MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/-is-shah-rukhs-career-damaged-by-his-sons-injuryd99c304c-c877-4e92-ad48-429d21915b3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/-is-shah-rukhs-career-damaged-by-his-sons-injuryd99c304c-c877-4e92-ad48-429d21915b3c-415x250-IndiaHerald.jpgఆర్యన్ ఖాన్ మాదకద్రవ్యాల కేసు షారుఖ్ ఖాన్‌ ను ఇరుకుల్లో పడేసిందా..? ఆయన కెరియర్ కు ప్రమాదం పొంచి ఉందా..? పరిస్తితులు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నాయి. కొడుకు చేసిన పనికి బాద్‌షాపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌తో పాటు, షారుఖ్‌ నటించిన బ్రాండ్ ప్రొడక్టక్ట్స్‌ని కూడా బాయ్‌కాట్‌ చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. దీంతో షారుఖ్‌ కెరీర్‌పై రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. Is Shah Rukhs career damaged by his sons injury{#}aryan;Baadshah;Arrest;Industry;Hero;Diwali;Cinemaకొడుకు దెబ్బకు షారుఖ్ కెరీర్ డ్యామేజ్ అయినట్టేనా..?కొడుకు దెబ్బకు షారుఖ్ కెరీర్ డ్యామేజ్ అయినట్టేనా..?Is Shah Rukhs career damaged by his sons injury{#}aryan;Baadshah;Arrest;Industry;Hero;Diwali;CinemaSun, 31 Oct 2021 12:00:00 GMTఆర్యన్ ఖాన్ డ్రగ్స్‌ కేసులో జైలుకెళ్లినప్పటి నుంచి నెటిజన్లు షారుఖ్‌ ఖాన్‌ని నేరస్థుడిలా చూస్తున్నారు. పిల్లలని సరిగా పెంచలేకపోయాడని, అవసరానికి మించి డబ్బులు ఇచ్చి కొడుకుని పాడు చేశాడని ట్రోల్‌ చేస్తున్నారు. అయితే ఇప్పుడీ విమర్శలు మరింత పెరిగాయి. ఇండస్ట్రీ నుంచి షారుక్‌ని బాయ్‌కాట్‌ చేయాలని చెప్పేంత వరకు వచ్చేసింది. షారుఖ్‌ ఖాన్‌ రీసెంట్‌గా ఒక చాక్లెట్‌ యాడ్‌లో నటించాడు. దీపావళి పండగకి లోకల్‌ వెండర్స్‌ దగ్గరి నుంచే బట్టలు, యాక్సెసరీస్‌ కొనాలని చెబుతూ జనరల్‌ స్టోర్స్‌లో కూడా దొరికే ఈ చాక్లెట్‌తో నోరు తీపి చేసుకోండని చెప్పాడు. ఇక ఈ యాడ్‌ బయటకి రావడం ఆలస్యం షారుక్‌ ప్రమోట్‌ చేస్తోన్న చాక్లెట్‌ కంపెనీని బాయ్‌కాట్ చేయాలని హడావిడి చేస్తున్నారు నెటిజన్లు.

షారుక్ ఖాన్‌ కొడుకు డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న హీరో సినిమాలని కూడా చూడొద్దంటూ  కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో షారుక్ ఖాన్‌ కెరీర్‌పై నెగటివ్‌ ప్రభావం పడుతుందనీ, కొన్నాళ్లపాటు బాద్‌షా సినిమాలకి సరైన బిజినెస్‌ జరగడం కూడా కష్టమనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. షారుక్ ఖాన్‌ ఈ ఏడాది ఆర్యన్‌ ఖాన్‌ని హీరోగా లాంచ్‌ చేస్తాడనే ప్రచారం జరిగింది. షారుక్ ఫీచర్స్‌తో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌తో లవ్‌స్టోరీస్‌ తీసేందుకు కరణ్‌ జోహార్‌ లాంటి దర్శకనిర్మాతలు కథలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే డ్రగ్స్‌ కేసుతో ఆర్యన్‌ అరెస్ట్ అయ్యాడు. సోషల్‌ మీడియాలో ఆర్యన్‌ని తెగ ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఆర్యన్ ఖాన్‌ సినిమా కెరీర్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

షారుక్ ఖాన్‌ కెరీర్‌ కూడా ఇబ్బందుల్లోనే ఉంది. 'చెన్నై ఎక్స్‌ప్రెస్' తర్వాత షారుక్‌కి సరైన హిట్‌లేదు. ఎనిమిదేళ్లుగా వీడని ఫ్లాపులతో డేంజర్‌ జోన్‌కి దగ్గరయ్యాడు. ఇక 'జీరో' సినిమా అయితే షారుక్‌ని మరింత గట్టి దెబ్బకొట్టింది. షారుక్‌ సొంత బ్యానర్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర డిజాస్టర్‌ అయ్యింది. దీంతో మరో సినిమా చేసేందుకు రెండేళ్లకి పైగా గ్యాప్ తీసుకున్నాడు షారుఖ్.








ప‌వ‌న్ రాజ‌కీయ వ్యూహంలో విశాఖ ఉద్యమం..!

ఓటింగ్ అయ్యింది.. ఎగ్జిట్ ఏమంటుందో..!

కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ షాను డిసైడ్ చేసేది ఆ ఒక్క‌టే..!

ఆమె మరణం ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీ నే

ఆ కోరిక తీరకుండానే స్వర్గసీమ కు చేరిన పునీత్!!

రామ్ చరణ్ తో గొడవలపై స్పందించిన ప్రముఖ నిర్మాత..!!

కేసీఆర్ Vs ఈటెల : గెల్లు శీను సింపుల్ గా ఉన్నాడే!

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..!

బ‌ద్వేలు : ఆడికి సెప్పు దొంగ ఓట్లు ఎయ్యొద్ద‌ని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>