PoliticsN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/facebook-changes-its-name-to-meta12a2f503-410a-4612-b03a-3ec76d82edee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/facebook-changes-its-name-to-meta12a2f503-410a-4612-b03a-3ec76d82edee-415x250-IndiaHerald.jpgవర్క్ ప్లేస్ కొలాబరేషన్ కోసం ఫేస్‌బుక్ ఇటీవల ‘హొరైజన్ వర్క్ రూమ్స్’ అనే కాన్సెప్టును పరిచయం చేసిన‌ట్టు, .. దీంతో ‘హోరైజన్’ అనే కొత్త పేరును ఖరారు చేశార‌ని వార్త‌లు వినిపించాయి. ఇది ఇలా ఉండ‌గా ఈ త‌రుణంలోనే గురువారం ఫేస్‌బుక్ వార్షిక సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఫేస్‌బుక్ పేరు మార్చుతున్న‌ట్టు సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ వెల్ల‌డించారు. ఫేస్‌బుక్‌తో పాటు కంపెనీకి చెందిన ఇత‌ర సామాజిక మాధ్య‌మాలు ఇన్‌స్టాగ్రామ్‌, మెసేంజ‌ర్‌, వాట్సాప్ వంటి వాటి పేర్ల‌లో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని కంపెనీ తెలిపింది#facebook new name meta{#}March;WhatsApp;media;thursdayమారిన 'ఫేస్‌బుక్'... "మెటా" పేరు ప్ర‌క‌టించిన జుక‌ర్‌బ‌ర్గ్మారిన 'ఫేస్‌బుక్'... "మెటా" పేరు ప్ర‌క‌టించిన జుక‌ర్‌బ‌ర్గ్#facebook new name meta{#}March;WhatsApp;media;thursdayFri, 29 Oct 2021 05:51:14 GMTప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు సోషల్ మీడియాను వాడుతున్నారు. అందులో ఒకటి అయినా  ఫేస్‌బుక్ లో చాలా మంది తమ అభిప్రాయాలను ఇతరులతో షేర్ చేసుకోవడానికి  ఉపయోగిస్తుంటారు. కొందరు దీని ద్వారా వ్యాపారాలు కూడా కొన‌సాగిస్తున్నారు.  ఇటీవల ఫేస్‌బుక్ సేవలు ఆరు గంటల పాటు  నిలిచిపోగా ప్రపంచమే  స్థంభించినంతగా మారిపోయింది. ఇంతలా ప్రజలతో అనుసంధానమైన ఫేస్‌బుక్ త్వరలో తన పేరును మార్చుకుంటోంది.  ఈ  ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కొత్త పేరును మార్చి 28న  ప్రకటిస్తారని  సోష‌ల్ మీడియాలో ప్రచారం జ‌రిగింది.

అయితే ఇప్పటికే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఆక్యులస్ వంటివి ఫేస్‌బుక్‌లో భాగంగానే ఉన్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్ తన కార్యకలాపాలను మరింత విస్తరించుకునే పనిలో పడిన‌ది. ప్రస్తుతం ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ) అద్దాల తయారీలో ఈ  సంస్థ బిజీగా ఉన్న‌ది. దీని కింద కొత్తగా రానున్న ఐదేళ్లలో యూరోపియన్ యూనియన్‌లో లో 10 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్న‌ది. స్మార్ట్ ఫోన్‌ల తరహాలోనే భవిష్యత్‌లో ఏఆర్ గ్లాసెస్ కూడా ప్రజల జీవితంలో  ఒక భాగమ‌వుతాయని ఫేస్‌బుక్ సంస్థ ఆశిస్తోంది.  మరోవైపు మెటావర్స్ ప్రాజెక్టు కోసం ఫేస్‌బుక్ 50 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టిన‌ట్టు వార్త‌లు కూడ వినిపించాయి.

