PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan189d06f7-bc78-4f59-9ff1-c26c358633d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan189d06f7-bc78-4f59-9ff1-c26c358633d1-415x250-IndiaHerald.jpgవైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించి అధికారులను పలు వివరాలు అడిగారు. డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాల ప్రగతిపై సీఎంకు వివరాలందించిన అధికారులు... రాష్ట్రంలో 12,979 పంచాయతీల్లో వైఎస్‌ఆర్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలు నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. మూడు దశల్లో విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం జరుగుతుంది అని సిఎంకు తెలిపారు. తొలివిడతలో చేపడుతున్న 4530 విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణపనుల ప్రగతిపై సీఎంకు వివరాలందించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... పjagan{#}East Godavari;January;CM;Jaganఉగాదికి రెడీ అవ్వాల్సిందే: జగన్ డెడ్ లైన్ఉగాదికి రెడీ అవ్వాల్సిందే: జగన్ డెడ్ లైన్jagan{#}East Godavari;January;CM;JaganFri, 29 Oct 2021 16:32:44 GMTవైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించి అధికారులను పలు వివరాలు అడిగారు. డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాల ప్రగతిపై సీఎంకు వివరాలందించిన అధికారులు... రాష్ట్రంలో 12,979 పంచాయతీల్లో వైఎస్‌ఆర్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలు నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. మూడు దశల్లో విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం జరుగుతుంది అని సిఎంకు తెలిపారు. తొలివిడతలో చేపడుతున్న 4530 విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణపనుల ప్రగతిపై సీఎంకు వివరాలందించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... ప్రతి విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీకి అంతరాయంలేని బ్యాండ్‌విడ్త్‌తో ఇంటర్నెట్‌ను ఇవ్వాలన్న సీఎం... తాజాగా వస్తున్న టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలలో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని కోరారు. ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసారు. వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌లో భాగంగా గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలి  అన్నారు సిఎం జగన్.

పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఉపయోగపడాలి అని ఆయన కోరారు. విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలను సక్రమంగా నిర్వహించాలని సిఎం అన్నారు. వీటి నిర్వహణపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని అధికారులను ఆదేశించారు. జనవరి నాటికి తొలిదశలో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. అదే సమయంలో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లతో పాటు ఇతర  మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారించాలని స్పష్టం చేసారు. ప్రతి డిజిటల్‌ లైబ్రరీలో డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, సిస్టం ఛైర్లు, ప్లాస్టిక్‌ ఛైర్లు, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, ఐరన్‌ రాక్స్, పుస్తకాలు, మేగజైన్‌ల ఏర్పాటు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఉగాదినాటికి ఫేజ్‌ 1లో కంప్యూటర్‌ పరికరాలతో సహా అందుబాటులోకి మొదటి దశ డిజిటల్‌ లైబ్రరీలు రావాలని అన్నారు.  డిసెంబరు 2022 నాటికి ఫేజ్‌ 2  పూర్తిచేసేలా కార్యాచరణ చేయాలని సిఎం ఆదేశించారు. జూన్‌ 2023 నాటికి మూడో దశ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణ లక్ష్యంగా నిరేశించుకోవాలని సూచించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో అన్‌ఇంటరెప్టడ్‌ బ్యాండ్‌విడ్త్‌తో కూడిన ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తుందని అన్నారు.



పునీత్ రాజ్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?

బ్రేకింగ్: పునీత్ మరణం పై పవన్ ఏమన్నారు...?

పునీత్ మరణం చంద్రబాబు, లోకేష్ ఏమన్నారు...?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి కి సంతాపం ప్రకటించిన హీరోయిన్స్..!!

ఫేస్‌బుక్ మొదటి స్మార్ట్‌వాచ్‌... ఆపిల్ తో పోటీ

శోకసంద్రంలో కర్ణాటక...!

వైరల్:బాలయ్యతో పునీత్ ఇంత క్లోజ్ గా ఉంటాడా...?

నాకు ఇది పెద్ద షాక్ గా ఉంది: నితిన్

చంద్రబాబుని నమ్మకస్తులు పక్కన పెట్టారా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>