MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bheemla-nayakc64e96d1-0eb1-4d51-906f-8da166ff5dfe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bheemla-nayakc64e96d1-0eb1-4d51-906f-8da166ff5dfe-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ లో తెరకెక్కుతున్న పలు మల్టీస్టారర్ సినిమాలలో 'భీమ్లా నాయక్' కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ క్రేజీ మల్టీస్టారర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. యువ దర్శకుడు సాగర్ కె. చంద్ర డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన హీరోల టీజర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచBheemla Nayak{#}sithara;Film Industry;Amarnath K Menon;trivikram srinivas;rana daggubati;Yuva;naga;Industry;Daggubati Venkateswara Rao;Venkatesh;March;Telugu;Pawan Kalyan;Makar Sakranti;January;Heroine;Diwali;kalyan;News;Cinema'భీమ్లా నాయక్' నుండి మరో టీజర్.. ఎప్పుడంటే..?'భీమ్లా నాయక్' నుండి మరో టీజర్.. ఎప్పుడంటే..?Bheemla Nayak{#}sithara;Film Industry;Amarnath K Menon;trivikram srinivas;rana daggubati;Yuva;naga;Industry;Daggubati Venkateswara Rao;Venkatesh;March;Telugu;Pawan Kalyan;Makar Sakranti;January;Heroine;Diwali;kalyan;News;CinemaThu, 28 Oct 2021 17:30:00 GMTటాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ లో తెరకెక్కుతున్న పలు మల్టీస్టారర్ సినిమాలలో 'భీమ్లా నాయక్' కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ క్రేజీ మల్టీస్టారర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. యువ దర్శకుడు సాగర్ కె. చంద్ర డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన హీరోల టీజర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మరో అప్ డేట్ కూడా త్వరలోనే రాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

 అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో టీజర్ ను కూడా రెడీ చేశారట చిత్రయూనిట్. దీపావళి సందర్భంగా ఈ టీజర్ ని విడుదల చేసేలా చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్, రానా ఇద్దరికీ సంబంధించిన టీజర్లకి సోషల్ మీడియాలో సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. మరి త్వరలో విడుదల కాబోయే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్, రానా ఇద్దరూ కనిపిస్తారా? లేదా? ఒకవేళ ఇద్దరూ ఒకే టీజర్లో కనిపిస్తే అది ఏ రేంజ్ లో ఉండబోతుందోనని ఇప్పటి నుంచే అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారిక ప్రకటన చేసింది.కానీ తాజా సమాచారం మేరకు ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 29 న ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిత్ర యూనిట్ విడుదల తేదీ పై ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రానాకు జోడిగా సంయుక్త మీనన్ కనిపించనుంది. ఇక మలయాళంలో హిట్టయిన అయ్యప్పనున్ కోషియం అనే సినిమాకి తెలుగు రీమేక్ గా 'భీమ్లా నాయక్' తెరకెక్కుతోంది...!!



కేసీఆర్ పై ఏపీ మంత్రి విమర్శలు, బండి సంజయ్ నోటి దగ్గర మైక్ పెట్టండి

పెద్దన్న లో రజినీ విశ్వరూపమే!!

కేంద్రమంత్రి మాండవియా:భారత్ పర్యాటక కేంద్రం కానుందా..!

ఫ్యామిలీ మెన్ క్రేజ్ సమంత కు బాగానే యూజ్ అవుతుంది!!

కోహ్లీ మాటలతో నిరాశకు గురయ్యాను : జడేజా

ఇండస్ట్రీ లోకి కొత్త నీరు.. కుర్రాళ్ళు అదరగొడుతున్నారు!!

పట్టాభిని కొట్టారు: ఎంపీ సంచలన వ్యాఖ్యలు

తన పనికి క్షమాపణలు చెప్పిన డికాక్...

కేసీఆర్ Vs ఈటెల : సరిహద్దు దాటిన బేరం! కూసింత సూడు బాబూ!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>