Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india77ee42bc-3ff0-4af9-a549-048dc1fb9ecf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india77ee42bc-3ff0-4af9-a549-048dc1fb9ecf-415x250-IndiaHerald.jpgరెండవ దశ కరోనా వైరస్ తో మొన్నటి వరకు ప్రపంచ దేశాలు అల్లాడిపోయాయ్. ఈ క్రమంలోనే మరోసారి కరోనా వైరస్ కట్టడి కోసం కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చాయి. దీంతో ప్రపంచ దేశాలలో ఇటీవలే కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించింది. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమయింది. దీంతో ప్రజలందరిలో నిర్లక్ష్యం కూడా పెరిగిపోయింది. ఒకప్పుడు కరోనా వైరస్ పేరెత్తితేనే భయపడిపోయారు జనాలు. ఇక ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మాస్క్ పెట్టుకోవడం.. వెంటనే శానిటైజర్ పెట్టుకోవడం.. ఇక ఎప్పటికప్పుడు చేతIndia{#}Russia;American Samoa;Coronavirusఅమ్మో.. భారత్లో అది భయపెడుతుంది?అమ్మో.. భారత్లో అది భయపెడుతుంది?India{#}Russia;American Samoa;CoronavirusThu, 28 Oct 2021 11:00:00 GMTరెండవ దశ కరోనా వైరస్ తో మొన్నటి వరకు ప్రపంచ దేశాలు అల్లాడిపోయాయ్. ఈ క్రమంలోనే మరోసారి కరోనా వైరస్ కట్టడి కోసం కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చాయి. దీంతో ప్రపంచ దేశాలలో ఇటీవలే కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించింది. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమయింది. దీంతో ప్రజలందరిలో నిర్లక్ష్యం కూడా పెరిగిపోయింది. ఒకప్పుడు కరోనా వైరస్ పేరెత్తితేనే భయపడిపోయారు జనాలు. ఇక ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మాస్క్ పెట్టుకోవడం.. వెంటనే శానిటైజర్ పెట్టుకోవడం.. ఇక ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటూ జాగ్రత్తపడటం లాంటివి చేసేవారు.


 అంతేకాకుండా భౌతిక దూరం పాటిస్తూ  వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకునేవారు. కరోనా వైరస్ ప్రభావం కాస్త తగ్గడం.. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత మాత్రం నిర్లక్ష్యం పెరిగిపోయింది.  వైరస్ అంటే లైట్ తీసుకుంటున్నారు. అయితే ఇలా లైట్ తీసుకోవడం కారణంగానే అగ్రరాజ్యాల్లో మళ్ళీ  వైరస్ కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం అగ్ర రాజ్యాలలో కొత్త వైరస్ తో వణికిపోతూ  ఉండడం గమనార్హం. ప్రస్తుతం బ్రిటన్, రష్యా లాంటి దేశాలలో మళ్లీ లాక్డౌన్ విధించే పరిస్థితి వచ్చింది. అగ్రరాజ్యమైన అమెరికా లో  వైరస్ కేసులు భారీగా వెలుగులోకి వస్తున్నాయి.


 అటు భారత్లో కూడా జనాల్లో ఇలాంటి నిర్లక్ష్యం బాగా పెరిగిపోయింది అని చెప్పాలి  ఇటీవలి కాలంలో ఎవరూ కూడా ఎక్కడా మాస్కు ధరించి కనిపించడం లేదు  ఒకప్పటిలా శానిటైజర్ ఉపయోగించడానికి కూడా అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇక భౌతిక దూరం అనే విషయాన్ని అయితే పూర్తిగా గాలికొదిలేశారు అనే చెప్పాలి. ప్రజలందరూ ఇలా నిర్లక్ష్యంతో ఉన్న సమయంలో ప్రస్తుతం దేశంలో కొత్త వేరియంట్ కరోనా  వెలుగులోకి రావడం సంచలనం గా మారిపోయింది. బ్రిటన్లో విజృంభిస్తున్న డెల్టా ప్లస్ ఏ వై 4.2 వేరియంట్ ఇటీవల ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఆరుగురు ఈ వైరస్ బారిన పడ్డారు. అటు బెంగళూరులో కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. తెలంగాణలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు ఈ కొత్త వేరియంట్ బారిన పడినట్టు తెలుస్తోంది. దీంతో అందరూ ఈకొత్త వేరియంట్  గురించి భయపడి పోతున్నారు.



నాగశౌర్యకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ శాపమా !

బద్వేలు: ఆ ఒక్క‌డి బాధ‌లకు అంతే లేకుండా ఉందా..!

కేసీఆర్ VS ఈటెల : ఈట‌ల‌కు ఇవే ప్ల‌స్ పాయింట్లు..!

అమ్మా.. నేను చనిపోతున్నా.. క్షమించు?

కేసీఆర్ VS ఈటెల : ఈటెల నిజం కేసీఆర్ మోసం!

ఆత్మ‌హ‌త్య‌ల్లో తెలంగాణ స్థానం ఎంతో తెలుసా..?

వినూత్న రీతిలో వరుడు కావలెను !

వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం పీకే మాస్టర్‌ ప్లాన్..?

ఆయ‌న ఏమీ స‌మాధానం చెప్ప‌రు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>