PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dthgthdry-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/dthgthdry-415x250-IndiaHerald.jpgరాజధాని రైతులకు సంఘీభావం తెలిపిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ... కీలక ప్రకటన చేసారు. తుళ్లూరు రైతుల శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపిన లక్ష్మీ నారాయణ... రైతుల మహా పాదయాత్ర కి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 81 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. రైతులు భూములు ఇచ్చింది వారి స్వప్రయోజనాల కోసం కాదు...రాష్ట్ర ప్రయోజనాల కోసం అని అన్నారు ఆయన. మహిళలు రోడ్డు మీద కూర్చుని ఆందోళన చేస్తుంటే మనసు కలిచివేస్తుంది అని వ్యాఖ్యలు చేసారు. మాతృమూర్తులను jd{#}court;CBI;Lakshmi Devi;Maha;Director;Capital;Government;policeబ్రేకింగ్: పాదయాత్ర చేస్తున్నా: సిబిఐ మాజీ జెడిబ్రేకింగ్: పాదయాత్ర చేస్తున్నా: సిబిఐ మాజీ జెడిjd{#}court;CBI;Lakshmi Devi;Maha;Director;Capital;Government;policeThu, 28 Oct 2021 12:14:37 GMTరాజధాని రైతులకు సంఘీభావం తెలిపిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ... కీలక ప్రకటన చేసారు. తుళ్లూరు రైతుల శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపిన లక్ష్మీ నారాయణ... రైతుల మహా పాదయాత్ర కి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 81 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. రైతులు భూములు ఇచ్చింది వారి స్వప్రయోజనాల కోసం కాదు...రాష్ట్ర ప్రయోజనాల కోసం అని అన్నారు ఆయన. మహిళలు రోడ్డు మీద కూర్చుని ఆందోళన చేస్తుంటే మనసు కలిచివేస్తుంది అని వ్యాఖ్యలు చేసారు.

మాతృమూర్తులను పోలీసులు కొట్టడం చూసి భాధ ఆవేదన కలిగింది అని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రాజధానిని ఇక్కడే నిర్మించాలి అని డిమాండ్ చేసారు. ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్పకుండా రాజధానిపై ఒక విధానంతో ముందుకు వెళ్ళాలి అని ఆయన కోరారు. రాజధాని 29 గ్రామాల సమస్య కాదు...అమరావతి అనేది రాష్ట్ర సమస్య అని అన్నారు. గత ప్రభుత్వం కొంత ఖర్చు చేసి ఎంతో కొంత నిర్మాణ పనులు చేశారు అని విమర్శలు చేసారు. గత ప్రభుత్వం 10 వెల కోట్లు ఖర్చు చేసి ఇక్కడ కొన్ని నిర్మాణాలు చేసింది అని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ నిర్మాణాలను పరిశీలించాను. వాటిలో చాలా నిర్మాణాలు70 నుండి 90 శాతం పూర్తి అయ్యాయి అన్నారు ఆయన. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రైతుల త్యాగం మరిచింది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. రైతులు వారి స్వార్ధం కోసం భూములు ఇవ్వలేదు అని రైతులపై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు అంటూ మండిపడ్డారు. 10 ఏళ్ల తరువాత కూడా రాజధాని నిర్మాణం పూర్తి కాకపోతే రైతులకు కౌలు పీరియడ్ మరో ఐదేళ్లు పెంచాలి అని కోరారు. రాజధాని రైతుల ఉద్యమం  కు తనకున్న పరిజ్ఞానం మేరకు న్యాయ సహాయం అందిస్తా అని స్పష్టం చేసారు. రైతుల న్యాయస్థానం నుండి దేవస్థానం రైతు మహా పాదయాత్రలో నేను వీలున్న చోట భాగస్వామిని అవుతా అన్నారు.



బాలకృష్ణ ఫ్యూచర్ ప్రాజెక్ట్.. ఇండస్ట్రీ హిట్టేనా?

బిగ్ బాస్ 5: తన స్వార్థం కోసమే సిరి షణ్ముఖ్ ను వాడుకుంటోందా?

హరిహర వీరమల్లు పైనే అందరి చూపు.. ఎందుకంటే?

బ‌ద్వేలు: ఓట‌ర్లు దండెత్తితే.. ఫ‌లితం ఎటు...?

మనీ: నెలకు రూ.1300 తో చేతికి రూ.40 లక్షలు..!!

రేషన్ షాపుల్లో సిలిండర్ల అమ్మకం..!

బద్వేలు: ఆ ఒక్క‌డి బాధ‌లకు అంతే లేకుండా ఉందా..!

కేసీఆర్ VS ఈటెల : ఈట‌ల‌కు ఇవే ప్ల‌స్ పాయింట్లు..!

అమ్మా.. నేను చనిపోతున్నా.. క్షమించు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>