వర్క్ ప్లేస్ కొలాబరేషన్ కోసం ఫేస్‌బుక్ ఇటీవల ‘హొరైజన్ వర్క్ రూమ్స్’ అనే కాన్సెప్టును పరిచయం చేసిన‌ట్టు, .. దీంతో ‘హోరైజన్’ అనే కొత్త పేరును ఖరారు  చేశార‌ని వార్త‌లు వినిపించాయి.  ఇది ఇలా ఉండ‌గా  ఈ త‌రుణంలోనే గురువారం  ఫేస్‌బుక్ వార్షిక సమావేశం జ‌రిగింది.   ఈ స‌మావేశంలో ఫేస్‌బుక్ పేరు మార్చుతున్న‌ట్టు సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ వెల్ల‌డించారు. ఫేస్‌బుక్‌తో పాటు కంపెనీకి చెందిన ఇత‌ర సామాజిక మాధ్య‌మాలు ఇన్‌స్టాగ్రామ్‌, మెసేంజ‌ర్‌, వాట్సాప్ వంటి వాటి  పేర్ల‌లో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని కంపెనీ తెలిపింది. ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీల‌కు మెటా మాతృసంస్థ‌గా ఉండ‌నున్న‌ద‌ని వెల్ల‌డించింది. ఫేస్‌బుక్ నూత‌న పేరు మెటా. త‌రువాత త‌రం సోష‌ల్ మీడియా మెటావ‌ర్స్‌ను మ‌న‌కు అందించేందుకు ఈ మెటా స‌హాయ‌ప‌డుతుంద‌ని ఫేస్‌బుక్ త‌న ట్వీట్‌లో పేర్కొన్న‌ది.  

గ‌త కొద్ది కాలంగా ఫేస్‌బుక్ వ్య‌క్తి గ‌త ప్ర‌యోజ‌నాల‌ను ల‌క్ష్యంగా చేసుకొని యూజ‌ర్ డేటాను ట్రాక్ చేస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ త‌రుణంలో అమెరికాతో స‌హా వివిధ దేశాల్లో ఫేస్‌బుక్ న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల‌ను ఎదుర్కొంటున్న‌ది. ఫేస్‌బుక్ పేరు త‌రుచుగా వార్త‌ల‌లో వినిపించ‌డం, యూజ‌ర్ల‌పై ప్ర‌భావం చూపిస్తోంద‌ని కంపెనీ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఫేస్‌బుక్‌కు చెందిన అన్నీ కంపెనీల‌ను ఒక కొత్త కంపెనీ కింద‌కు తీసుకురావాల‌నే నిర్ణ‌యించుకుంది. అందులోభాగంగా ఫేస్‌బుక్ పేరును మెటా గా మార్చుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల ఫేస్‌బుక్‌కు చెందిన మాజీ ఉద్యోగి డాక్యుమెంట్ల‌ను లీక్ చేయ‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అదేవిధంగా గ‌త కొన్ని రోజుల నుంచి జుక‌ర్‌బ‌ర్గ్ మెటావ‌ర్స్ టెక్నాల‌జీపై దృష్టి పెట్టారు. ఇప్ప‌టికే వేలాది మందిని ఇందుకోసం నియ‌మించుకున్నారు.



 






ఫేస్ బుక్ పేరు మారిపోయింది.. కొత్త నేమ్ ఇదే..!

ఆర్యన్ ఖాన్ కి బెయిల్ మంజూరు..

పెద్దన్న లో రజినీ విశ్వరూపమే!!

కేంద్రమంత్రి మాండవియా:భారత్ పర్యాటక కేంద్రం కానుందా..!

ఫ్యామిలీ మెన్ క్రేజ్ సమంత కు బాగానే యూజ్ అవుతుంది!!

కోహ్లీ మాటలతో నిరాశకు గురయ్యాను : జడేజా

ఇండస్ట్రీ లోకి కొత్త నీరు.. కుర్రాళ్ళు అదరగొడుతున్నారు!!

పట్టాభిని కొట్టారు: ఎంపీ సంచలన వ్యాఖ్యలు

తన పనికి క్షమాపణలు చెప్పిన డికాక్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>