PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-announced-one-crore-to-3a0dd6db-56ce-4782-90b9-9e3de476dd83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-announced-one-crore-to-3a0dd6db-56ce-4782-90b9-9e3de476dd83-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో అనూహ్య పొత్తుకు తెర‌దీసిన బీజేపీ-జ‌న‌సేన‌ల బంధం ఎన్నాళ్లు ఉంటుంది? ఎన్నాళ్లు నిలుస్తుంది? అనే చ‌ర్చ కొన్నా ళ్లుగా జ‌రుగుతోంది. అయితే.. దీనిపై అటు బీజేపీకానీ.. ఇటు జ‌న‌సేన కానీ.. స్పందించ‌డం లేదు. అదేస‌మ‌యంలో.. ఎవ‌రూ ఈ వ్యాఖ్య‌ల‌ను ఖండించ‌డం లేదు. కానీ.. రాజ‌కీయంగా మాత్రం వీరి పొత్తుపై ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ సాగుతూనే ఉంది. తాజాగా పార్టీ అధికార ప్ర‌తినిధి.. శివ‌శంక‌ర్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌లనంగా మారాయి. ఈ రెండు పార్టీల వ్యూహాలు వేర‌ని.. ఆయ‌న చెప్పారు. కేవ‌లం త‌మ పార్టీల మ‌ధ్య ఉన్న బంధం `Pawan Kalyan{#}Vishakapatnam;Bharatiya Janata Party;Partyప‌వ‌న్ మ‌ళ్లీ పెటాకుల‌కు రెడీ అవుతున్నాడా...!ప‌వ‌న్ మ‌ళ్లీ పెటాకుల‌కు రెడీ అవుతున్నాడా...!Pawan Kalyan{#}Vishakapatnam;Bharatiya Janata Party;PartySun, 31 Oct 2021 10:50:00 GMTరాష్ట్రంలో అనూహ్య పొత్తుకు తెర‌దీసిన బీజేపీ-జ‌న‌సేన‌ల బంధం ఎన్నాళ్లు ఉంటుంది? ఎన్నాళ్లు నిలుస్తుంది? అనే చ‌ర్చ కొన్నా ళ్లుగా జ‌రుగుతోంది. అయితే.. దీనిపై అటు బీజేపీకానీ.. ఇటు జ‌న‌సేన కానీ.. స్పందించ‌డం లేదు. అదేస‌మ‌యంలో.. ఎవ‌రూ ఈ వ్యాఖ్య‌ల‌ను ఖండించ‌డం లేదు. కానీ.. రాజ‌కీయంగా మాత్రం వీరి పొత్తుపై ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ సాగుతూనే ఉంది. తాజాగా పార్టీ అధికార ప్ర‌తినిధి.. శివ‌శంక‌ర్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌లనంగా మారాయి. ఈ రెండు పార్టీల వ్యూహాలు వేర‌ని.. ఆయ‌న చెప్పారు. కేవ‌లం త‌మ పార్టీల మ‌ధ్య ఉన్న బంధం `తాత్కాలిక‌`మేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. రెండు పార్టీల‌కూ.. కామ‌న్ అజెండా.. వ్యూహా లు వంటివి ఏమీ లేవ‌ని స్ప‌ష్టం చేశారు.

``బీజేపీకి మేం గుడ్డిగా మ‌ద్ద‌తు తెలుపుతామ‌ని.. ఆపార్టీ నేత‌లు.. భావించొద్దు. వారు చేసే ప‌నుల‌పై మేం ఏదో చ‌ర్చ‌లు జ‌రుపు తామ‌ని వారు భావించాల్సిన అవ‌స‌రం లేదు`` అని తేల్చి చెప్పారు.  త‌మ రెండు పార్టీల మ‌ద్య పొత్తు కేవ‌లం ఎన్నిక‌ల వ్యూహం తోనే జ‌రిగింద‌ని శివ‌శంక‌ర్ స్ప‌ష్టం చేశారు. ``బీజేపీ, జ‌న‌సేన‌ల‌కు సొంత అజెండాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యూహాలు ఉన్నా యి. అనుచ‌రులు.. కూడా ఉన్నారు`` అని తెలిపారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీక‌రిస్తామ‌న్న‌.. బీజేపీ విధానాల‌కు జ‌న‌సేన ఎట్టి ప‌రిస్థితిలోనూ మ‌ద్ద‌తు తెల‌ప‌ద‌ని ఆయ‌న తెలిపారు. ఇప్పుడు ఈ విష‌యాలు రాజకీయంగా ప్రాధాన్యం.. సంత‌రించుకున్నా యి.

మ‌రోవైపు జ‌న‌సేన‌లోనూ అంత‌ర్గ‌తంగా బీజేపీపై.. అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ బీజేపీతో వ‌ద్ద‌నే వాద‌న బ‌య లుదేరుతోంది. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో జ‌రిగిన ప‌రాభ‌వం నుంచి కూడా ఇదే వాద‌న‌ను వారు వినిపిస్తున్నారు. అంతేకాదు.. బీజేపీతో ఉంటే.. జ‌న‌సేన‌కు క‌లిసి వ‌చ్చేది లేద‌ని కూడా చెబుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా.. విశాఖ‌లో నిర్వ‌హించ‌నున్న విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా భారీ స‌భ‌.. జ‌న‌సేన‌ను మ‌రింత‌గా బీజేపీకి దూరం చేసింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే రాష్ట్ర బీజేపీ నాయ‌కులు కేంద్రానికి చేర‌వేశార‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో జ‌న‌సేన‌లోనూ ఇదే చ‌ర్చ సాగుతోంది.

బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీ.. బీజేపీ స‌మ‌ర్ధిస్తున్న విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ‌ను ఎలా వ్య‌తిరేకిస్తుంద‌నే చ‌ర్చ సాగుతోంది. దీంతో ఈ రోజు జ‌ర‌గ‌నున్న స‌భ‌లో ప‌వ‌న్ ఈ పొత్తుపై క్లారిటీ ఇస్తార‌నే వాద‌న కూడా తెర‌మీదికి వ‌చ్చింది. లేక‌పోతే.. బీజేపీతో ఉంటూ.. బీజేపీ అనుకూలంగా వ్య‌వ‌హ‌రించాల్సిన పార్టీ.. బీజేపీ వ్య‌తిరేకంగా.. ఇలా స‌భ‌లు నిర్వ‌హించ‌డం.. రేపు వివాదంగా మారుతుంద‌ని చెబుతున్నారు. సో.. మొత్తంగా చూస్తే.. ప‌వ‌న్‌-బీజేపీల బందం ఇక ముగిసిన‌ట్టేననే వాద‌నకు ఈ స‌భ బ‌లం చేకూరుస్తున్న‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 



పెట్రోల్ పై.. కేంద్ర లెక్కలు..!

ఓటింగ్ అయ్యింది.. ఎగ్జిట్ ఏమంటుందో..!

కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ షాను డిసైడ్ చేసేది ఆ ఒక్క‌టే..!

ఆమె మరణం ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీ నే

ఆ కోరిక తీరకుండానే స్వర్గసీమ కు చేరిన పునీత్!!

రామ్ చరణ్ తో గొడవలపై స్పందించిన ప్రముఖ నిర్మాత..!!

కేసీఆర్ Vs ఈటెల : గెల్లు శీను సింపుల్ గా ఉన్నాడే!

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా..!

బ‌ద్వేలు : ఆడికి సెప్పు దొంగ ఓట్లు ఎయ్యొద్ద‌ని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>