట్ ఏమంటుందో..!

కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ షాను డిసైడ్ చేసేది ఆ ఒక్క‌టే..!

ఆమె మరణం ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీ నే

ఆ కోరిక తీరకుండానే స్వర్గసీమ కు చేరిన పునీత్!!

రామ్ చరణ్ తో గొడవలపై స్పందించిన ప్రముఖ నిర్మాత..!!

కేసీఆర్ Vs ఈటెల : గెల్లు శీను సింపుల్ గా ఉన్నాడే!

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..!

బ‌ద్వేలు : ఆడికి సెప్పు దొంగ ఓట్లు ఎయ్యొద్ద‌ని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>