PoliticsN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/----------------0181a6be-53b4-422a-bf1b-a9ffbdef55f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/----------------0181a6be-53b4-422a-bf1b-a9ffbdef55f2-415x250-IndiaHerald.jpgరేష‌న్ షాపుల ద్వారా మిని ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌ను విక్ర‌యించే అంశాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్టు కేంద్ర‌ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. నిన్న ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే అధ్యక్షతన వర్చువల్ సమావేశం నిర్వ‌హించారు. ఈ అంశాలను దేశంలో ఉన్న అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించారు. ఎలక్ట్రానిక్స్ , ఐటీ మంత్రిత్వ శాఖ, పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సమావేశానికి హాజ‌ర‌య్యారు. #రేష‌న్ షాపులో చిన్న సిలిండ‌ర్లు{#}Indian Oil Corporation;Bharat Petroleum Corporation Limited;India;Sudhanshu Pandey;local language;Governmentరేష‌న్ షాపులో చిన్న సిలిండ‌ర్ల విక్ర‌యాలు..!రేష‌న్ షాపులో చిన్న సిలిండ‌ర్ల విక్ర‌యాలు..!#రేష‌న్ షాపులో చిన్న సిలిండ‌ర్లు{#}Indian Oil Corporation;Bharat Petroleum Corporation Limited;India;Sudhanshu Pandey;local language;GovernmentThu, 28 Oct 2021 13:28:49 GMTసుధాన్షు పాండే అధ్యక్షతన  వర్చువల్ సమావేశం నిర్వ‌హించారు.  ఈ అంశాలను దేశంలో ఉన్న అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించారు. ఎలక్ట్రానిక్స్ , ఐటీ మంత్రిత్వ శాఖ, పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సమావేశానికి హాజ‌ర‌య్యారు.

వీటితో పాటు సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ తో  పాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్,  భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ , హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించిన  అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన త‌రువాత‌ ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో ఎఫ్‌పీఎస్ ఆర్థిక సాధ్యతను పెంపొందించడానికి బలమైన చర్యలు తీసుకుంటామని  పేర్కొంది. ఎఫ్‌పీఎస్ ద్వారా చిన్న ఎల్‌పీజీ సిలిండర్ల రిటైల్ విక్రయాల ప్రణాళిక పరిశీలనలో ఉన్న‌ద‌ని ప్ర‌క‌టించింది.

చమురు మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు సైతం రేషన్ దుకాణాల ద్వారా చిన్న ఎల్‌పీజీ సిలిండర్ల విక్రయాల ప్రతిపాదనను ప్రోత్సహించారు. ఆసక్తి ఉన్న రాష్ట్రాల‌కు సహకారం అందిస్తామని వివ‌రించారు.  కామన్ సర్వీస్ సెంటర్‌ల సహకారంతో ఎఫ్‌పీఎస్ ప్రాముఖ్యత పెరుగుతుందని  ప‌లు రాష్ట్ర ప్రభుత్వాలు స‌మావేశంలో వెల్ల‌డించాయి.  స్థానిక అవసరాలకు అనుగుణంగా సాధ్య‌, అసాధ్యాల‌ను సమీక్షించేందుకు సీఎస్‌సీతో సమన్వయం చేసుకుంటామ‌ని పేర్కొన్నారు. ముద్రా రుణాన్ని ఎఫ్‌పీఎస్ డీలర్లకు వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తున్న‌ది. దీని ద్వారా  వారు మూలధనాన్ని పెంచుకోవచ్చని పేర్కొంది. దేశంలో ఉన్న‌టువంటి అన్ని  రాష్ట్రాలు ఈ కార్యక్రమాలను చేపట్టి అవసరాలకు అనుగుణంగా ప‌నిచేయాల‌ని ఆహార కార్యదర్శి సూచ‌న‌లు చేశారు. ఇది ఇలా ఉండ‌గానే మ‌రోవైపు వారం రోజుల్లోనే గ్యాస్ ధ‌ర రూ.100 పెరుగ‌నుంద‌ని స‌మాచారం. అయితే రేష‌న్ షాపుల ద్వారా మిని ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌ను విక్ర‌యించ‌నున్నార‌ని తెలియ‌గానే సోష‌ల్ మీడియాలో ఇది వైర‌ల్‌గా మారింది.



 



'త్రివిక్రమ్ - అల్లు అర్జున్' కాంబో మళ్ళీ రిపీట్.. హింట్ ఇచ్చిన నిర్మాత..!!

జగన్ కేసులపై తెలంగాణ హైకోర్టులో రోజువారీ విచారణ

బిగ్ బాస్ - 5 : కొత్త కెప్టెన్ గా షణ్ముక్.. రేషన్ మేనేజర్ ఎవరంటే..?

ఇండియా సెమీఫైనల్ చేరాలంటే?

డిఫెన్స్ లో దొంగలు పడ్డారు.. కీలక సమాచారం ఏమవుతుంది..!

బాలకృష్ణ ఫ్యూచర్ ప్రాజెక్ట్.. ఇండస్ట్రీ హిట్టేనా?

బద్వేలు: వైసీపీ కామెడీ మ‌రీ ఓవ‌ర్‌గా ఉందా..!

బిగ్ బాస్ 5: తన స్వార్థం కోసమే సిరి షణ్ముఖ్ ను వాడుకుంటోందా?

హరిహర వీరమల్లు పైనే అందరి చూపు.. ఎందుకంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>