MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna381d9e0f-1f65-454f-a339-1277c89e17be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna381d9e0f-1f65-454f-a339-1277c89e17be-415x250-IndiaHerald.jpgసినిమా హీరోలకు కూడా ఊరికే డబ్బులు ఇవ్వరు.... షూటింగ్ సమయంలో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఫైట్ సీన్ లు ఇతర ప్రమాదకర సన్నివేశాల్లో నటించేందుకు మాత్రం డూప్ లు ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో హీరోలే అలాంటి సన్నివేశాలు కూడా చేయాల్సి వస్తుంది. అలా ప్రమాదకర సన్నివేశాల్లో నటించి గాయపడిన నటీనటులు కూడా ఎంతోమంది ఉన్నారు. కొంతమంది నటీనటులు అయితే ఏకంగా చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాగా తాను కూడా అలాంటి సన్నివేశాలలో నటించానని టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారNagarjuna{#}Bigboss;Bike;Interview;Akkineni Nagarjuna;Chitram;Tollywood;Cinema;Naga Chaitanyaఅఖిల్, చైతూలు అలాంటి సీన్లలో నటిస్తే ఒప్పుకోను : నాగ్అఖిల్, చైతూలు అలాంటి సీన్లలో నటిస్తే ఒప్పుకోను : నాగ్Nagarjuna{#}Bigboss;Bike;Interview;Akkineni Nagarjuna;Chitram;Tollywood;Cinema;Naga ChaitanyaThu, 28 Oct 2021 15:36:00 GMTసినిమా హీరోలకు కూడా ఊరికే డబ్బులు ఇవ్వరు.... షూటింగ్ సమయంలో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఫైట్ సీన్ లు ఇతర ప్రమాదకర సన్నివేశాల్లో నటించేందుకు మాత్రం డూప్ లు ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో హీరోలే అలాంటి సన్నివేశాలు కూడా చేయాల్సి వస్తుంది. అలా ప్రమాదకర సన్నివేశాల్లో నటించి గాయపడిన నటీనటులు కూడా ఎంతోమంది ఉన్నారు. కొంతమంది నటీనటులు అయితే ఏకంగా చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాగా తాను కూడా అలాంటి సన్నివేశాలలో నటించానని టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.

నాగార్జున నటించిన నిన్నే పెళ్లాడతా అనే లవ్, కుటుంబ కథా చిత్రం టాలీవుడ్ లో ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో ప్రసారమైతే చాలామంది ప్రేక్షకులకు టీవీలకు అతుక్కుపోతారు. నిన్నే పెళ్ళాడుతా సినిమా లో మిగతా సినిమాలతో పోలిస్తే కాస్త ఎక్కువ బైక్ రైడింగ్ సన్నివేశాలు కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సన్నివేశాల్లో డూప్ లేకుండా నాగ్ తానే నటించారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తాజా ఇంటర్వ్యూ లో వెల్లడించారు. బైక్ పై 80.. 90 స్పీడ్ తో వెళ్లానని నాగార్జున చెప్పారు.

అయితే ఇప్పుడు మాత్రం బైక్ రైడింగ్ అంటే తనకు చాలా భయం అని ఇప్పుడు ఎవరైనా దర్శకులు వచ్చి సినిమాలో బైక్ రైడింగ్ చేసే సన్నివేశాలు చేస్తారా అని అంటే నో చెబుతాను అని అన్నారు. అంతేకాకుండా తన కుమారుడు నాగచైతన్య అఖిల్ కూడా అలాంటి సన్నివేశాలకు ఓకే చెబితే తాను మాత్రం ఒప్పుకోను అని అన్నారు. వారిని కూడా అలాంటి సన్నివేశాల్లో నటించనువ్వను అని నాగార్జున చెప్పారు. ఇదిలా ఉంటే నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ టీవీ షో తో పాటు పలు క్రేజీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నాగ్ ప్రస్తుతం ది గోస్ట్ అనే సినిమాతో పాటు సోగ్గాడే చిన్ని నాయన లాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న బంగార్రాజు చిత్రంలోనూ నటిస్తున్నారు.


'భోళాశంకర్' నుండి తమన్నా తప్పుకుందా..?

ద‌టీజ్ జ‌గ‌న్ : అప్ప‌ర్ క్యాస్ట్ ను ఇంప్ర‌స్ చేశాడ్రా!

బ్రేకింగ్: పంచ్ ప్రభాకర్ పై ఏపీ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్: ఏపీ ఐఏఎస్ కు షాక్ ఇచ్చిన హైకోర్ట్

రొమాంటిక్ కి రాజమౌళి రివ్యూ.. ఏమన్నారంటే?

అమెరికాలో.. చైనా ఇక అరవైరోజులే.. !

బద్వేల్ : ఈ ఎన్నిక రెఫరెండం కాదా ?

జగన్ కేసులపై తెలంగాణ హైకోర్టులో రోజువారీ విచారణ

బిగ్ బాస్ - 5 : కొత్త కెప్టెన్ గా షణ్ముక్.. రేషన్ మేనేజర్ ఎవరంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>