Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-future-project-921770a1-249e-446c-ace1-983700620191-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-future-project-921770a1-249e-446c-ace1-983700620191-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ అంచనాల మధ్య ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సినిమాలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా కూడా ఒకటి. ఎందుకంటే బాలకృష్ణ సూపర్ హిట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ముచ్చటగా మూడోసారి బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు. అయితే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాయి. బాలకృష్ణ అభిమానుల నాడిని తెలుసుకున్న బోయపాటి శ్రీను అభిమానులు ఎలా బాలయ్యను చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తు మంచిTollywood-future-project {#}Balakrishna;boyapati srinu;pragya jaiswal;Blockbuster hit;Director;Legend;Telugu;Hero;Cinemaబాలకృష్ణ ఫ్యూచర్ ప్రాజెక్ట్.. ఇండస్ట్రీ హిట్టేనా?బాలకృష్ణ ఫ్యూచర్ ప్రాజెక్ట్.. ఇండస్ట్రీ హిట్టేనా?Tollywood-future-project {#}Balakrishna;boyapati srinu;pragya jaiswal;Blockbuster hit;Director;Legend;Telugu;Hero;CinemaThu, 28 Oct 2021 12:15:00 GMTప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ అంచనాల మధ్య ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సినిమాలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా కూడా ఒకటి. ఎందుకంటే బాలకృష్ణ సూపర్ హిట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ముచ్చటగా మూడోసారి బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు. అయితే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాయి. బాలకృష్ణ అభిమానుల నాడిని తెలుసుకున్న బోయపాటి శ్రీను అభిమానులు ఎలా బాలయ్యను  చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తు మంచి విజయాలను సాధిస్తున్నాడు బోయపాటి శ్రీను.


 ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఏదైనా సినిమా వస్తుంది అంటే చాలు.. భారీ రేంజిలో అంచనాలు కూడా పెరిగి పోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్లో అఖండ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ టీజర్ చూస్తే బాలకృష్ణ పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది అని అర్థమవుతుంది. అయితే ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్  నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో హీరో శ్రీకాంత్ కూడా అఖండ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.


 అయితే ఈ సినిమాలో ఇప్పటివరకు బాలకృష్ణ తన కెరియర్ లో పోషించని అఘోరా పాత్రలో నటిస్తుండడం ఇక భారీ రేంజ్లో ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది.  సాధారణంగానే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అంటే పవర్ ఫుల్ పంచ్ డైలాగులు..యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. మరి బాలకృష్ణుని సరికొత్తగా అఘోర పాత్రలో బోయపాటి చూపించబోతున్నాడు. ఈ పాత్ర ఎలా ఉండబోతోంది అనే దానిపై మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతూంది.



బాలకృష్ణ ఫ్యూచర్ ప్రాజెక్ట్.. ఇండస్ట్రీ హిట్టేనా?

బిగ్ బాస్ 5: తన స్వార్థం కోసమే సిరి షణ్ముఖ్ ను వాడుకుంటోందా?

హరిహర వీరమల్లు పైనే అందరి చూపు.. ఎందుకంటే?

బ‌ద్వేలు: ఓట‌ర్లు దండెత్తితే.. ఫ‌లితం ఎటు...?

మనీ: నెలకు రూ.1300 తో చేతికి రూ.40 లక్షలు..!!

రేషన్ షాపుల్లో సిలిండర్ల అమ్మకం..!

బద్వేలు: ఆ ఒక్క‌డి బాధ‌లకు అంతే లేకుండా ఉందా..!

కేసీఆర్ VS ఈటెల : ఈట‌ల‌కు ఇవే ప్ల‌స్ పాయింట్లు..!

అమ్మా.. నేను చనిపోతున్నా.. క్షమించు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>