Daughter: కత్తితో ఫ్రెండ్ ను చంపేసి శవం మాయం చేశాడు. తండ్రిని పోలీసులకు పట్టించిన కూతురు !
భోపాల్: సంతోషంగా కాపురం చేసిన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం భార్య అనారోగ్యంతో చనిపోయింది. కొడుకు, కూతురితో కలిసి అతను నివాసం ఉంటున్నాడు. భార్య చనిపోవడంతో ఇంట్లో వయసుకు వస్తున్న కూతురిని పెట్టుకున్న తండ్రి నిర్లక్షంగా ప్రవర్తించాడు. స్నేహితులను ఇంటికి పిలిపించుకుని మందు పార్టీ జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ తో మందు తాగే సమయంలో కూతురిని ఆమ్లేట్లు వేసివ్వాలని, చికెన్ ప్రై చేసివ్వాలని ఇలా రకరకాల కోరికలు కోరుతున్నాడు. రాత్రి ఇంట్లో తండ్రి మందు పార్టీ జరుపుకున్నాడు. అదే సమయంలో అక్కడే ఫ్రెండ్ తో గొడవ పెట్టుకుని చంపేశాడు. తరువాత శవాన్ని తీసుకెళ్లి అటవి ప్రాంతంలో పూడ్చేసి చేతులు దులుపుకున్నాడు. కన్నతండ్రి తన కళ్ల ముందే ఒక వ్యక్తిని హత్య చెయ్యడం చూసిన ఆ అమ్మాయి మొదట షాక్ అయ్యింది. తరువాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కూతురు తన తండ్రి హత్య చేసి శవాన్ని తీసుకెళ్లి పూడ్చి పెట్టాడని సాక్షం చెప్పడం కలకలం రేపింది.
Cheating: విడాకులు వచ్చేశాయి, పెళ్లి చేసుకుందామని యువకుడితో లేడీ ?, బంగారం, లక్షలు స్వాహా !

భార్య చనిపోయింది
మధ్యప్రదేశ్ లోని చిందావారా జిల్లాలోని గ్రామంలో కన్హయ్య (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సంతోషంగా కాపురం చేసిన కన్హయ్య, అతని భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో కన్హయ్య భార్య చనిపోయింది. కొడుకు, కూతురితో కలిసి అతను నివాసం ఉంటున్నాడు.

ఇంట్లో ఫ్రెండ్స్ తో మందు పార్టీలు
భార్య చనిపోవడంతో ఇంట్లో వయసుకు వస్తున్న కూతురిని పెట్టుకున్న కన్హయ్య నిర్లక్షంగా ప్రవర్తించాడు. స్నేహితులను ఇంటికి పిలిపించుకుని మందు పార్టీ జరుపుకుంటున్న కన్హయ్య పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ తో మందు తాగే సమయంలో కూతురిని ఆమ్లేట్లు వేసివ్వాలని, చికెన్ ప్రై చేసివ్వాలని కన్హయ్య ఇలా రకరకాల కోరికలు కోరుతున్నాడు.

మద్యం మత్తులో ఏదేదో మాట్లాడుకున్నారు
రాత్రి ఇంట్లో కన్హయ్య మందు పార్టీ జరుపుకున్నాడు. మందుపార్టీకి కన్హయ్య అతని స్నేహితుడు అజయ్ వర్మాని పిలిపించాడు. కన్హయ్య వెంటనే అతని 13 ఏళ్ల కూతురిని పిలిచి చికెన్ ఫ్రై చేసివ్వాలని చెప్పాడు. ఆ అమ్మాయి చికెన్ ఫ్రై చేసి తండ్రి కన్హయ్యకు ఇచ్చింది. ఆ సమయంలో కన్హయ్య, అజయ్ వర్మ మద్యం మత్తులో ఏదేదో మాట్లాడుకున్నారు.

ఫ్రెండ్ ను చంపేసి పూడ్చేశాడు
అదే సమయంలో కన్హయ్య, అజయ్ వర్మాల మద్య డబ్బు విషయంలో పెద్ద రాద్దాంతం జరిగింది. అక్కడ మాటామాటా పెరిగిపోవడంతో కన్హయ్య కత్తి తీసుకుని అతని స్నేహితుడు అజయ్ వర్మాను దారుణంగా పొడిచి ఇంట్లోనే చంపేశాడు. పోలీసు కేసు అవుతుందని భయపడిన కన్హయ్య అజయ్ వర్మా శవాన్ని తీసుకెళ్లి గ్రామం సమీపంలోని అటవి ప్రాంతంలో అదే రోజు పూడ్చేసి చేతులు దులుపేసుకున్నాడు.

హత్య కేసులో కన్నతండ్రిని అరెస్టు చేయించిన కూతురు
కన్నతండ్రి కన్హయ్య తన కళ్ల ముందే ఒక వ్యక్తిని హత్య చెయ్యడం చూసిన అతని 13 ఏళ్ల కూతురు మొదట షాక్ అయ్యింది. తరువాత మరుసటి రోజు ఆ అమ్మాయి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన తండ్రి కన్హయ్య అతని స్నేహితుడు అజయ్ వర్మాను హత్య చేసి శవాన్ని తీసుకెళ్లి పూడ్చి పెట్టాడని సాక్షం చెప్పడం కలకలం రేపింది. పోలీసులు కన్హయ్యను అదుపులోకి తీసుకున్నారు.

రివర్స్ అయిన తండ్రి
తన కూతురిని తాను ఇంట్లో నాలుగు దెబ్బలు వేసి మందలించానని, అందుకే నేను హత్య చేశానని అపద్దం చెబుతోందని మొదట కన్హయ్య నేరం అంగీకరించలేదని, అతనికి నాలుగు తగిలిస్తే అజయ్ వర్మాను హత్య చేసిన విషయం అంగీకరించాడని స్థానిక పోలీసు అధికారి సంతోష్ దేహారియా స్థానిక మీడియాకు చెప్పారు. మొత్తం మీద కన్నతండ్రి హత్య కేసులో అతని కూతురు ప్రత్యక్షసాక్షి కావడం హాట్ టాపిక్ అయ్యింది.