QuotesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/manchimaataf7cdf69b-f5b2-4579-9a1d-7bd9c000cac9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/manchimaataf7cdf69b-f5b2-4579-9a1d-7bd9c000cac9-415x250-IndiaHerald.jpgఅనగనగా అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తూ వుండేది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ కప్పకు ఒక హంస పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా కొద్ది రోజుల్లోనే ప్రాణ మిత్రులు అయ్యేలా చేసింది. ఎప్పటి లాగే ఒక రోజు కప్ప కొలనులో వున్న తామర ఆకుపైన తేలుతూ వుండగా..హంస ఒడ్డున నిలబడి ..రెండూ చక్కగా మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎటు నుంచి వచ్చాడో తెలియదు కానీ ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిలలాడింది. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడా... దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. ఈ హంసను MANCHIMAATAమంచిమాట: ఆశ కంటే అతి ప్రమాదకరమైనది అత్యాశ..!!మంచిమాట: ఆశ కంటే అతి ప్రమాదకరమైనది అత్యాశ..!!MANCHIMAATAFri, 29 Oct 2021 14:01:24 GMTఅనగనగా అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తూ వుండేది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ కప్పకు ఒక హంస పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా కొద్ది రోజుల్లోనే ప్రాణ మిత్రులు అయ్యేలా చేసింది. ఎప్పటి లాగే ఒక రోజు కప్ప కొలనులో వున్న తామర ఆకుపైన తేలుతూ వుండగా..హంస ఒడ్డున నిలబడి ..రెండూ చక్కగా మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎటు నుంచి వచ్చాడో తెలియదు కానీ ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిలలాడింది. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడా... దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది.

ఈ హంసను కూడా అమ్మితే బోలెడు డబ్బు వస్తుంది. విడిచిపెట్టను అన్నాడు.. నీకు డబ్బు కావాలి అంతే కదా! ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంత సేపాగి ముత్యంతో పైకొచ్చింది. దీన్ని తీసుకొని నా స్నేహితురాలిని విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు. ఇంటికెళ్లాక భార్యకు జరిగిందంతా చెప్పాడు.అతను చెప్పినదంతా విన్న భార్య... ఆ కప్ప దగ్గర ఇంకెన్ని ముత్యాలు ఉండి ఉంటాయి. వెళ్లి అవన్నీ తెచ్చేయ్ అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్లి  ఏయ్... మర్యాదగా నీకొలనులో ఉన్న ముత్యాలన్ని నాకిచ్చెయ్. లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప... సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా... అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను. అని అడిగింది..


 దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది. పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది. నీకు మేం దొరకం అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావ్. అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు.



కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.. కారణం..!

బిగ్ బ్రేకింగ్: కన్నడ స్టార్ హీరో కి గుండెపోటు, పరిస్థితి విషమం

నిర్మాతగా మారుతున్న ఏపీ ఎంఎల్ఏ...?

బిగ్ బాస్ 5: శ్రీరామ్ ఈ తప్పులు చేయకుంటే టైటిల్ విన్నర్?

డ్యుయల్ రోల్ లో వచ్చిన ఉత్తమ తెలుగు చిత్రాలు..!!

కేసీఆర్ Vs ఈటెల: ఎవ‌రి గెలుపు లెక్క‌లేంటి..!

ఐపీఎల్‌పై వార్న‌ర్ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం..!

మల్టీ స్టారర్ ప్లాన్ లో నాగ్-చిరు, నిర్మాత ఆయనే...?

అక్ర‌మ‌సంబంధానికి అడ్డుగా ఉంద‌ని భార్యపై దారుణం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>