PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huzurabadb378337a-583c-482e-a4d1-4c81e5dff052-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huzurabadb378337a-583c-482e-a4d1-4c81e5dff052-415x250-IndiaHerald.jpgహుజూరాబాద్‌లో పోలింగ్ ముగిసింది. ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరిన తీరు చూస్తే.. ఏదో ఆసక్తికర ఫలితమే వెలువడేలా కనిపిస్తోంది. పోలింగ్ జరిగిన తర్వాత గెలుపు ఈటల వైపే మొగ్గు ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలూ అదే చెబుతున్నాయి. ఒక వేళ హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే ఏం జరుగుతుంది..? ఈటల గెలుపులో తెలంగాణలో మారే పొలిటికల్ సీన్ ఏంటి.. అన్నది ఆసక్తికరంగా మారింది. ఎగ్జిట్‌పోల్ సర్వేలు నిజమై.. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే.. అది బీజేపీకు మంచి ఊపు ఇస్తుంది.huzurabad{#}lotus;Chitram;Nijam;Government;Eatala Rajendar;Assembly;KCR;November;Telangana Rashtra Samithi TRS;Telangana;Cinemaకేసీఆర్ vs ఈటల: ఈటల గెలిస్తే జరిగేది ఇదేనా..?కేసీఆర్ vs ఈటల: ఈటల గెలిస్తే జరిగేది ఇదేనా..?huzurabad{#}lotus;Chitram;Nijam;Government;Eatala Rajendar;Assembly;KCR;November;Telangana Rashtra Samithi TRS;Telangana;CinemaSun, 31 Oct 2021 09:00:00 GMTహుజూరాబాద్‌లో పోలింగ్ ముగిసింది. ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరిన తీరు చూస్తే.. ఏదో ఆసక్తికర ఫలితమే వెలువడేలా కనిపిస్తోంది. పోలింగ్ జరిగిన తర్వాత గెలుపు ఈటల వైపే మొగ్గు ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలూ అదే చెబుతున్నాయి. ఒక వేళ హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే ఏం జరుగుతుంది..? ఈటల గెలుపులో తెలంగాణలో మారే పొలిటికల్ సీన్ ఏంటి.. అన్నది ఆసక్తికరంగా మారింది.


ఎగ్జిట్‌పోల్ సర్వేలు నిజమై.. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే.. అది బీజేపీకు మంచి ఊపు ఇస్తుంది.. ఈటల రాజేందర్‌కు బీజేపీలో మంచి గుర్తింపు వస్తుంది. అంత వరకూ ఓకే.. అదే సమయంలో టీఆర్ఎస్‌లోని అసంతృప్త శక్తులకు కాస్త బలం చేకూరుతుంది. ఇన్నాళ్లూ టీఆర్ఎస్‌లోనే ఉంటూ అసంతృప్తిగా ఉన్నవారు.. ప్రత్యామ్నాయం లేదని పార్టీలోనే ఉండిపోయిన వారు.. పక్కదారులు చూసే అవకాశం ఉంటుంది. గట్టిగా మరో రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్ల ఇది కేసీఆర్‌కు నెగిటివ్ సెంటిమెంట్‌గా మారుతుంది.


హుజూరాబాద్‌లో విజయం కోసం టీఆర్ఎస్ చేయని ప్రయత్నం లేదు. కోట్లు కుమ్మరించినా.. ట్రబూల్ షూటర్‌ను మోహరించినా.. దళిత బంధు వంటి పథకాలు ప్రకటించినా.. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలవకపోతే.. అది కచ్చితంగా టీఆర్ఎస్ పట్ల జనంలో గూడుకట్టుకున్న అసంతృప్తికి సూచనగా చెప్పుకోవచ్చు. నవంబర్ 2 తరువాత యావత్ తెలంగాణలో రాజకీయంగా పెను మార్పులు వస్తాయని ఇప్పటికే ఈటల రాజేందర్ చెబుతున్నారు. హుజూరాబాద్‌లో ఆయన కమలం జెండా ఎగరేస్తే నిజంగానే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతుందా.. కేసీఆర్ ఫీజు పీకాలని ప్రజలు డిసైడ్ అయ్యారంటున్న ఈటల మాటలు నిజం కాబోతున్నాయా.. అన్నది ఆలోచించాల్సిన విషయమే.


మరో విషయం ఏంటంటే.. వచ్చే ఎన్నికల సంగతి ఎలా ఉన్నా.. ముందుగా ఈటల రాజేందర్‌ గెలిస్తే.. ఆయన్ను ఎన్నుకున్నందుకు ప్రభుత్వం హుజూరాబాద్‌ జనంపై వివక్ష చూపే ప్రమాదం కూడా ఉందన్న వాదన వినిపిస్తోంది. దళిత బంధు అటకెక్కిస్తారని.. ఆ ప్రాంతంలో సర్కారు పథకాల అమలు సరిగ్గా ఉండకపోవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు.





బై పోల్ సీన్ : అక్క‌డ స‌క్సెస్ ఇక్క‌డ ఫెయిల్ ?

ఓటింగ్ అయ్యింది.. ఎగ్జిట్ ఏమంటుందో..!

కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ షాను డిసైడ్ చేసేది ఆ ఒక్క‌టే..!

ఆమె మరణం ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీ నే

ఆ కోరిక తీరకుండానే స్వర్గసీమ కు చేరిన పునీత్!!

రామ్ చరణ్ తో గొడవలపై స్పందించిన ప్రముఖ నిర్మాత..!!

కేసీఆర్ Vs ఈటెల : గెల్లు శీను సింపుల్ గా ఉన్నాడే!

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..!

బ‌ద్వేలు : ఆడికి సెప్పు దొంగ ఓట్లు ఎయ్యొద్ద‌ని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>