PoliticsVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/huuzurabad-electionb824c7b6-fbbf-4749-b9c3-8b76b5c8dd44-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/huuzurabad-electionb824c7b6-fbbf-4749-b9c3-8b76b5c8dd44-415x250-IndiaHerald.jpgహూజూరాబాద్ ... తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారత్ చూపు ఇక్కడి ఉప ఎన్నికలపై పడింది. ఇందుకు కారణాలు చాలా ఉన్నాయి.ఇక్కడి అభ్యర్థుల గెలుపు ఎలా ఉన్నా పార్టీలు చెప్పుకునే తీరు మాత్రం చాలా చిత్రంగా ఉండ నుంది. గెలిస్తే ఎం చెప్పుకోవాలి?, ఓడితే ఏవరి మీద దుమ్మెత్తి పోయాలి ? అని నేతలు ఆలోచనలు చేస్తున్నారు. ఓటరు మనోగతం ఇంత వరకు వెల్లడి కాకపోవడంతో అభ్యర్థల్లో గెలుపు ఆశ, ఓటమి భయం రెండూ ఉన్నాయి.huuzurabad election{#}Chandra Shekhar;Elections;Telugu;Telangana;Minister;November;Yevaru;Telangana Chief Minister;Congress;Party;Bharatiya Janata Party;Indiaకెసిఆర్ vs ఈటల : గెలిస్తే పార్టీ విజయం - ఓడితే అభ్యర్థి లోపంకెసిఆర్ vs ఈటల : గెలిస్తే పార్టీ విజయం - ఓడితే అభ్యర్థి లోపంhuuzurabad election{#}Chandra Shekhar;Elections;Telugu;Telangana;Minister;November;Yevaru;Telangana Chief Minister;Congress;Party;Bharatiya Janata Party;IndiaWed, 27 Oct 2021 12:30:00 GMTపార్టీ విజయం - ఓడితే అభ్యర్థి లోపం

హూజూరాబాద్ ... తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారత్ చూపు ఇక్కడి ఉప ఎన్నికలపై పడింది. ఇందుకు కారణం లేకపోలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకు వచ్చిన పోరాటయోదుడిగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి మేం ఓనర్లం అని చెప్పుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రంలో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మా అధినేతే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఇక్కడ ఎన్నికల బరిలో ఉన్నారు. నేతల హోరా హోరీ ప్రచారాలు, విమర్శలు అన్నీ ముగిసాయి. మరో రెండు రోజుల్లో ఎన్నిక జరగనుంది. నవంబర్ 2వ ఫలితం తేలనుంది. ఇక్కడి అభ్యర్థుల గెలుపు ఎలా ఉన్నా పార్టీలు చెప్పుకునే తీరు మాత్రం చాలా చిత్రంగా ఉండ నుంది. గెలిస్తే ఎం చెప్పుకోవాలి?, ఓడితే ఏవరి మీద దుమ్మెత్తి పోయాలి ? అని నేతలు ఆలోచనలు చేస్తున్నారు. ఓటరు మనోగతం ఇంత వరకు వెల్లడి కాకపోవడంతో అభ్యర్థల్లో గెలుపు ఆశ, ఓటమి భయం రెండూ ఉన్నాయి. ప్రజలు అభివృద్ధికి ఓటు వేేస్తారని అధికార పక్షం పేర్కోంటోంది. ఆత్మగౌరవానికి ఓటు వేస్తారని బి.జెపి గట్టి నమ్మకంతో ఉంది. ప్రజలు మా చేతులు వదలరని కాంగ్రెస్ నేతు పేర్కోంటున్నారు. ప్రచారం ముగిసి, ప్రలోభాలకు తెరతీస్తున్న సమయం ఇది..
 సాధారణంగా శాసన సభ ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఇందుకు కారణం లేకపోలేదు. మీరు అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే  మీ ప్రాంత అభివృద్ది మరింత ముందుకు పోతుందనిఎన్నికల ప్రచారంలో  పాల్గోన్న నేతలు చెబుతారు.  అదే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఆయనం చేయగలడు?  ప్రతిపక్షంలో కూర్చోవడం మిన హా లాంటి ప్రశ్నలు  ప్రజలను ప్రశ్నిస్తారు. ఇలా చేయడం ద్వారా తమకే ఓట్లు వేయాలని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తారు. ఇలాంటి ప్రచార ప్రలోభాలతో ఓటర్లు సహజంగా అదికార పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.
కానీ దుబ్బాకు ఎన్నికతో ట్రెండ్  కోంత మారింది. ఉపఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు కూ ప్రజలు పట్టంగడతారు అనే విధంగా అక్కడి ప్రజలు నాడు తీర్పు ఇచ్చారు.నాటి తీర్పు తరువాత వచ్చిన    ఉప ఎన్నికల్లో పునరావృతం కాలేదు.

ఎన్నికల గెలుపు ఓటములను  పార్టీలు తమకు అనుకూలంగా పేర్కోంటుండటం ఇక్కడ గమనార్హం. ఎవరు గెలిచినా ఇది తమ పార్టీ విజయమని రాజకీయ పార్టీలు, నేతలు చెప్పుకుంటారు. అదే ఓటమి పాలైతే  తమ అభ్యర్థి స్వయం కృతాపరాధం అని  చెబుతారు.  తమ అభ్యర్థి సొంత నిర్ణయాల వల్ల ఓటమి పాలయ్యామని, సీనియర్ల మాటలు ప్రచారంలో ఎక్కడా వినలేదని  సొంత అభ్యర్థి పైనే  పరోక్షంగా ఆరోపణలు చేస్తారు.తమ అభ్యర్థి స్వయం కృతాపరాధం వల్ల ఓటమి పాలయ్యామని చెప్పుకుంటారు.





నిఖిల్ నాలుగు పడవల ప్రయాణం.. తీరం చేరేనా!!

పట్టాభిని చంద్రబాబు చంపేస్తాడు, అందుకే పారిపోయాడు: విజయసాయి రెడ్డి

పెట్రో ధరల పెరుగుదలపై కేంద్రమంత్రి కీలక ప్రకటన..!

కెసిఆర్ vs ఈటల : గెలిస్తే పార్టీ విజయం - ఓడితే అభ్యర్థి లోపం

ఆయన్ను ఎలా నియమించారు...? ఏపీ హైకోర్ట్ షాక్...!

బద్వేలు: జ‌గ‌న్ స్ట్రాట‌జీ మార్చేశారా...!

డైరెక్షన్ పై గురి పెట్టిన యంగ్ హీరో?

కేసీఆర్ VS ఈటెల : హై టెన్షన్లో కేసీఆర్!

కేసీఆర్‌ Vs ఈటల: అభినవ లగడపాటి కొండా విశ్వేశ్వరరెడ్డి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>